May 6, 2024

మౌనరాగం – 7

రచన: అంగులూరి అంజనీదేవి http://www.angulurianjanidevi.com anguluri.anjanidevi.novelist@gmail.com నేత్రా పత్రిక కొనటానికి కొంతమంది ముందుకొచ్చినా, రేటు దగ్గర వెనక్కి తగ్గటంతో ఆ టెండర్‌ అమృతరావుకి దక్కింది. ఆ పత్రిక చూసుకునే బాధ్యత తన కొడుక్కి అప్పజెప్పాడు అమృతరావు. పత్రికాఫీసులో పాత రికార్డులన్నీ పరిశీలించి, కొంతమందిని సమావేశపరిచాక, సుభాష్‌చంద్ర దగ్గర కీలకమైన వ్యక్తి దేదీప్య అని తెలియగానే దేదీప్యను పిలిపించారు. జాబ్‌లో జాయిన్‌ కమ్మని దేదీప్యను కోరారు. ప్రస్తుతం ఉద్యోగం అవసరం అయినందువల్ల ఆ ఆఫర్‌ దేదీప్యకి మండుటెండలో వెన్నెలవర్షంలా […]

వాళ్లు – ఒక పాదచారి అనుభవ విశేషాలు.

ఒక సమీక్ష : మంథా భానుమతి. హిమాలయ పర్వత సానువుల కేగిన ఒక యువకుని స్వానుభవ స్వగతం, స్వప్న మాసపత్రికలో వచ్చిన భువనచంద్ర రాజుగారి “వాళ్లు” ధారావాహిక. అది తన స్వానుభవమేననీ, అందులోని పాత్రలు నిజంగా తనకు తారసపడిన వ్యక్తులేననీ రచయిత చెప్తారు. ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, కట్టు బట్టలతో, చేత చిల్లిగవ్వ లేకుండా, హిమాలయ శీతల వాతావరణంలో నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.. పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమయిపోతాము. మరి ఎవరీ “వాళ్లు”.. […]

అమ్మ కథలు.

రచన: సమ్మెట ఉమాదేవి సమీక్ష: సుజల గంటి “అమ్మ” అన్న పదమే ఒక మధురానుభూతి.  మానులో మానుపుట్టి అన్నట్లుగా తన రక్త మా౦సాలను ప౦చి, విధాతకు సమానంగా ప్రతిసృష్టి చేసే అమ్మకు నిర్వచన౦ ఉ౦దా! “అమ్మ౦టే” అన్న మొదటి కథలో కొమరెల్లి అతని పిల్లలు మీ అమ్మ ఎలా ఉ౦టు౦ది అన్నప్పుడు, మాటలకన్నా ఆమెను చూపి౦చి, ఆమె తన రక్త మా౦సాలతో ఎలా పె౦చి౦దో ప్రత్యక్ష౦గా చూపి౦చాలనుకున్నాడు. సమ్మెట ఉమాదేవి తన మొదటి కథలో తన పిల్లల్ని […]

ఇద్దరు మిత్రులు – 1 ( వెండితెర నవల )

రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాదు అన్నపూర్ణవారి ఇద్దరుమిత్రులు   పైనున్న వాడు బహు కొంటెవాడు. పెద్దంత్రం, చిన్నంత్రం లేకుండా అందరినీ ఆడించి, ఆడుకుంటాడు. అరక్క వీడూ, దొరక్క వాడూ అవస్థపడగా, ‘వీడి’కి వజ్రాలూ, ‘వాడి’కి మరమరాలూ యిస్తాడు. ఉప్పుకి, కప్పురంలా గుబాళించాలన్న ఉబలాటం కలిగిస్తే, కప్పురానికి ఉప్పులా చవులూరాలన్న సరదా పుట్టించి తమాషా చూస్తాడు, జీవితం ఉప్పులా కరిగిపోయి, కప్పురంలా హరించిపోయేవరకు ఈ తీరని కోరికలతో కాలక్షేపం చేయించేస్తాడు. రామదాసు గారు (భద్రాచలం తాలూకా […]

భార్యాభర్తలు – 3 (వెండితెర నవల)

రచన: ముళ్లపూడి వెంకటరమణ హాసం ప్రచురణలు హైదరాబాదు పద్మాక్షిలో ఎక్సరే అంశ కొంత ఉండి ఉండాలి. మనుషుల్ని కాకపోతే, మాటల్ని, నవ్వుల్ని ఎక్సరే తీయిస్తాయి ఆ కళ్ళు. “అబ్బే ఇప్పుడే ఎండలో వచ్చాను గదూ – మొహం అంతా అసహ్యంగా ఉంది. ఒక్కసారి బాత్‌రూంకెళ్ళి-” అంటూ గడుసుగా,  చొరవగా అటువేపు అడుగు వేసింది. “ఓ ఓ బాత్‌రూమ్!” అన్నాడు ఆనంద్ ఎగిరి గంతువేసి అడ్డు నిలబడి. “టాయిలెట్టయి వచ్చేస్తాను” అని వాక్యం పూర్తి చేసింది పద్మ ఏమీ […]

సీతా స్వయంవరం – గౌసిప్స్

రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ రచన: డా. జె. గౌతమి సత్యశ్రీ   స్వయంవరం అంటే స్వయంగా రాకుమారి తనను వరించడానికి వచ్చిన వరము (వరుడు) లలో తనకు నచ్చిన ఒకరిని  వరించడం. ఇది భారత దేశం లో రాజవంశీయుల్లో ప్రాచీన సాంప్రదాయం. రాకుమారి తండ్రి గాని, అన్న గాని ఈ స్వయంవర మహోత్సవాన్ని నిర్ణయించి పలుదేశాల రాకుమారులకు ఆహ్వానపత్రికలను రాయబారులద్వారా పంపేవారు. వధువు  ఒక్కొక్క రాజును తన పరిచారిక  పరిచయం చేస్తుంటే తనకు కాబోయే […]

హ్యూమరథం – 5

అసలు పెళ్లిలో కొసరు పెళ్లి… రచన: రావికొండలరావు ఆచంట దగ్గరలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సినిమా షూటింగు. ఎపుడూ? సంవత్సరాల క్రితం. బ్లాక్ అండ్ వైట్ రోజులు. ఆ సినిమా పేరు గుర్తుకు రావడం లేదు. ఎంచేతంటే సినిమాకి నామకరణం చివరి దశలో జరుగుతుంది – మనుషులకి తొలి దశలో జరిగినట్టు కాకుండా. అంచేత, కొన్ని సినిమాల పేర్లు నోట్లో ఆడవు. అలాంటి సినిమాలు థియేటర్లలో కూడా ఆడవు. ఇంక పేరు గుర్తుండడం అనేది కల్ల. […]