May 3, 2024

ఓ కవితా ప్రళయమా.. శ్రీశ్రీ తరంగమా…ఇదే నీకు నా నివాళీ..

రచన:డా.గౌతమి తెలుగు సాహిత్యం ఒక అవని. ఈ అవనిపై ఎన్ని అద్భుతాల సృష్టి జరిగిందో సముద్రాలని, వనాలని, నదులని, కొండలు, పర్వతాలు..  అలాగే తెలుగు సాహిత్యావనిలో ఎందరో మహా కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు, కధకులు అందరికీ వందనాలు. ఒక్కొక్క కవి ఒక్కొక్క ఘని. ఏ ఒక్క ఘని గురించి గూడా క్లుప్తం గా చెప్పుకోలేము. తెలుగు సాహిత్యం దాదాపు  వెయ్యిసంవత్సరాల కాలం నాటిది. మహా భారతాన్ని మొట్టమొదట తెలుగులోకి అనువదించిన కవిత్రయము నన్నయ, తిక్కన మరియు […]

మీరు తలచుకొనండి – నేను కనుగొంటాను! – సమస్యకు జవాబు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు మాలిక మాసపత్రిక పాఠకులు నేను వివరించిన ఆటనుగుఱించి చదివారా అనే ఒక ప్రశ్న నాకు ఉదయించింది. ఈ ఆటనుగుఱించి ప్రచురణకు ముందే Facebook ద్వారా దయతో సంపాదకులు ప్రకటనను కూడ ఇచ్చారు. అయినా బహుశా వేలాది పాఠకులు చదివే ఈ అంతర్జాల పత్రికలోని ఈ ఆటలో ఒక్కరు, ఒక్కరంటే ఒక్కరు, కూడ నాకు సందేశము పంపలేదన్న విషయము ఎంతో బాధ కలిగించినదన్న మాట వాస్తవము. బహుశా అది నా దోషమేనేమో?  […]

రగడలు

రచన: మల్లిన నరసింహారావు రగడ తెలుగులో అచ్చమయిన జాతీయ ఛందస్సు. ఇది వైతాళీయముగా చెప్పబడినది. అనగా వితాళమైన (వేరు వేరు తాళములలోగల) నడకలతో నడిచే గేయ ఛందస్సు అని అర్థము. స్వచ్ఛందః సంజ్ఞారఘటా మాత్రాక్షరః సమోదితాః పాఠద్వంద్వ సమాకీర్ణా సుశ్రావ్యాసైవ పద్ధతిః. (స్వచ్ఛంద లక్షణము, సమమాత్రాక్షర నిర్మాణము, సరిపాదములు, పాదసంఖ్యా నియమరాహిత్యము , సుశ్రావ్యత్వము, రఘటసంజ్ఞకల ఛందస్సుకు లక్షణములు.) అని జయకీర్తి ఛందోనుశాసనమున దీని గేయ లక్షణమును చెప్పినాడు. దీనిలో మాత్రాసమకగణములే వాడవలయును. త్రిశ్ర అనగా మూడు […]

మాయానగరం-6

రచన: భువనచంద్ర  ఇంకో చోట———–   క్రొత్తగా తల్లి అయిన అమ్మాయి…ఓ పక్కన బిడ్డ ఆ పిల్ల రొమ్ము నోటిలో కరిచి పెట్టుకుని పాలు తాగుతుంటే, ఇంకో పక్క చచ్చిన భర్త తలని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని వుంది. ఆ పిల్ల యెక్కిళ్ళకి నగ్నంగా వున్న మరో రొమ్ము ఎగిరెగిరి పడుతోంది. ఎదురింటి పదిహేనేళ్ళ ‘కుర్రాడూ చావుని పట్టించుకోకుండా’ ఆ పిల్ల స్త్రీత్వాన్ని ఆబగా చూస్తున్నాడు. పిల్లాడు తన మానాన తాను పాలు తాగుతున్నట్టు దేవుడు కూడా […]

నందికేశుని నోము ( హాస్య కధ )

రచన : శర్మ జీ ఎస్     రంగారావు కాలం చేసిన తర్వాత , కొడుకు స్టేట్స్ కి వెళ్ళిన తర్వాత , భారతమ్మ కోడలుకి తోడుగా వుండటం తనకు నీడగా భావించింది . తమ పెద్దల నుంచి తాము నేర్చుకున్న , తెలుసుకున్న ఆచారాలను ఆచరిస్తూ , సంప్రదాయలను పాటిస్తూ ,తమ వారసులకు నేర్పించాలనే తాపత్రయంతో కొత్త కోడలు చేత , రేపు వచ్చే రధ సప్తమి నాడు నోము పట్టించాలని , స్టేట్స్ లో వున్న […]

అనగనగా బ్నిం కథలు – 12 (ఆబ్దీకం)

రచన: బ్నిం చదివినది: మోహనరావు అనగనగా.. కథల్లో పరకాయ ప్రవేశాలు చాలా చేశాను. వారానికో కథ రాయాలి. ఎంతోమంది వ్యక్తులు కనిపిస్తారు. అప్పట్లో ఎవరైనా దిల్‌కుష్‌గానో, దిగాలుగానో కనిపిస్తే వాళ్లని ఆవాహనం చేసుకుని వాళ్ల బతుకు మనం కొంతసేపు బతికేస్తున్నట్లు  ఫీలైపోయేవాణ్ని.  వాళ్ల కథ కాయితమ్మీదకి వెళ్లాక ఆ పాత్రని ఉద్వాసన చెప్పటానికి కొంత ఇబ్బందే అయేది. అందులో దిగాలుగా ఉన్న కథానాయకులే (నాయికలే) అందులో ఎక్కువగా కదిలేవాళ్లు. ఇంకోసారి కన్నవి కాకపోయినా,  విన్నవి రాయటం జరిగినప్పుడు […]

మౌనరాగం – 8

రచన: అంగులూరి అంజనీదేవి        http://www.angulurianjanidevi.com  anguluri.anjanidevi.novelist@gmail.com ‘అర్థం లేని మెహమాటాలకి, నిరర్ధకమైన మానవ సంబంధాలకి ప్రాధాన్యత యివ్వటం నాకు ఇష్టం వుండదు.’ అని అప్పుడెప్పుడో ఒక సందర్భములో అన్వేష్‌ అనటం గుర్తొచ్చింది కావ్యకి.   * * * * *   కారు దిగింది హుందాగా నడుచుకుంటూ లోపలకి వస్తున్న అన్వేష్‌ని చూసి ‘ఎవరు?’ అన్నట్లుగా చూస్తూ నిలబడింది నేహ. ఆమెకు దగ్గరగా వెళ్లి…. ‘‘నేహ అంటే మీరేనా?’’ అంటూ నేహ […]

అండమాన్ డైరీ – 6

రచన: దాసరి అమరేంద్ర             డిగ్లీపూర్‌లో నా ముఖ్య లక్ష్యం రాస్‌ &  స్మిత్‌ ద్వీపాలు. ఫోటోలు చూసి ఉన్నాను. సయామీస్‌ కవలల్లా ఆ రెండు ద్వీపాలూ ఓ ఇసుక దారితో సంధింపబడి ఉండడం  అక్కడి ముఖ్య ఆకర్షణ. ఆ ద్వీపాలకు వెళ్ళాలంటే ముందు పది కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న ఏరియల్‌ బే జెట్టీ చేరుకోవాలి. అక్కడినుంచి మళ్ళా మరపడవలో అరగంట ప్రయాణిస్తే ఆ ద్వీపాలకు చేరుకోవచ్చు. ఆలస్యమయి పోతోందన్న హడావుడిలో దారిలో కనిపిస్తోన్న అండమాన్ల ఏకైక […]

అమరనాథ్ యాత్ర

రచన: కర్రా నాగలక్ష్మి           హిమాలయాలలో ఉన్న మరో ముఖ్య మైన శైవక్షేత్రం  అమరనాథ్ . ఈ యాత్ర మెత్తం ఏడాదిలో ఒక నెల మాత్రమే జరుగుతుంది. మిగిలిన 11నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ యాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢ పూర్ణిమతో మొదలయి శ్రావణ పూర్ణిమతో ముగుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ యాత్రని 2 నెలలకు పొడిగించారు అంటే ఇప్పుడు జ్యేష్ట పూర్ణిమతో మొదలయి శ్రావణ పూర్ణిమ వరకు […]