May 9, 2024

కలం.

రచన: విజయలక్ష్మీ రుద్రరాజు పుస్తకం నా నేస్తం పఠనం నా ప్రాణం కవిత్వం నా ఊపిరి కలం నా ఆయుధం. ఈ కలాన్ని హలాన్ని చేయగలను నాట్లేయగలను నారేయగలను కానీ అన్నార్తుల ఆకలిని తీర్చలేక పొతున్నాను న్యాయాన్ని పండించలేకపోతున్నాను నేను ఓడిపొతున్నాను. ఈ కలాన్నీ గళంగా మార్చగలను యుగాలగీతాలని ఆలపించగలను కానీ అన్యాయాన్ని అణచలేకపోతున్నాను సమావత్వాన్ని పెంచలేకపోతున్నాను నేనూ ఓడిపొతున్నాను. ఈ కలాన్ని మగ్గంగా మార్చుకోగలను రంగుల దారలను ఒడకగలను సుందర వస్త్రాలను అల్లగలను కానీ ఆడంబరాలను […]

బాలమురళి – స్వర్గప్రస్థానం

రచన: కిభశ్రీ (శ్రీనివాస భరద్వాజ కిశోర్) చిత్రం: శివప్రసాద్ ఆవె-1: బాలమురళి యనెడు భానుడీ భువియందు వెలిసి నింపినాడు వెలుగుతోటి గానకోవిదుండు కన్నుమూయగ నేడు కారు చీకటిచట కమ్ముకొనెను ఆవె-2: రాగమాలపించి రాళ్ళనే కరిగించె సుస్వరమ్ములందు చూపె పటిమ పరవశింపజేసె భక్తి తత్వములందు తిల్లనాలలోన దిట్టయతడు ఆవె-3: కొత్తరాగములను కొన్నింటి సృష్టించి కొత్త నడకలందు కూర్చినట్టి భాషలారిటందు బహుమూల్యమౌ పాట లందజేసి యెక్కెనందలమ్ము ఆవె-4: బాలమురళి పాట పరదేశములనుండు రసికులెంతొ మెచ్చి రత్నమనిరి భరతజాతికూడ భరతరత్నమ్మిచ్చి సత్కరించవలయు […]

ఇంద్రియాలు – అంతరేంద్రియం

రచన: అఖిలాశ జ్ఞానం ఆజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది ఆఙ్ఞానాన్ని చీల్చి చీకటిలో ఉన్నా ఙ్ఞానాన్ని వెలిగించు నిర్లక్ష్యం నీ కక్ష్యను మారుస్తుంది నిర్లక్ష్య కక్ష్యలోకి నీ అడుగు వేయకు అసహనం నీ సహనానికి పరీక్ష సహనంతో అసహన పరీక్షను జయించు కామక్రోధాలు అతల పాతాళానికి త్రోయును కామక్రోధాలు విడువండి సత్యలోకాన్ని చేరండి అశాంతి మీ శాంతిని చెడగొట్టును శాంతితో అశాంతిని శాంతింప చేయండి అసంతృప్తి ఉన్నచోట సంతోషం ఉండదు సంతృప్తితో అసంతృప్తిని బర్తి చేయుము పరులపై […]

నిజాలు

రచన: పారనంది శాంత కుమారి అమ్మమాటకో,ఆలిమాటకో లొంగిపోవటం కాదు ఇద్దరి మాటలకు సమానమైన విలువివ్వాలి. అమ్మవైపో ఆలివైపో ఒంగిపోవటం కాదు, ఇరువురిని ఒకేలా చూడగలగాలి. ఆ ఇద్దరిమధ్యన ఘర్షణలకు కుంగిపోవటం కాదు, సమయస్ఫూర్తితో వాటిని తీర్చగలగాలి. వారిరువురిలో ఎవరునిన్ను మెచ్చుకున్నా పొంగిపోవటం కాదు, ఆ పొగడ్త వెనుకనున్న అసలు ప్రయోజనం తెలుసుకోగాలగాలి. అమ్మని ఆదరిస్తూనే భార్యప్రేమని ఆస్వాదించాలి. అమ్మ అవసరాలను తీరుస్తూనే భార్యమనోగతాన్ని స్వాగతించాలి. అమ్మని గౌరవిస్తూనే ఆలిని గారంచేయాలి. అమ్మని అపార్ధం చేసుకోకుండానే ఆలిని అర్ధంచేసుకోవాలి. […]

మాలిక పత్రిక నవంబర్ 2016 సంచికకు స్వాగతం – International Men’s Day Special

  Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి … కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల చేత […]

మాటల మనిషి కాడీయన, చేతల మనిషి! -ముఖాముఖి

నిర్వహణ: శ్రీసత్య గౌతమి పి.హెచ్.డి. మాటలమనిషిని కాను, చేతల మనిషిని అంటూ డబ్బుకు వెరయక తనదనే శైలిలో “శ్రమదానం” అంటూ మార్గమేసిన మార్గదర్శి శ్రీ గంగాధర్ తిలక్ కాట్నంగారితో మెన్స్ డే సంధర్భంగా నా ముఖాముఖి. ప్రొద్దున్న లేస్తూనే అలవాటుగా ఎప్పుడూ ప్రక్కనే ఉండే సెల్ ఫోన్ మీదకి దృష్టి సారించాను. దాంట్లో మొదటి మెసేజ్ జ్యోతీవలబోజు గారిది. మాలిక “మెన్స్ డే” వార్షికోత్సవం జరుపబోతోంది. ఒక స్పెషల్ కేటగిరీ పెర్సన్ ది ఇంటర్వ్యూ తీసుకొని మాలికకు […]

ఉపయుక్తమైన చిట్కాలు, జాగర్తలు

నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ How to Track your Family, Friends ఇక బయటికెళ్లిన మన వాళ్లకు ఏమవుతుందో ఇక వర్రీ అవ్వాల్సిన పనిలేదు.. వీడియో లింక్ ఇది: కాలు తీసి బయట పెట్టిన మనిషి మళ్లీ తిరిగి వచ్చేవరకూ టెన్షనే మనందరికీ. రోజూ టైమ్‌కి ఇంటికొచ్చే మనిషి గంట దాటినా రాకపోతే… ఫోన్ తీయకపోతే.. ఏం జరిగిందో ఎక్కడున్నారో అని ఆదుర్ధాపడుతుంటాం. ఇంత మానసిక వత్తిడిని ప్రతీరోజూ అనుభవించే వారి […]

మాయానగరం – 31

రచన: భువనచంద్ర ఆనందరావు బోంబేకి వెళ్ళాడు. అందరిలా హోటల్ ఫుడ్డు కాకుండా “సామూహిక వంట ‘ తో విందుని ఇచ్చాడు. మాధవి, శోభ, మదాలస, సుందరీబాయే కాక సౌందర్య, వసుమతి కూడా విందులో పాల్గొన్నారు. ఏ కళనుందో గానీ సుందరీబాయి అందరిలోనూ మామూలుగానే వుంది. అది ఆనందరావుకి చాలా ఆనందాన్నిచ్చింది. “మీకు జాబ్ దొరికింది! మాకు చాలా చాలా ఆనందం ఆనందరావుగారూ, నేనూ ఏదో ఓ జాబ్ సంపాయించుకోవాలి ! ” ఆనందరావుని అభినందిస్తూ అంది మదాలస. […]

ప్రమేయం ఒక కథ .. మూడు ముగింపులు

రచన:- రామా చంద్రమౌళి అదృష్టం.. అంటే దృష్టము కానిది.. అంటే కనబడనిది . ఏమిటి కనబడనిది.? ఏదైనా.. నేటికి రేపు.. కనబడనిది.. వర్తమానానికి భవిష్యత్తు కనబడనిది.. మనిషికి మనసు.. కనబడనిది.. కళ్ళకు గాలి కనబడనిది.. అసలు మున్ముందు జరుగబోయే జీవితం ఏమిటో.. అస్సలే కనబడనిది. ఒక స్త్రీ, పురుషుడి జీవితంలో ‘ పెళ్ళి చూపులు ‘ అనే ప్రహసనం ఎంత పెద్ద జోకో .. అనుకుంది లీల. వెంటనే అమ్మ జ్ఞాపకమొచ్చిందామెకు. తనను పెళ్ళి చూపులకు అలంకరించి […]

“కళాఖండం – A Work Of Art”

రచన: వంశీ మాగంటి కాగితం పొట్లం ఒకటి చంకలో పెట్టుకుని ఆ కుర్రాడు మెల్లగా డాక్టరు గారి రూములోకి అడుగుపెట్టాడు. “నువ్వా అబ్బాయ్! రా రా! తేలికగా వుందా ? ఏమిటి విశేషాలు” “మా అమ్మ మీకు నమస్కారాలు చెప్పమంది. నేను మా అమ్మకి ఒక్కణ్ణే కొడుకుని. భయంకరమైన జబ్బు నుంచి కాపాడి నా ప్రాణం నిలబెట్టారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలమో తెలియట్లేదు” “నాన్సెన్స్ . నేను చేసిందేముంది? నా స్థానంలో ఎవరున్నా చేసేదే నేనూ […]