May 7, 2024

అష్ట వినాయక మందిరాలు

రచన: నాగలక్ష్మి కర్రా అష్టగణపతులు పంచ ద్వారకలు, పంచబదరీలు, పంచప్రయాగలు, పంచపురాలు, అష్టాదశ పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు లాగానే మహారాష్ట్రాలో అష్ట వినాయకులు ప్రసిద్ది. ఈ అష్టవినాయక మందిరాలు పూణె నగరానికి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దూరంలో వున్నాయి. ఈ అష్టగణపతుల దర్శనం చేసుకోదలచిన వారు పుణె నగరం నుంచి మొదలుపెట్టుకుంటే సుమారు ఒకటిన్నర రోజులలో అన్ని గణపతులనూ దర్శించుకోవచ్చు. ఒక్కో గణపతి పుణె నగరం నుంచి యెంతదూరంలోవుంది, కోవెల వర్ణన, స్థలపురాణం […]

ఆదిశేషుడు – వాసుకి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు గంజాయి వనములో తులసి మొక్కలలాగా కద్రువ సంతతి నాగులలో శ్రేష్ఠులు ధర్మనిరతి గలిగి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, పరమశివులకు ప్రీతిపాత్రులైన వారు ఆదిశేషుడు, వాసుకి. . కశ్యప ప్రజాపతికిని కద్రువకును పుట్టిన పుత్రులలో జ్యేష్ఠుఁడు అది శేషుడు. కాని తల్లి దుస్సాహసము, తమ్ముల దుష్ట స్వభావమును భరించలేక వారికి దూరముగా తపోమూర్తిగా వెలుగొందాలని తలంచి గంధమాదనము, బదరికాశ్రమము, గోకర్ణము మొదలగు దివ్యక్షేత్రములయందు మహా తపమాచరింపఁగా, శరీరము శుష్కించిపోగా అప్పుడు బ్రహ్మఅతని సత్యనిష్ఠకును, […]

పౌరాణిక రత్నం. . . పాండవ వనవాసం!

సేకరణ : మూర్తి ఎన్ జీడిగుంట ఒక మహా ప్రస్థానాన్ని ఆరంభించినప్పుడు తొలి అడుగులు వేసే వ్యక్తి కొండలనూ. . గుట్టలనూ. . ముళ్లనూ రాళ్లనూ దాటుతూ దారి నిర్మించుకుంటూ ముందుకు సాగుతాడు. తన వెంట నడిచేవారికి అది మార్గాన్ని చూపుతుంది. తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేసి ఇతరులకు మార్గనిర్దేశం చేసిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు. దేవుళ్ల కళారూపాలు ఎలా ఉండాలో నిర్దేశించిన బ్రహ్మ ఈ కమలాకరుడు. పంచమ వేదంగా పరిగణించే మహాభారత ఇతిహాసంలోని […]

కవి పరిచయం – సాయి కామేష్

రచన: లక్ష్మీ రాధిక ఆలోచనకి చక్కని అభివ్యక్తి తోడై, మనసుని మాటల్లోకి అనువదించడం అందరికీ రాని ప్రత్యేక లక్షణం. భావ కవిత్వంలో అభావాన్ని. . ముభావాన్ని సముపాళ్ళలో రంగరించి కదిలిస్తారు సాయి కామేష్. ఆకతాయి వయసు అల్లరితనం, దుఃఖాన్నే కవ్వించే చాతుర్యం, జీవితంతో రాజీపడుతూ ఒదిగిపోవడం, సహజమైన సుప్తచేతనావస్థలన్నీ తన కలానికి వెన్నతో పెట్టిన విద్యలు. సరళంగా ఉన్నట్లుంటూనే మనసుని మెలిపెట్టే భావాలు కొన్నయితే, సున్నితమైన సంవేదనలు కొన్ని. తను, నేను అనే శీర్షికన ఎన్నో కవితలు […]

వాన బుడగలం

రచన: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్. బుడి బుడి బుడగలం బుడుంగు బుడగలం జడివాన అడుగులం కాపాడితే నీటి మడుగులం పచ్చదనానికి దోస్తులం మానవాళికి ఆస్తులం వేడినేల తాకితే మాయం తడినేలపై కురిస్తే తోయం బుడి బుడి బుడగలం బుడుంగు బుడగలం జడివాన అడుగులం కాపాడితే నీటి మడుగులం.

ఊరు

రచన: సునీత పేరిచర్ల కాలంతో పాటు సాగే పయనంలో చాలా ముందుకు వచ్చేసాను.. ఒక్కసారి వెనక్కి వెళ్లి కొన్ని జ్ఞాపకాలని కొందరు ఆత్మీయులని పలకరించాలని చిన్నప్పటి ఊరు వెళ్ళాను ఊరు మొదట్లో గుల్మొహార్ చెట్టు నన్ను చూడగానే ఆనందంతో తల పైకెత్తి ఆహ్వానించింది ఒకప్పుడు ఎంత అందంగా నిండుగా ఉండేదో.. అప్పటి కళ లేదు …నిర్జీవంగా ఉంది ఏమైంది నేస్తం ఇలా అయిపోయావ్ అని అడిగాను.. మొక్కలైనా , మనుషులయినా ఆత్మీయ స్పర్శ , పిలుపు లేకపోతే […]

కంభంపాటి కథలు – వాచీ

రచన: రవీంద్ర కంభంపాటి దాలి నాయుడికి ఐదేళ్ల వయసున్నప్పుడనుకుంటా.. వాళ్ళ నాన్న చిట్టినాయుడు చేతికున్న రోలెక్సు స్మగుల్డు వాచీ చూసేడు. తళతళ మెరిసిపోతున్న ఆ వాచీని మెల్లగా వాళ్ళ నాన్న చేతినుంచి లాగడానికి చూసేడు గానీ చిట్టినాయుడు ఓ మొట్టికాయ మొట్టడంతో ఆగిపోయేడు. అప్పటికైతే ఆగేడు గానీ.. ఆ దాలినాయుడి బుర్రలో ఆ వాచీ అలా ప్రింటైపోయింది. ఆ పై ఏడు, కాకినాడెళ్ళినప్పుడు చిట్టినాయుడు ఓ డూప్లికేటు కాసియో వాచీ కొనిచ్చినా పెట్టుకుంటే నీకున్నలాంటి వాచీ పెట్టుకుంటా […]

పరిపూర్ణం

రచన : రమ శాండిల్య భానుమూర్తి ఒక మధ్య తరగతి చిరు ఉద్యోగి. అతనికి అమ్మవైపువారి నుంచి కానీ, అత్తగారి వైపునుంచి కానీ ఎటువంటి ఆధారం లేదు. తనకొచ్చే కొంచెం జీతంతో ముగ్గురు పిల్లల్ని చదివించుకోవాలి. సంసారం దానితోనే సర్దుకుపోవాలి. మీనాక్షి, భానుమూర్తికి తగిన భార్య. భర్త తనకిచ్చేదానిలోనే గుట్టుగా సంసారం చేసుకుంటూ, చిన్నపిల్లలకు తనకొచ్చిన కొద్దిపాటి సంగీతము నేర్పుతూ వారిచ్చిన తృణమో ఫణమో స్వీకరిస్తూ, ఇరుగుపొరుగులకు సహాయపడుతూ చుట్టుపక్కల వారిలో మంచి ఇల్లాలు అనే పేరు […]

గిరిజా సదన్

రచన: ప్రభావతి పూసపాటి “కాత్యాయిని” ప్రశాంతం గా వున్న “గిరిజాసదన్” లో ఒక్కసారి మారుమోగినట్టు వినిపించింది ఆ పేరు. గిరిజాసదన్ స్థాపించింది నేనే అయినా అంతా తానే అయి చూసుకొంటున్నారు రామనాథంగారు. గిరిజాసదన్ కేవలం ఎవరి పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడిపోయారో అక్కడ జీవన విధానంలో ఇమడలేని వారి తల్లితండ్రులకి మాత్రమే ఆశ్రయం కల్పిస్తుంది. అందుకు ఇక్కడికి చేర వచ్చేవారి వివరాలు పూర్తిగా తెలుసుకొంటే కానీ వసతి కల్పించరు రామనాధంగారు. ఆ వివరాలు సేకరిస్తున్నారు. “కాత్యాయిని” ఈ […]

రాములమ్మ- బంగారు కమ్మలు

రచన: డా. కె. మీరాబాయి నేను కాలేజీ నుండి వచ్చేసరికి అలవాటుగా మా ఇంటి గుమ్మం ముందు కూర్చుని ఎదురు చూస్తోంది రాములమ్మ. గేటు తాళం తీసి లోపలికి రాగానే కొబ్బరి పొరక చేతపట్టి ఇంటి ముందున్న కడప బండల మీద రాలిన సుంకేసుల చెట్టు ఆకులు వూడవడం మొదలు పెట్టింది. ” వచ్చి ఎంత సేపు అయ్యింది రాములమ్మా? అందరింట్లో పని అయిపోయిందా? ” ముందు గదికి వేసిన తాళం తీస్తూ యథాలాపంగా అడిగాను. ” […]