May 3, 2024

లోపలి ఖాళీ – భూమిపుండు

రచన: రామా చంద్రమౌళి సింగిల్‌ పేరెంట్‌ సునంద. గత ఇరవై రెండేళ్ళుగా హైస్కూల్‌ పిల్లలకు ‘ చరిత్ర ’ ను బోధిస్తూ విద్యార్థులందరిలోనూ. సహ ఉపాధ్యాయు లందరిలోనూ ఉత్తమ అధ్యాపకురాలిగా పేరు తెచ్చుకుని గత సంవత్సరమే ప్రభుత్వం నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా కూడా స్వర్ణ పతకాన్నీ, ప్రశంసా పత్రాన్నీ పొందిన సునంద. గత అరగంట నుండి ఆ చెట్టుకింద కూర్చుని తదేకంగా ఆ భూమిపుండు దిక్కు చూస్తూనే ఉంది. అప్పుడామె హృదయం కూడా సరిగ్గా […]

తనివి తీరింది

రచన: యశస్వి జవ్వాది డాక్టర్ విశ్వం మనసు అలజడిగా ఉంది. తన మనసు లోతుల్లో తాను బ్రతుకుతున్న వ్యవస్థను మోసం చేస్తున్నాననే భావన వలన చాలా భారంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే అతని మొహం మీద ఒత్తిడి ఛాయలు పేరుకున్నాయి. ఎవరి మొహం చూడకుండా నేరుగా తన క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళాడు. టేబుల్ మీదనున్న పేషెంట్ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూసాడు. ఈలోగా, “అయ్యా!! లోపలకు రావచ్చా?” అంటూ సగం తెరచిన […]

బాలమాలిక – ‘నెపాలెందుకు?’

రచన: విశాలి పేరి సుధన్వ స్కూల్ నుంచి వచ్చి స్కూల్ బాగ్ విసిరేసి రాఘవయ్యగారి గదిలోకి వెళ్ళి “తాతయ్యా! నాకు రన్నింగ్ లో సెకండ్ వచ్చింది” అని చెప్పాడు. “కంగ్రాట్స్ నాన్నా!” అన్నాడు రాఘవయ్య. “నాకు పార్టీ కావాలి మరి!” అడిగాడు సుధన్వ. “ఓ తప్పకుండా, ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రా” సుధన్వ వంటింట్లోకి వెళ్ళి తల్లి, నాన్నమ్మ కి తను ఎలా గెలిచింది కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు. “అమ్మా ఎంత స్పీడ్ గా […]

విరించినై విరచించితిని… సిరివెన్నెల

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి చిత్రసీమలో చక్కటి పదలాలిత్యంతో, మధురమైన మాటలనే పాటలుగా మలుచుకుంటూ, చిన్న వయసులోనే పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారిని వారి ఇంటి దగ్గర కలుసుకున్నాను. ఆయన గది ఒక సాహిత్యవనం లాగానే కనిపించింది. ఇంటినిచూసి, ఇల్లాలిని చూడమని సామెత. కాని ముందుగా ఇల్లాలిని చూశాకే ఇంటిని చూశాను. శ్రీమతి పద్మావతిగారు చక్కని ఆతిథ్యమిచ్చారు. “విరించినై విరచించితిని” మధురంగా మదిలో మెదులుతుండగానే చిరునవ్వుతో వచ్చారు సిరివెన్నెల. కబుర్ల కలబోతలోనే మా గోష్ఠి […]

సుందరము – సుమధురము – 3

రచన: నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘వాగ్దానం’ చిత్రంలోని ‘నా కంటి పాపలో నిలిచిపోరా…’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. కవితాచిత్ర వారి పతాకంపై, 1961 అక్టోబరు 5న విడుదలైన ఈ చిత్రానికి, ఆచార్య ఆత్రేయ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. సత్యనారాయణ మరియు శ్రీ డి. శ్రీరామమూర్తి గారాలు చిత్రనిర్మాతలు. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి గారలు నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు చాలా […]

రాగమాలికలు – 1

రచన: రామలక్ష్మి కొంపెల్ల – కర్నాటక సంగీతంలో ఉన్న రాగాలు ఎంతో మధురంగా ఉంటాయి. సరిగమపదని ఏడు స్వరాలే అయినా వాటిల్లోంచి మన సంగీత కర్తలు ఎన్నో మధురమైన రాగాలు కనిపెట్టి, వాటిల్లో ఎన్నో భక్తి గీతాలను, కీర్తనలను సమకూర్చారు. రాగమాలిక అంటే? రాగాలతో అల్లిన ఒక దండ. రెండు లేక అంతకన్నా ఎక్కువ రాగాలు ఉపయోగించి చేసే రచనను రాగమాలిక అంటారు. ఒకే రకం పువ్వులతో కట్టే మాల కంటే, రకరకాల పువ్వులతో కట్టే కదంబమాల […]

దానశీలత

రచన: సి.హెచ్.ప్రతాప్     దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. నభూతో నభవిష్యతి అన్న చందాన అతని దాన ప్రస్థానం సాగింది. జన్మత: సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన ఇంద్రుడు ఒక కపట ఉపాయం ఆలోచించి పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు. దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచకుండలాలు ఇవ్వమని అడుగుతాడు. […]

వెంటాడే కథ 19

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

జగజ్జనని

రచన: లక్ష్మీ మైథిలి చిరుజల్లులు కురిసే ఆషాఢమాసంలో చల్లని తల్లి అమ్మవారి జాతర ఆడపడుచులు అర్పించే బోనాల పండుగ భక్తులను అనుక్షణం కాపాడే జగజ్జనని ఉజ్జయిని మహంకాళిగా వెలసిన ఆదిశక్తి పసుపు కుంకుమలతో పూజలందుకునే మహాశక్తి భక్తజనుల కీర్తనలతో పరవశించే పరాశక్తి లాల్ దర్వాజాలో అంగరంగ వైభవం వివిధ పూల అలంకరణతో శోభిల్లే దేవత వాడవాడలా నవ్యశోభలతో విరాజిల్లుతోంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలే బోనాల పండుగ ప్రతీకలు ఇంతులు గజ్జెకట్టి బోనాలెత్తేవేళ జంటనగరాల ఉత్సవాలలో సాకం..పాకం నైవేద్యం […]

ఓ మగువా …..

రచన: పి.రాధాకృష్ణ కదిలే కాలపు లెక్కలలో శూన్యపు ఆశల హెచ్చువేతలు, విభజనకాని కలతల భాగాహారాలు కుదిరించలేని బంధాల కూడికలు, మరెన్నో మమతల తీసివేతలు అన్నింటిలో… ఎదురుపడని సంతోషాన్ని నీలో నువ్వు వెతుక్కోవాలి ప్రేమ గూడును అల్లుకోవాలి కళ్ళ టేపుతో నీ చుట్టుకొలతలు కొలిచేస్తారు ఎక్సరే చూపుతో నీ అంగాంగాల లోతుల్ని తాకేస్తారు రంపపు మాటలతో నీ మనసు ముక్కలు చేసేస్తారు. అన్నింటిలో… తప్పుకు తిరిగే భద్రతను నీకై నువ్వు వెతుక్కోవాలి పట్టుకొమ్మను ఒడిసిపట్టాలి ఋతుక్రమంలో రుతుస్రావం గర్భస్థానాన […]