April 27, 2024

“కుక్క తోక వంకర “

రచన: మీనాక్షి శ్రీనివాస్ “ఏమోయ్. ఈ నెలలో ఎవరి పెళ్ళి వుందంటావ్. . ?”చదువుతూన్న పేపర్లోంచి తలెత్తి హటాత్తుగా అడిగాడు శంకరం మాస్టారు. “ఆ మీదీ . నాదీనూ . . . ”వంటింట్లోంచే అరిచింది పార్వతమ్మ. . . “అయిపోయిన పెళ్ళి గురించి కాదోయ్ నేనడిగింది . మనం వెళ్ళాల్సిన పెళ్ళి గురించి “తాపీగా అడిగాడు పార్వతి తెచ్చిన కాఫీ గ్లాస్ అందుకుంటూ . “మహానుభావా. పాపం . . . ఇది ఆషాఢం. పెళ్ళిళ్ళు […]

వామ్మో! పుట్టినరోజు

రచన: సతీష్ కుమార్ నాన్న, తమ్ముడి బర్త్ డే పార్టీ కి, మా ప్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇంటిలో అడుగు పెడుతోంటే మా పెద్దాడు, పదేళ్లవాడు నాకు చెప్పిన సంగతి అది. సరే, అని తల ఊపి , లోపలికి నడిచాను చిన్నాడికి డ్రెస్ కొనాలి గుర్తు చేసింది నా అర్ధభాగం. వాడి పుట్టినరోజు ఇంకా వారం రోజులు తరవాత కదా, అప్పుడు చూసుకోవచ్చు అని ఊరుకున్నాను. ఆ వారంలో ఎదురొచ్చిన ఆదివారం, నా బ్రతుకు షాపింగ్ […]

ఆంధ్ర శాకంబరీమాత గోంగూర

రచన: ఎమ్మెస్వీ గంగరాజు చల్లని తల్లిగ విలసిలు అల్లన శాకాంబరీ ప్రసాదితవమ్మా జిల్లని నాల్కల తుప్పును మళ్లించెడి మాతవమ్మ మా గోంగూరా! ఏ తెలుగు పర్వమందున లాతులుగా పిండివంట లన్నియు వున్నా మూతికి నీ రుచి తగలక మాతా! అది విందు కాదు! మా గోంగూరా!! ఎంగిలి పండ్లను తినుచూ చెంగల్వల తోడ పూజ సేవయు నొందీ మంగళ మూర్తగు రాముడు అంగన! నిను తలచె నంట మా గోంగూరా! మాయా బజారు చిత్రము శ్రేయోదాయకము నయ్యె […]

నాచన సోమనాథుడు

రచన: బాలాంత్రపు వేంకట రమణ నాచన సోమనాథుడు అనగానే మనకి చప్పున గుర్తుకొచ్చే పద్యం : అరిజూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై తొరుగం బయ్యెద కొంగొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్ దరహాసామృత పూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్ ఈ పద్యం నాచన సోమనాథుడు రచించిన “ఉత్తరహరివంశము” లో సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్న ఘట్టంలోనిది. ఆమె శ్రీకృష్ణుని ప్రక్కనే ఉండి యుద్ధం చేస్తోంది. దూరంగా ఉన్న శత్రువుని […]

అశ్వమేధము

రచన: ఇందిరా గుమ్ములూరి పురాణవైరగ్రంధమాలలో ‘అశ్వమేధము’ అరవ నవల. దీని రచనకాలం 1960 . దీనిని శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెపుతూ ఉంటె శ్రీ జువ్వాడి గుతమరావుగారు లిపి బద్ధం చేసారు. మౌర్య వంశ పతనం, శుంగ వంశ పాలనారంభం ఇతివృత్తంగా కలిగిన నవల ఇది. మౌర్య వంశజులలో చివరి రాజు బృహద్రథుడు. యీతని సేనాని పుష్యమిత్రుడు శుంగ వంశుజుడు. బృహద్రథుడు వ్యసనపరుడై రాజ్యపలనని నిర్లక్ష్యం చేసి, ప్రజలందరికీ అనిష్టుడైయ్యాడు. అపుడు అతని సేనాని అయిన […]

పూర్తి సంతృప్తినిచ్చే..”పూర్వి” కధా సంపుటి

సమీక్ష – టేకుమళ్ళ వెంకటప్పయ్య. తొలి కధగా గురజాడ “దిద్దుబాటు” వచ్చి ఒక శతాబ్దకాలం దాటింది. కాలానుగుణంగా నాలుగు తరాలనుండి రచయితలు/రచయిత్రులు ఆధునిక తెలుగు కధను నిలబెట్టి ప్రాణంపోస్తున్నారు. ఇటీవల కధా వస్తువుల్లో వైవిధ్యం పెరిగడంతో బాటూ శిల్ప ప్రాధాన్యతా పెరగడం గమనించవచ్చు. లబ్ధప్రతిష్టులైన ఎందరో రంగమధ్యంలో నిలబడి కధను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే నిరంతర కృషి కొనసాగించడం ప్రశంసనీయం. నవ్వడంకోసం లాఫింగు క్లబ్బులకి వెళ్లనక్కరలేదు. ఓ మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం,పానుగంటి లక్ష్మీనరసింహం పంతులు గారి […]

!! కోరుకొండ నుంచి పాపి కొండల వరకు !!

రచన: -పుష్యమీ సాగర్ .. మిత్రులకు వందనము, చాలా రోజులు అయింది మిమ్మలనందరిని పలకరించి …మరల ఇలా మీ ముందుకు వచ్చాను ..పని ఒత్తిడి వలన రాలేకపోయాను మన్నించండి ..ఇవాళ యాత్ర లో మీకు అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పబోతున్నాను (నాకు తెలిసి నేను చెప్పబోయే ప్లేస్ గురించి తెలిసే ఉంటుంది ). అదే రాజమండ్రి అలియాస్ రాజమహేంద్రవరం. ఇంకా దాని చుట్టు పక్కల ప్రదేశాలు గురించి చెప్పబోతున్నాను ..చాలా రోజులనుంచి ఇన్ ఫాక్ట్ సంవత్సరాల నుంచి […]

నాన్న…

రచన: పద్మా త్రివిక్రమ్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిదిదేవోభవ సీతారాములు, పార్వతి పరమేశ్వరులు, రాధా కృష్ణులు భార్య భర్తలు, తల్లి తండ్రులు ఈ విధంగా చిన్నతనం నించి విని విని బహుశా నాన్న అనగానే ఒక తేలికభావం కన్నా అమ్మ అంటే అందరికి ఒక గొప్ప మధుర భావన. అందులోను మన సమాజంలో చాలామంది నాన్నలు భార్యలని కొట్టడం, తాగడం, పేకాట ఇవ్వన్ని చూస్తూ వింటూ పెరిగిన పిల్లలకి ఆ చిన్ని మనసులలో నాన్న అనగానే ఒక […]

సహజీవనం (Living Together)

రచన: టీవీయస్. శాస్త్రి నిర్దిష్ట వయో పరిమితి దాటిన ఇద్దరు విద్యార్దులు సహజీవనం (living together ) చేయడాన్ని కేరళ హైకోర్టు తప్పు పట్టింది. కేరళలోని కొల్లాంలో మార్ తోమ ఇంజీనిరింగ్ కాలేజీలో చదువుతున్న ఛాయామంగళం , ఆమె క్లాస్ మేట్ ప్రేమించుకున్నారు. ఆ తర్వాత వారు పెద్దలతో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీ యాజమాన్యం వారిని కాలేజీ నుంచి పంపివేసింది. దానిపై ఛాయామంగళం హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 11

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య. రాగబంధాలు ఆత్మజ్ఞానానికి, మోక్షానికీ అడ్డంకులు. వస్తుభ్రమలకు, తాత్కాలిక సుఖాలకు బానిసలైన మానవులు రాగబంధాలతో మళ్ళీ అనేక పాపకార్యాలాచరిస్తూ..మళ్ళీ మళ్ళీ ఈ చక్రంలో పడి తిరుగుతునే ఉన్నారు. వాటిని వదలించుకోవాలని చూసేకొద్దీ మళ్ళీ అవే సంసార బంధాలు మాకు తగిలిస్తున్నావు ఎందుకు? అని అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని నారాయణా.. అని ఈ కీర్తనలో దీనంగా వేడుకుంటున్నాడు. పల్లవి: నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీనారాయణ ||నిగమ|| చ.1. దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య నోపకరా […]