April 27, 2024

శుచిరో అస్మాకా!

రచన: డా. వివేకానందమూర్తి ఇంగ్లాండ్ లండన్లో నేనున్నాను. ఇండియా యెండల్లో మా మావగారున్నారు. అమ్మా, నాన్న అస్తమించాక అంత ప్రేమా యిస్తున్నది ఆయనే! నేను లండన్ చేరి ముప్పై యేళ్లు దాటింది. అప్పుడు యిండియాలో డాక్టర్లు కిటకిటలాడిపోతున్నారు. కొత్త డాక్టరుగా బ్రతకటం కష్టమయ్యింది. అన్నం పెట్టని అమ్మను వదిలేయాల్సిందే అని ఆత్రేయగారు ఆదేశించారు. ఎకాయెకీ బొంబాయి ఎయిర్పోర్టుకి వెళ్లి ఓ పైలట్‌ని పిలిచి, “ఏవోయ్ ఫైలట్టూ! లండన్‌కి బండి కడతావా?” అనడిగాను. “తవరెక్కితే కట్టకపోటవేంటి బాబూ! రాండి” […]

ఆచార్య సర్వత్ర పూజ్యతే

రచన: నండూరి సుందరీ నాగమణి “వంటయింది… భోజనానికి రండి…” పిలిచింది విశాలాక్షి. “వస్తున్నాను విశాలా… వడ్డించు… ఇదిగో… ఈ శార్దూలాన్ని సవరించి వచ్చేస్తాను…” అల్లిన పద్యాన్ని పుస్తకంలో వ్రాసుకుని, మరోసారి చదువుకుని, తృప్తిగా తలపంకించాడు విశ్వనాథం. కంచంలో అన్నం, ఆవకాయ, బెండకాయ వేపుడు, ముద్ద పప్పు, వడియాలు, పక్కనే వేడి వేడి చారు గిన్నె అన్నీ చక్కగా బల్లపై అమర్చింది విశాల. మోకాళ్ళ నొప్పుల వలన కింద కూర్చుని తినలేరు ఇద్దరూ… “అబ్బాయిలు ఫోన్లు చేయటమే మానేసారు […]

గ్రహణం విడిచింది!

రచన: విజయా సుందర్. కాఫీ, మంచినీళ్ళు తీసుకొచ్చిన రాధని విసుగ్గా చూసి, విద్య “నాకిలా రాగానే కాఫీ తాగాలనిపించదని ఎన్నిసార్లు చెప్పానండీ… నేనే దన్నా అనేదాకా చేస్తారు.” కోడలి మాటలకి చిన్నబోయిన రాధ, మొహంలో భావాలు కప్పిపుచ్చుకుని, “ఓపలేని పిల్లవు కదా… ఇప్పుడు అలా అనిపించదేమోలే అని తెచ్చా నమ్మా… పోనీలే మంచినీళ్లు తాగి రిలాక్స్ అవు… కాస్సేపయ్యాక మళ్లీ కలుపుతాలే” అంటూ తలుపు దగ్గరకి వేసి వచ్చేసింది రాధ. “ఎందుకే నీకింత ఆరాటం?”…కారిపోతున్న కన్నీళ్లు తుడుస్తూ […]

ఊయల వంతెన

రచన: బి.భవానీ కుమారి సమయం ఒంటిగంట దాటుతుండగా, పొలం నుంచి వచ్చిన రాఘవ భోజనానికి కూర్చున్నాడు. జానకి ఇద్దరికీ కంచాలు పెట్టి, వడ్డించటానికి సిద్దమౌతుండగా , బెడ్ రూమ్ కిటికీ అద్దాలు భళ్ళున పగిలిన శబ్దం వచ్చింది. ఆ వెనువెంటనే, వరండాలో వరుసగా రాళ్లు పడుతున్న శబ్దం విని ఇద్దరూ గబాగబా వరండాలోకి వచ్చారు. “నువ్వు బయటకు రాకు” అంటూ ముందుకెళ్ళి చుట్టూ చూసాడు. మరొక గులకరాయి వచ్చి పడింది , ఆశ్చర్యపోతూ ఈసారి తమ్ముడు, తన […]

ఈశ్వర సేవ

కథ: G.S.S. కళ్యాణి. ఆదివారం మధ్యాహ్నం, సమయం మూడు గంటలయ్యింది. సముద్రం పైనుండి వీస్తున్న చల్లటి గాలి ఎండ వేడిమినుండి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉండటంతో పిల్లలూ, పెద్దలూ అందరూ సముద్ర తీరంలో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలోంచి ఎనభయ్యేళ్ళ ప్రకాశరావు మెల్లిగా కిందకు దిగి, తన జేబులోంచి ఒక వంద రూపాయల నోటును తీసి ఆ ఆటో డ్రైవర్ చేతిలో పెట్టి, సముద్రం వైపుకు తిరిగాడు. “అయ్యా!”, […]

తులసి

రచన: శ్యామదాసి జీవితం ఒక పాఠశాల అయితే, ప్రతి క్షణం కొత్త పాఠాన్ని నేర్వవలసిన జీవుల జీవననాటకాల్ని కాలం కలంగా మారి చిత్ర విచిత్రంగా రచిస్తుంది. అటువంటి ఒక సాగిపోతున్న రచనే ప్రస్తుత ఈ తులసి. పాతికేళ్ళ క్రితం మా అమ్మాయి పెండ్లిలో, పెండ్లి కొడుకు పెద్దమ్మ కోడలని, దగ్గర బంధువుగా పరిచయ మయింది తులసి. అప్పటికే తనకు ఐదారేళ్ళ పాప. అత్తగారిది టౌనుకు దగ్గరలో ఒక పల్లెటూరు. వ్యవసాయ కుటుంబం. పల్లెటూరి అమాయకత్వంతో కూడి నునుపైన […]

తనివి తీరింది

రచన: యశస్వి జవ్వాది డాక్టర్ విశ్వం మనసు అలజడిగా ఉంది. తన మనసు లోతుల్లో తాను బ్రతుకుతున్న వ్యవస్థను మోసం చేస్తున్నాననే భావన వలన చాలా భారంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే అతని మొహం మీద ఒత్తిడి ఛాయలు పేరుకున్నాయి. ఎవరి మొహం చూడకుండా నేరుగా తన క్యాబిన్ వైపు వేగంగా వెళ్ళాడు. టేబుల్ మీదనున్న పేషెంట్ ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చూసాడు. ఈలోగా, “అయ్యా!! లోపలకు రావచ్చా?” అంటూ సగం తెరచిన […]

మాటే మంత్రము!

రచన: విజయలక్ష్మి వారణాసి “ఎక్కడికో బయల్దేరినట్లున్నావు” నీలం సిల్కు చీర, స్ట్రైట్ చేసుకుని వదిలేసిన జుట్టు, అందంగా తయారయిన భార్య గౌతమిని మురిపెంగా చూసుకుంటూ, లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటున్న, ఉదయ్ వెనక్కి మెడ తిప్పి చూస్తూ కామెంట్ చేసాడు. చెప్పుల దగ్గరకి వెళ్తున్న గౌతమి చివ్వున తలతిప్పి”బైటకి వెళ్తున్నాను” అన్నది. “తెలుసులేవోయ్ బైటికేనని. ఎక్కడికి అని అడుగుతున్నా” ఉదయ్ గౌతమి గొంతులోని చిరాకు గమనించ కుండా, “ఇంత గొప్ప మొగుణ్ణి, మగాణ్ణి ఇక్కడుంటే, […]

జన్మ భూమి

రచన: సి.హెచ్.ప్రతాప్ కృష్ణా జిల్లా చీమలపాడుకు చెందిన మాధవయ్య కుటుంబం ఒక సాదా సీదా రైతు కుటుంబం. ఉన్న ఎకరం పొలంపై వచ్చే ఆదాయంతో మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాడు. అతనికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. వాడికి మహేష్ అనే పేరు పెట్టుకొని ఉన్నదాంట్లోనే వాడికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహేశ్ స్వతాహాగా చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినా, ఊళ్ళో వున్న ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ పొరుగునున్న […]

పక్కవారిది పరమానందం

రచన:వేణి కొలిపాక ఇల్లంతా హడావిడిగా ఉంది. కమల అన్ని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటోంది. సోఫా కవర్లు మళ్ళీ సర్ది, ఫ్లవర్ వాసులు వాటి స్థానాల్లో పెట్టి!! సంగతి ఏమిటంటే వాళ్ళింట్లో ఈరోజు కిట్టి పార్టీ ఉంది. కమల లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ విధంగా ఆమెకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఆడవారు స్నేహితులయ్యారు.’ “వంట అయిపోయినట్టే కదా అత్తయ్య” అంటూ,  వంట పర్యవేక్షిస్తున్న అత్తగారిని అడిగింది..’ఆ..అంతా అయినట్టే,  ఇదిగో ఈ […]