May 6, 2024

Gausips !!! రోబోట్ల (కే) దేవుడు.. !!

రచన: డా. జె. గౌతమీ సత్యశ్రీ మెడికల్ సైన్స్ రంగం ఎప్పుడూ కూడా తనకి సమాధానాలు దొరికేంతవరకు (ఒక ప్రక్క అన్వేషిస్తూనే) జబ్బులకు ఏ పేరు పెట్టాలో తెలియకపొతే సింపుల్ గా “డిసార్డర్” అనేస్తుంది. అంటే.. ఇంకా ఏదీ మా ఆర్డర్ లోకి రాలేదూ.. అని. ఇలాంటి ఆర్డర్లో రాని, లేని ఆరోగ్యసమస్యలను చిటికెలో నిర్ధారణ చేసి తన శ్రేయస్సుకి తోడ్పడడానికి మనిషి సృష్టించిన క్రొత్త దైవం రోబోట్లకే దేవుడు “వాట్సనుడు” (వాట్సన్ సూపర్ కంప్యూటర్, Watson […]

వెటకారియా రొంబ కామెడియా 5 – ఎలెక్షన్ల జాతర

రచన: మధు అద్దంకి  ఢం ఢం ఢం ఢమ ఢమా….ఢబ్ ఢబ్..ఢభీ ఢబీ అన్న శబ్దాలు విని ఉలిక్కి పడి లేచారు గౌరమ్మ, గురవయ్యా… టయిం ఎంతయ్యిందీ అనుకుంటూ చూస్తే రాత్రి 3.00 అయ్యింది.. ఈ టయింలో శబ్దాలేంటి అనుకుంటూ ఉంటే ఏమండీ అని గావుకేక పెట్టింది గౌరమ్మ… ఆ కేకకి ఉలిక్కిపడి వెన్ను చరుచుకుంటూ “ఓసి నీ మొహం మండా ఎందుకే అంత గావు కేక పెట్టావు” అంటే “ఏమండీ ఒక్కసారి ఆ శబ్దం వినండి” […]

కంప్యూటర్ దండకం

రచన: తటవర్తి జ్ఞానప్రసూన ఓమ్!  కంప్యూటరాయనమః కలికాల జీవన విధాన తారణోపాయనమః ఉచ్చ.. నీచ, బీద గొప్ప తారతమ్య రహిత తారకమంత్రాయనమః యువ మానస రజ హంసాయనమః ఇంటింటి దేవతాయనమః చదువుకున్, పాటకున్, మాటకున్, ఆటకున్, తపాలా పనులకున్, పద్దులకున్, హద్దులు దాటించే విహారాలకున్, ప్రచురణలకు, ప్రణయాలకు, పరిణయాలకు, విపణికిని, కవితా నిపుణులకు, అర్ధాలకు, ఆరోగ్యానికి, విమర్శలకు, పంచాంగానికి, ప్రయాణాలకి, టిక్కట్లకి, దారి చూపడానికి, టైము తెలపడానికి, ఎండావాన రాకపోకలకి, వార్తలకి, వినోదాలకి, ఇంకా వేవేల సలహాలకి, […]

“ సత్తాకి సత్కారాలు “

రచన:  శర్మ జి ఎస్   నరలోకంలో జీవితం గడపినన నరులు వారి దేహం చాలించిన పిమ్మట , మొదట నరకలోకానికి తరలించబడ్తారు . అచ్చట  వారా నరలోకంలో ఎలా , ఏ రకంగా జీవనం సాగించారో తనిఖీ చేసిన చిత్రగుప్తుడు , వారి ప్రభువులైన యమధర్మరాజుల వారికి విన్నవించి వారి ఆదేశానుసారము , తదనుగుణంగా వారిని ఏ రకంగా గౌరవించాలో ఆ నరకలోకంలో నిర్ణయం చేసేస్తుంటారు . ఆ యమలోకం నుంచి నరలోకంలో ధర్మబధ్ధతతో గడిపిన వారిని […]

ఆరాధ్య – 4

రచన: అంగులూరి అంజనీదేవి పంతులుగారు లగ్నపత్రికలు రాస్తున్నారు. ఆయన శ్రీనివాసరెడ్డి వైపు చూసి హేమంత్‌ ఇంటిపేరు, గోత్రం అడిగారు. వచ్చేముందు హేమంత్‌ ఏం చెప్పాడో అదే చెప్పారు శ్రీనివాసరెడ్డిగారు. పంతులు గారు లగ్నపత్రిక రాయడం పూర్తిచేసి ”అందరూ వినండి!” అంటూ పైకి చదవటం మొదలుపెట్టాడు. శాంతారాం పంతులు గారి వైపు చూస్తున్నాడు. రమాదేవి ఎవరివైపు చూడకుండా తలవంచుకొని కళ్లనీళ్లు పెట్టుకుంటోంది. ఆమె ఎందుకలా కళ్లనీళ్లు పెట్టుకుంటుందో అర్థంకాక బిత్తరపోయింది కళ్యాణమ్మ. రమాదేవికి ఎదురుగా కూర్చుని వున్న ఆమె […]

తిరుమలేశుని సన్నిధిలో…

రచన: డా. రేవూరు అనంతపద్మనాభరావు   శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ లో దిగి తెలతెలవారేవేళ 6 గంటలపైన సువర్ణముఖీ నదీతీరంలో నించున్నాం. మా కుటుంబం యావత్తూ ముప్పయిమందిమి నదీ స్నానాలకు అక్కడ చేరాము. అది 1960 జూన్ నెల. అప్పట్లో గూడూరు వరకే బ్రాడ్ గేజీ రైలు నడిచేది. అక్కడనుండి మీటరుగేజు రైల్లో రేణిగుంటవరకు వెళ్ళి ఆ పైన తిరుపతి చేరుకోవాలి. మా నాయనమ్మకు పదిమంది సంతానం. వారి పిల్లలందరం కలిసి మొక్కుబడి చెల్లించుకోవడానికి సకుటుంబ సపరివార […]

పెనుగొండ గత కీర్తి–కవి హృదయార్తి

రచన: లక్ష్మీదేవి                        సరస్వతీ పుత్రులు, పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఛందస్సు మీద పట్టు రాని  పన్నెండేళ్ల లేత ప్రాయములోనే వ్రాసిన పెనుగొండ లక్ష్మి అను గేయకావ్యములోని ప్రతి పద్యమూ రత్నము వంటిదే. ఘనగిరియై రాయల వంశావళి కీర్తికాంతుల ఛటలను పట్టి నిల్పినదైన పెనుగొండ నేటి స్థితిని చూచి మనసు ద్రవించి వ్రాసిన ఈ చిన్ని కావ్యములో రసావిష్కరణ, పదలాలిత్యము, ప్రౌఢ రచనాశైలీ సౌరభం ఎంత నాణ్యమైనదో చదువరులు తెలిసికొని యానందింపవచ్చును. పదమూడు వందల ముప్పదియారు-యేబది […]

స్థనఖండే తార తరిణి

రచన: నాగలక్ష్మి కర్రా మన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సాలో ఉన్న ఆదిశక్తి పీఠం యిది .  స్థన ఖండే “తారా తరిణి “.. “తార “యని మరియు “తరిణి” యని యిద్దరు దేవతులుగా వుద్భవించేరు. ఆది శంకరాచార్యులు అష్థాదశ పీఠాలకి  ముందు ఆదిశక్తి పీఠాలని నాలుగుగా గుర్తించారు. అవి 1)    ముఖ ఖండే దక్షిణ కాళిక యిది కలకత్తాకి షుమారు 25కిమీ దూరంలో వున్న “దక్షిణేశ్వర్ “లో రామకృష్ణపరమహంస చే పూజలందుకొని “దక్షిణ కాళిక “గా పిలువ […]