April 28, 2024

పరవశానికి పాత(ర) కథలు – చెన్నకేశవ జావా అమ్మేశాడు

రచన: డా. వివేకానందమూర్తి “మళ్లా కొత్త జావా కొంటావా?” అని అడిగితే “నాకు జావా వొద్దు. ఇండోనేషియా వద్దు. ఊరికే ఇచ్చినా పుచ్చుకోను” అని ఖండితంగా చెప్పేశాడు. * * * అవాళ అర్జంటు పనిమీద జావా మీద అర్జంటుగా అర్ధరాత్రి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి బయల్దేరాడు చెన్నకేశవ. చీకట్లో కొన్న బండి చీకటిని చీల్చడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రయాణం చేస్తోంది. కాని చీకటిని ఎవరు చీల్చగలరు? ఎందుకు చీల్చుదురు? చీకటి చీలిపోతే చీకట్లో బతికే దౌర్భాగ్యులకు బతుకు […]

తాత్పర్యం – సొరంగం

రచన:- రామా చంద్రమౌళి కల భళ్ళున చిట్లి చెదిరిపోయింది. నల్లని ఒక మహాబిలంలోనుండి..చిక్కని చీకటిని చీల్చుకుంటూ..తెల్లగా వందల వేల సంఖ్యలో బిలబిలమని పావురాల మహోత్సర్గం.విచ్చుకుంటున్న రెక్కల జీవధ్వని.ఒక ధవళ వర్ణార్నవంలోకి పక్షులన్నీ ఎగిరి ఎగిరి..ఆకాశం వివర్ణమై..దూరంగా..సూర్యోదయమౌతూ..బంగారురంగు..కాంతి జల. అంతా నిశ్శబ్దం..దీర్ఘ..గాఢ..సాంద్ర నిశ్శబ్దం. లోపల..గుండెల్లో ఏదో మృదు ప్రకంపన.అర్థ చైతన్య..పార్శ్వజాగ్రదావస్థలో..వినీవినబడని సారంగీ విషాద గంభీర రాగ ధార. ఏదో అవ్యక్త వ్యవస్థ ..విచ్ఛిన్నమౌతున్నట్టో..లేక సంలీనమై సంయుక్తమౌతున్నట్టో..విద్యుత్ప్రవాహమేదో ప్రవహిస్తోంది ఆపాదమస్తకం ఒక తాదాత్మ్య పారవశ్యంలో. భాష చాలదు కొన్ని అనుభూతులను […]

అర్చన కనిపించుట లేదు – 1

రచన: – కర్లపాలెం హనుమంతరావు అర్చన కనిపించటం లేదు! శుక్రవారం కావలికని సింహపురి ఎక్స్ప్రెసైన్ లో బైలుదేరిన మనిషి కావలి చేరనే లేదు! దారిలోనే మిస్సయిపోయింది! అర్చన నారాయణగూడ గవర్నమెంటు ఎయిడెడ్ హైస్కూల్లో సైన్సు టీచర్. వయసు ముప్పై. వయసులో ఉన్న ఆడమనిషి కనిపించకూడా పోయిందంటే ఎంత సెన్సేషన్! మీడియాకు అంతకన్నా మంచి విందేముంది?! అర్జన భర్త ప్రసాద్ అవతల భార్య కనిపించడం లేదని టెన్షన్ పడుతుంటే మీడియా వాళ్ళ దాడి మరింత చికాకు పుట్టిస్తున్నది . […]

అమ్మమ్మ – 42

రచన: గిరిజ పీసపాటి “ఇంతకీ విషయం నీకు ఎలా తెలిసిందో చెప్పనేలేదు!?” అన్న కూతురుతో “మీ మామగారి నాటకం హైదరాబాదులో జరిగినప్పుడల్లా నేనా విషయం పేపర్లో చదివి తెలుసుకుని, ఒకసారి ఆయన్ని కలిసి మీ యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాను”. పదిహేను రోజుల క్రితం రవీంద్రభారతిలో ఆయన నాటకం ఉందని తెలిసి ఎప్పట్లాగే వెళ్తే, ఆయన జరిగిన విషయం చెప్పి, మిమ్మల్ని, నన్ను కూడా నానా మాటలు అన్నారు. అవి విని నేను భరించలేకపోయాను”. “ఆయన కన్నా వయసులో […]

చంద్రోదయం – 36

రచన: మన్నెం శారద “డాక్టర్! ఎలా వుంది?” నానీని పరీక్షించి వెళ్తోన్న డాక్టర్ని వెంబడించి వరండాలో అడిగేడు సారథి. అప్పటికే వారం రోజులుగా నానీలో ఎలాంటి మార్పూ లేదు. అతనికసలు స్పృహే లేదు. కాళ్లు కొయ్యలా బిగుసుకుపోయేయి. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మంచానికి పుల్లలా అతుక్కుపోయేడు. డాక్టర్ సారథివైపు జాలిగా చూసేడు. “మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది బ్రెయిన్ ఫీవర్ దీనికింతవరకు మందు లేదు. ధైర్యంగా వుండండి” అంటూ వెళ్లిపోయేడు. సారథి మ్రాన్స్పడి నిలబడిపొయేడు. భూమిలోకి […]

బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

రచన: నండూరి సుందరీ నాగమణి అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో… ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత […]

తుళ్ళి పడకే ఓ…మనసా

రచన: లక్ష్మీ ఏలూరి ఎడారి లో ఓ …కోయిలా ! ఎగిరిపడి ముందే కూయకు! మునుముందే వసంతం వచ్చునని! ఆశపడి మిడిసిపడి కృంగిపొబోకు! కన్న కలలన్నీ కల్లలైయి,కన్నవారు, పెళ్లి పేరిట కూపస్థమండూకం లాంటి, అత్తవారింటికి పంపితే, కసాయిలాంటి, భర్తతో అడుగడుగునా అవమానాలే! అయినా… ఈమనసున పెనవేసుకున్న, ఆశలన్నీ నీమీదే నీవు వస్తావని! నీవు వచ్చే దారిలో గులాబీ రేకులు పరిచి! నా ఆశలన్నీ సమాధి చేసి నా, నా చేతులతో, తడిమి నిన్ను అప్యాయంగా అక్కున చేర్చుకుని, […]

కౌముది

రచన: ములుగు లక్ష్మీ మైథిలి ఈ మధుర కౌముది ఎన్నో ఊసులకు,ఊహలకు జీవం పోస్తుంది ఎందరో ప్రేమికులకు వలపు కుటీరమై ఆశ్రయమిస్తుంది ఎన్ని రాత్రులు వస్తున్నా వెన్నెల రేయి కోసం జగతి వేయి కనులతో వేచి చూస్తుంది పండువెన్నెల జాబిల్లి నిశీధిలో వెలుగులు చిందిస్తూ పసిపాపలందరికీ పాలబువ్వ తినిపిస్తుంది ఆకాశ వీధిలోఅందాలచందమామ యువజంటల అనురాగానికి తానే పల్లవి చరణాలవుతుంది జలతారుల చంద్రికలతో యువత మనసు దోచేస్తూ గుండెల్లో గుబులు రేపుతుంది అప్పుడప్పుడూ.. నీలి మేఘాల చాటున దాగి […]