May 4, 2024

తాను – నేను

కళ్యాణదుర్గం స్వర్ణలత కాంపౌండ్ వాల్ పక్కగా తాను తొంగి చూసినపుడే, నేనూ చూశా తొలిసారి తనను… ఇంద్రలోకం నుండి నిటారుగా దిగిన సౌందర్యమది ప్రతి రోజు తన నవ్వుతోనే నాకు తొలి ఉదయం చూసిన ప్రతిసారి గుభాళించే ఆ నవ్వే నన్ను తనకోసం చూసేలా చేస్తోంది తన నిత్య దర్శనంలో కాలం అప్పుడే పుష్కరమై పూసింది ఇంతలోనే ఎంత మార్పు .. ఇంతే వున్న తాను మానంతై చిరునవ్వుల గుభాళింపులతో నన్ను ముంచేస్తుంటే మనసంతా మైమరుపే అమాంతంగా […]

అస్త్ర సన్యాసం

రచన: అశోక్ అవారి సమాజ సంఘటనల్ని ఎప్పుడు కొలిచినా.. హృదయస్పందనల్లో హెచ్చుతగ్గులే. మానవత్వాన్ని ఎప్పుడు తూచినా మనసెప్పుడూ.. సంద్రంలో ఆటు పోటుల్లా అల్లకల్లోలమే. మనిషి నిఘంటువులో మంచితనపు పదాన్ని చేర్చలేక అస్త్ర సన్యాసం చేసిన.. చేతగాని మానసిక అవిటి వాన్ని. గురుదక్షిణగా నైపుణ్యం బొటనవేలై తెగిపడ్డ ఏకలవ్యున్ని. వ్యూహమే లేకుండా.. సమాజ సమస్యా పద్మవ్యూహంలో కిరాతకంగా హత్య చేయబడ్డ వాన్ని. ఇప్పుడు నేనొక జీవ మృత కళేభరాన్ని- కడిగినా పోని నిత్య పాపాలపై ప్రళయ రుద్రునిలా.. పాశుపతాన్ని […]

చేయగలిగేదేముంది?

రచన:-భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు అజ్ఞానమే తప్పవిజ్ఞానం అలవడని వయసులో ఆవేశమే తప్ప ఆలోచన జతపడని మనసుతో కన్నవాళ్ళని కాదని,వాళ్ళఆత్మీయతను చేదని అల్లారుముద్దుగా పెంచిన వారి ప్రేమను వద్దని ప్రేమించుకున్నాం అనే భ్రమలో ఇరుక్కొని కలిసితీరుతాం అనే కఠిననిర్ణయాన్ని తీసుకొని కులగోత్రాలతో సంబంధం రద్దు చేసుకొని వంశగౌరవాలతో అనుబంధం త్రెంచేసుకొని కట్టుబాట్లను కాలదన్ని వెసులుబాట్లను వెనకేసుకొని సాంప్రదాయానికి తలవంచక ముందువెనుకలు ఆలోచించక మంచిచెడులు అవలోకించక ఆవేశాన్నే ప్రేమ అనుకొని ఆకతాయితనాన్నేధైర్యం అనుకొని చెడుదారిని ఎంచుకోవటమే చైతన్యం అనుకొని పెడదారిని […]

మధ్యతరగతి మిథ్యా సూరీడు

రచన:- జి. మధుబాబు నివురు గప్పిన ఆశల నింగిలో నిప్పుల కొలిమిలా మండుతున్నాడు ఎండమావుల వేటలో యాంత్రిక జీవన బాటలో ఎడతెరిపిలేక యేగుతున్నాడు శ్వాసించే శిలలా శ్రమిస్తున్నాడు మధ్యతరగతి మిథ్యా సూరీడు ఈ మధ్యతరగతి భారతీయుడు!! అనుక్షణం అనుక్రమిస్తూ ప్రతీక్షణం పరిక్రమిస్తూ అభ్యుదయం కొసం అల్లాడుతున్నాడు ఉద్యమం ఊపిరిగా జీవిస్తున్నాడు మధ్యతరగతి యెర్ర సూరీడు మధ్యతరగతి మిథ్యా సూరీడు ఈ మధ్యతరగతి భారతీయుడు!! సామ్యవాదమంటాడు సమసమాజమంటాడు తన దాకా వస్తే ధనస్వామ్యమంటాడు ప్రపంచానికేమొ ఇదే ప్రజాస్వామ్యమంటాడు ప్రజాతంత్ర […]

కాసేపు నీతో ప్రయాణం ..

రచన: గవిడి శ్రీనివాస్ ఆ కాసేపు నీతో పయణించిన క్షణాలు మల్లె వాసనలూ మౌన రాగాలూ అలజడి రేపుతున్నాయి నీ వేదో చేస్తావనీ కాదు మనసు తలుపు తడితే ఒలికిపోయే వెన్నెల సమీరాల్లో తడిసి పోయిన వాణ్ణి నీ వేదో చెప్తావనీ కాదు కనుల భాషలో రాలిపోయే పువ్వుల్ని ఏరుకుందా మనీ మూసుకున్న కళ్ళల్లో కలల్ని నీ పరిచయాలు గా పదిల పరచు కోవాలనీ ఆరాట పడుతుంటాను మరి కొన్ని క్షణాల్లోనే దూర మౌతుంటాను. కాలం సాగుతున్నకొద్దీ […]

||కవిత్వమంటే||

రచన : ప్రియనాయుడు కవిత్వమంటే ఏమిటి ?? అది ఎలా ఎలా వివరించేది ?? యెక్కడని వెదికేది ?? యెక్కడని పట్టుకొనేది?? నవ్వులో పువ్వులో నింగిలో నేలలో కళ్ళల్లో కలలలో చెలి బుగ్గల్లో చిరుసిగ్గుల్లో వలపులలో తలపుల్లో పగటిలో రేయిలో పచ్చని పైరులో సాగే చల్లని చిరుగాలిలో వానలో ఎండలో ఉరికే జలపాతంలో తనువులో అణువులో మనసులో మమతలో పూవులో తావిలో పలవరించే పలుకులో కన్నీటిలో కవ్వింతలో అలకలో ఆరాధనలో ఇంకా …. అధరంలో మధురిమలో మౌనంలో […]

“కవిత్వంలో ఏకాంతం”

రచన: టేకుమళ్ళ వెంకటప్పయ్య. “A man does not communicate with another man except when the one writes in his solitude and the other reads him in his own. Conversations are a diversion, a swindle, or a fencing match”. అంటే.. ”ఒక మనిషి తన ఏకాంతంలో రాసిందాన్ని మరో మనిషి తన ఏకాంతంలో చదువుకున్నప్పుడు మాత్రమే ఒకరికొకరు అర్థం కావటమనేది సాధ్యం. సంభాషణల వల్ల […]

మాలిక పత్రిక జులై 2016 సంచికకు స్వాగతం

Jyothi Valaboju Chief Editor and Content Head ప్రతీనెల మాలిక పత్రిక కొత్త ప్రయోగాలు, రచనలతో మిమ్మల్ని అలరిస్తోంది. గత నెల ప్రకటించిన హాస్యకథలపోటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది మొత్తం 23 కథలు పోటీలో ఉన్నాయి. జులై 15 న ఈ కథలపోటి ఫలితాలు ప్రకటించబడతాయి. ఆగస్ట్ సంచికనుండి కథల ప్రచురణ ఉంటుంది. మాలిక పత్రికనుండి ముందు ముందు మరిన్ని కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయాలని మా సంకల్పం. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org […]

తెలుగు షాయరీలు – మాట-పాట

రచన, గానం : మురళి ధర్మపురి, ఆస్ట్రేలియా   క్రింద షాయరీలు వినాలంటే మురళిగారి బొమ్మమీద మెల్లిగా నొక్కండి.. అదేనండి క్లిక్కండి… 🙂  తన భాషే లోకువ తెలుగు తమ్మికి వచ్చినా రానట్లు మాట్లాడేది తెలుగు భాష రాకున్నా వచ్చినట్లు మాట్లాడేది ఇంగ్లీషు భాష పరభాషంటే పడదు కొంత మందికి తన భాషే లోకువ తెలుగు తమ్మికి *~*~*~*~*~*~*~*~*~*~* जानकर भी न जाने जैसा बात करतें है तेलुगु भाषा न जानते भी […]