May 4, 2024

అనగనగా బ్ని కథలు – 13 ( అమ్మమ్మ)

రచన: బ్నిం చదివింది: ఝాన్సీ అమ్మమ్మ కథ చదివి సజీవ పాత్రని చూపిన ఝాన్సీకి నమస్కరించకుండా ఈ కథ గురించి చెప్పలేను. నేను సృష్టించిన పాత్ర అయినా నేను నడిపిన కథ నేడు వింటుంటే, కథయినా అనేకసార్లు గుండె తడయ్యింది. అమ్మమ్మ పేరు సీతామాలక్ష్మి.. ‘బుల్లెమ్మాయ్’ అంటారు సర్పవరంలో అందరూ. సర్పవరం భావనారాయణ స్వామి అంటే ఎంత ఆరాధిస్తారో బుల్లెమ్మాయ్‌ని కూడా.. అంత అభిమానిస్తారు. అందరూ అంత ఆత్మీయులు కావడానికి కారణం ఆమె ఎటాచ్మెంటా? కాదు అమ్మమ్మ […]

మాయానగరం-7

రచన: భువనచంద్ర   శామ్యూల్ రెడ్డిగారు అంటే రెక్టారుగారు ఇన్ స్పెక్షన్ అయిపోయాక మిస్ శోభారాణి గుడిసెల సిటీ పిల్లలకి చాక్లెట్లు పంచి (మరో ఇన్ స్పెక్టర్ వస్తే వాళ్ళని పంపించడం తెలికనే ముందుచూపుతో) ‘అఫ్’ మని ఊపిరితీసుకుంది. అవ్వాళ శోభారాణి అదృష్టం బాగుంది గనుక అంతా బాగా జరిగింది. లేకపోతే నానారభస, నానా రచ్చ జరిగేది. అందుకే కొలీగ్స్ కూడా సుఖంగా ఊపిరి పీల్చుకుని శోభారాణిని ‘కంగ్రాట్’ చేశారు. అంతేకాదు, హెచ్.ఎం శోభారాణిని ప్రత్యేకంగా మెచ్చుకుని […]

పాప-బాబు బ్యాచ్:

రచన: మధు అద్దంకి   చక్కని యూనిఫార్ములు వేసుకుని ముద్దు ముద్దుగా బ్యాచీలు బ్యాచీలుగా స్కూల్ కి వెళ్ళే పాపలు, బాబుల గురించి ఏమి చెప్తుందబ్బా అనుకుంటున్నారా? అయితే మీరు మాంఛి ముద్దపప్పులో కాలేసినట్టే!! నేను చెప్పేది ఆ పాపా, బాబులు గురించి కాదు..వీళ్ళు వేరే.. ఎహే సాగదీయకుండా సంగతి చెప్పు అంటారా? అయితే పదండి కధలోకి వెల్దాం… అనగనగా అనకాపల్లి.. అక్కడ ఉన్న ఎన్నో మధ్యతరగతి కుటుంబాల్లో ఒకటి సింగినాదం రామారావుది!!! ఆయన్ని అందరు రాముడు అని […]

అక్కరలు

రచన: మల్లిన నరసింహారావు ఇది అక్షర శబ్ద భవము. కన్నడంలో ఈ ఛందస్సుకు అక్షర అని పేరు. తెలుగులో అక్కర లన్నారు. జానపద గీతాలలో వలె ప్రతి గణము నొకమారు విచ్ఛేదము ఉండునని “ పాదే పాదే ప్రతి గణ మపి యతి ర్లక్ష్యతే సర్వేషాం మక్షరాణాంచ” అని చెప్పుటచే ఇవి జానపద గీత జన్యములని తెలియు చున్నది. అక్కరలలో చంద్ర గణముల ఉపయోగముండును       ( మధ్యాక్కరలో తప్ప). ఇవి చాలా ప్రాచీనమైన శాసన సాహిత్యములో సహితము […]

“బులుసు సుబ్రహ్మణ్యం కథలు..” సమీక్ష..

                                                                                                                  రచన: జి.ఎస్.లక్ష్మి..   నవ్వను నేనని భీష్మించిన నిను నవ్వక తప్పదని చెప్పి యొప్పించంగా నవ్వుల విందగు ఈ కథలను నవ్వక మూతి బిగించి నువ్వు చదువగ గలవే… ఇలాగని స్టాంప్ పేపర్ మీద వ్రాసి సంతకం పెట్టమంటే నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మొహమాటంగా పెట్టేస్తాను. నేనేకాదు.. శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు వ్రాసిన ఈ పుస్తకం చదివాక మీరు కూడా పెట్టేస్తారు. కొంత కాలం క్రితం తెలుగు బ్లాగులలో “నవ్వితే నవ్వండి.’’ అన్న బ్లాగు మొత్తం బ్లాగ్లోకాన్ని […]

అనుకున్నదొక్కటి .. అయినదొక్కటి ..

రచన: లక్ష్మీ వసంత ఈ ఆదివారం అయినా ఈనాడు అనుబంధంలో కథ, హిందూలో కల్పనా శర్మ వ్యాసం చదివేయాలి అన్న నా చిన్న చిన్న ఆశలకి గంట కొట్టేస్తూ ఫోన్‌ కర్కశంగా మోగింది.  ట్రింగ్..ట్రింగ్ మంటూ ..  ఖంగారు  పడకండి అవి లాండ్ లైన్‌ మాత్రమే ఉన్న రోజులు మరి . నా జీవితంలో ఎప్పటికైనా ఈనాడు ఆదివారం అనుబంధంలో నా కథ చూసుకోవాలని ఎంత ఆశో!!  కథకి వేసిన బొమ్మ కింద నా పేరు రచయిత్రి  […]

అనంత వాహిని – సమీక్ష

రచన: మాలా కుమార్ మంథా భానుమతిగారు ప్రభుత్వ సిటీ కాలేజిలో రసాయనశాస్త్ర  బోధకురాలిగా 2000 లలో స్వచ్చంద ఉద్యోగ విరమణ చేసారు.  ఆవిడ  తొలి కథానిక 1993 లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం అయ్యింది. ఇప్పటి వరకూ పది నవలలు, పాతిక పైగా కథానికలు వ్రాశారు. కొన్నింటికి బహుమతులు లభించాయి. మంథా భానుమతిగారు  వ్రాసిన ఇరవై రెండు కథానికల సమాహారమే “అనంత వాహిని.” వీరు మొదటగా వ్రాసిన కథ “చేపా చేపా ఎందుకు ఎండలేదు.” ఈ కథల […]

పిట్ట కొంచెం కూత ఘనం

రచన: డా. జె. గౌతమీ సత్యశ్రీ   “అతి  చిన్న వయసులోనే మోస్ట్ ఇన్ స్పైర్డ్ పొలిటికల్ ఫిగర్ గా ప్రపంచఖ్యాతిని గాంచిన ప్రవాసభారత సంతతి, లండన్ వాస్తవ్యురాలు శర్మిష్టా చక్రబర్తి” !! అచంచలమైన ధృఢవిశ్వాసం,  పట్టుదల, తలదన్నేవాళ్ళు ఎవరున్నా తాడినిదన్నేది నేనే అనేటటువంటి నిశ్చితమైన వ్యక్తిత్వపు వైఖరిని ఆమె ఊపిరిగా చేసుకుని పౌర హక్కుల పరిరక్షణకు నడుం కట్టి, మానవ హక్కులకోసం పోరాడే సాహస యువతి, ప్రవాస భారత సంతతి శర్మిష్టా చక్రబర్తి. ఈమెను షామీ […]

అండమాన్ డైరీ – 7

రచన: దాసరి అమరేంద్ర ఇహ బీచ్‌ వదిలిపెట్టి చౌకీదారు స్నేహితుడు చెప్పినట్టు లోపలి మార్గం పట్టుకొన్నాను. పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, పొలాల్లో జరుగుతోన్న పనులు ` ఓ క్షణం అసలు నే ఉన్నది అండమాన్‌లోనా లేకపోతే నాకు తెలిసిన కృష్ణాగోదావరి డెల్టా ప్రాంతాలలోనా! అన్న అనుమానం కలిగేసింది. అంత పోలిక.. నాకు తోచిన చిట్టచివరిదాకా వెళ్ళి తిరుగు ప్రయాణం ఆరంభించిన తరుణంలో ఓ పెద్ద మనిషి కనిపించాడు. ఏభై ఏళ్ళు ఉండొచ్చు. నల్లటి శరీరం.. బొద్దు […]