April 27, 2024

రాజీపడిన బంధం – 1

  రచన: కోసూరి ఉమాభారతి “వెండితెర – సినీ సర్క్యూట్ వారి – తాజావార్త ” – పేపర్ చదువుతూ, ఏదో ముఖ్యమైన ప్రకటన చేస్తున్న శైలిలో చేయి పైకెత్తి స్వరం పెంచిందామె. “ ‘మొరటోడు’ సినిమా చిత్రీకరణ సమయంలో- ‘రొమాంటిక్ సీక్వెన్స్ కోసం వెరైటీగా బాక్సింగ్, ఫుట్బాల్ క్రీడల్లో పాల్గొన్నందుకు నటి రాణి గాయాలకి లోనై అస్వస్థతకి గురవడంతో వారంపాటు షూటింగ్ నిలిపి వేసినట్టు దర్శకుడు కరుణాకరం అందించిన వార్త. వరుణ్ హీరోగా నిర్మాణంలో ఉన్న […]

చీకటి మూసిన ఏకాంతం – 5

రచన: మన్నెం శారద   “కృష్ణారావుగారబ్బాయి ఎం.డి. చేసి ఫారిన్ వెళ్తున్నాడట!” “మంచిది. వెళ్ళిరమ్మను” అన్నాడు నవనీతరావు పేపర్లోంచి దృష్టి తిప్పకుండానే. వసుంధర అతని వైపు కోపంగా చూసి “మీరు చెప్పలేదనే వెళ్ళడం లేదు.” అంది విసురుగా. నవనీతరావు తలెత్తి “నీకేదో కోపం వచ్చినట్లుంది. అసలేం చెప్పేవు నువ్వు!” అనడిగేడు అమాయకంగా. “నా ఖర్మ కాలిందని చెప్పేను.” “తప్పు. నేను బాగానే వున్నానుగా!” “బాగానే ఉన్నారు బండరాయిలా. ఎదిగిన కూతురు కళ్ళెమొదిలేసిన గుర్రంలా తిరుగుతోంది. దానికి పెళ్ళి […]

రెండో జీవితం 9

రచన: అంగులూరి అంజనీదేవి కోపం మనిషిని పశువును చేస్తుందని విమలమ్మకి తెలియంది కాదు… ”ఆయన బాధంతా ఆయన కొడుకు గురించే అన్నయ్యా! మనం అర్థం చేసుకోవాలి కాని, ఇలా పంతాలకి పోతే కాపురాలు నిలవ్వు… అయినా ఎంత మంది భర్తలు ఉద్యోగరీత్యా బయట ఊళ్లలో గడిపిరావటం లేదు. అంతమాత్రాన వాళ్ల భార్యలు విద్వంసాన్ని సృష్టించుకుంటున్నారా? ఆర్టిస్ట్‌ అన్న తర్వాత అభిమానులు, యాడ్‌ ఏజన్సీలు, సన్మానాలు చేసేవాళ్లు, ఎగ్జిబిషన్లవాళ్లు ఇలా ఎందరెందరో ఫోన్లు చేస్తుంటారు. అందులో ఆడవాళ్లు కూడా […]

మాయానగరం 49

రచన: భువనచంద్ర “మీరొక్కసారి మా ఆలయాన్ని చూడండి బాబూజీ. చూశాక మీకే అర్ధమవుతుంది” జరిగిన విషయాలన్నీ చమన్‌లాల్‌కి వివరించి అన్నాడు రుషి. ప్రభుత్వం కదలాలన్నా, ప్రభుత్వ యంత్రాంగం పని చెయ్యాలన్నా ‘పరపతి’ వున్నవాళ్ళని ఆశ్రయించక తప్పదు. జిల్లా కలెక్టరుకి వివరంగా చెప్పాడు. కలెక్టరు ఎలా పరిచయం అంటే కలెక్టరుగారి అబ్బాయి ఒడుక్కి ఆయన రుషికి కేటరింగ్ ఆర్డర్ ఇవ్వడం వల్ల. కలెక్టర్ చాలా పాజిటివ్‌గా స్పందించి విషయాన్ని స్వయంగా చూచి వారం రోజుల్లోగా రిపోర్టు అందించాలని పి.ఏ.కి […]

బ్రహ్మలిఖితం – 20

రచన: మన్నెం శారద జోసెఫ్ మీదపడి నిశ్శబ్దంగా రోదిస్తున్న అతని భార్యని భుజాలు పట్టుకొని లేవదీసింది లిఖిత. ఆమె కళ్ళు తుడుచుకుని దుఃఖాన్ని అదుపు చేస్కునే ప్రయత్నం చేసింది. “మిమ్మల్ని ఓదార్చే ధైర్యం చేయలేను. కాని.. ఇంత డబ్బు దగ్గర పెట్టుకుని కూడా మీరు ఆయన ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదంటే.. మీలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉంటారన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను” అంది లిఖిత బాధగా. ఆమె శుష్క మందహాసం చేసింది. ఆ నవ్వు తుఫానులో […]

రెండో జీవితం 8

రచన: అంగులూరి అంజనీదేవి ఏది ఏమైనా తన బొమ్మల్ని అభిమానిస్తుంది కాబట్టి తన అభిమానురాలే… అభిమానం ఓవరం! కానీ అభిమానులతో మాట్లాడేంత ఉల్లాసంగా తను లేడు. అనుకుంటూ వెంటనే ఆ మొబైల్‌ని పక్కన పెట్టాడు. కానీ ఆ మెసేజ్‌లు మాత్రం అతని గతం తాలుకు భావరేఖల్ని కదిలించి ‘మా సంగతేంటి? నీ బొమ్మల్లో మమ్మల్నెప్పుడు ఒలికిస్తావు.’ అన్నట్లు తొందర చేస్తున్నాయి. పైకి కన్పించేది ఒకటి… అంతర్లీనంగా దోబూచులాడేది ఒకటి… అంతర్లీనంగా వున్నదాన్ని అవసరాన్ని బట్టి అణగదొక్కాలని చాలా […]

మార్నింగ్ వాక్

రచన: మణికుమారి గోవిందరాజుల “రేపటినుండి యేమైనా సరే వాకింగ్ కి వెళ్ళాల్సిందే. ” అద్దంలో ముందుకూ వెనక్కూ చూసుకుంటూ అనుకుంది . “కానీ మరీ లావణ్య వర్ణించినంత లావుగా యేమీ లేనే?” మళ్ళీ చూసుకుంది . యేమోలే చూసేవాళ్ళకు లావుగా కనపడుతున్నానేమో. . అయినా అయ్యో అయ్యో యెంత మాట అనేసింది దొంగమొహం. వారం క్రితం ఇంట్లోకి వస్తూనే అన్నది కదా “ఒసే రేఖా! పేరుకి తగ్గట్లు రేఖలా వుండేదానివల్లా సున్నాలా అవుతున్నావే” అని దానికి శ్రీవారి […]

బ్రహ్మలిఖితం – 19

రచన: మన్నెం శారద కార్తికేయన్ ఒక పెద్ద చెట్టు మ్రాను కానుకొని కళ్ళు మూసుకొని జీవచ్చవంలో ఏదో జపిస్తూనే ఉన్నాడు. అతని ధోరణి, రూపు చూసొఇ లిఖిత వస్తోన్న దుఃఖాన్ని పెదవులు బిగించి ఆపుకుంటోంది. “నేనొస్తానక్కా!” అన్నాదు బేరర్ లేచి నిలబదుతూ. లిఖిత కృతగ్నతగా తలాడించి పర్సులోంచి కొంత డబ్బు తీసి అతని చేతిలో పెట్టబోయింది. అతను చేతిని వెనక్కు లాక్కుని “ఎందుకక్కా?” అనడిగేడు ఆస్చర్యంగా. “నువ్వు నాకు చాలా సహాయం చేసేవు. నా తండ్రిని నేను […]

బ్రహ్మలిఖితం – 17

అతన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యమొచ్చింది లిఖితకి. “పాము.. పాము” అంది లేచి నిలబడి అదురుతోన్న పెదవులతో. “అదేం చేస్తుంది. అంతకంటే భయంకరమైన జంతువులున్నాయీ అడవిలో”అన్నాడతను లిఖితను దగ్గరకు తీసుకుంటూ. అతను మళయాళంలో మాట్లాడిందేమిటో అర్ధం కాకపోయినా అతని స్పర్శలో ఉన్న నీచదృష్టిని గమనించి అతని చేతుల్ని దూరంగా తోసేయ్యబోయింది లిఖిత. “ఏంటంత భయపడుతున్నావు. మగపిల్లాడివేగా. మా పెరియార్లు నిన్ను మగపిల్లాడివనుకొని బలికి తీసుకొచ్చేడు. నేనప్పుడే గ్రహించేసేను. ఈ పూజలతో విసిగి పోయినప్పుడు సరసానికి పనికొస్తావని” అంటూ ఆమెని […]

రెండో జీవితం 7

రచన: అంగులూరి అంజనీదేవి ఒకసారి ఆమె ముఖంలోకి జాలిగా చూసి, ‘సమస్యల్ని సృశించే నేర్పుకూడా ఓ కళేకదా!’ అని మనసులో అనుకొని, ఏమనాలో తెలియక ‘ఆల్‌ ద బెస్ట్‌’ అన్నాడు. అంతలో… పేర్స్‌ెం నుండి కాల్‌ రావటంతో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అని ఆముక్తతో చెప్పి పక్కకెళ్లి మ్లాడి వచ్చాడు. ఆమె చాలా సేపు ద్రోణ దగ్గరే కూర్చుంది. * * * * * అర్ధరాత్రి దాక – అందరు నిద్రపోతున్న సమయంలో గంగాధరం మళ్లీ అరుస్తూ లేచాడు. […]