April 26, 2024

కృషీవలా

రచన: ఉమా పోచంపల్లి. నేటికి యెన్ని దినములైనవో ఆకలితో నుండు మాకు కూటికి యన్నము పండించి చీకటి బ్రతుకుననుభవించితివీవు! కటకటా కన్నుల నిండ నీరు పెల్లుబికి వచ్చు గ్రీష్మమునందు వర్షములు కురియుచున్నవి బీటలువారిన నేలయదేల తడవకున్నదో అధికస్య యధికఫలం బనుచు యున్న గింజలన్ని నేల జల్లితి వేదీ ఒక్క గింజయు చేరలేదు కదా వేరులూనగా నేలతల్లి యెదన గున్నమామిడి చెట్టుకొమ్మన కన్నులరమోడ్చినటుల కట్టకడకు ఏల ఈ విధమున చెట్టువలెనుండెడి వాడవు చెట్టునే వ్రేళ్ళాడుచుంటివి, నిర్గమించి ఇలను, మూగవోయెనదె […]

అన్వేషణ

రచన: సుపర్ణ మహి చిగురు పచ్చని దుప్పటి కప్పుకుని పడుకున్న కొండ సానువుల నడుమ అలవాటుగా సుడులు తిరిగే చల్లగాలిలా నడిచొస్తుంది డాబా మీదకి…. చెప్పడానికి నేను మాటలన్నీ సిద్ధం చేశాక, మౌనం వొదిలిన యోగి ఆర్తితో మోకరిల్లిన ఆరాధకుణ్ణి చూస్తున్నట్లుగా అంటుంది… ‘సారీ రా చాలా లేటయింది కదా…’ గడిచిపోయిన కాలమంతా కూడబలుక్కుని మిగిల్చిన అద్భుతం కదా ఇది… ఎవరికి గుర్తుంటుంది ఆలస్యం అనడానికి యుగాల క్రితం మొదలయిన ఈ అన్వేషణకి మొదటి నిముషం ఎప్పుడు […]

ఉగాది కవితలు – సాధారణ ప్రచురణ

ఉగాది సందర్భంగా మాలిక పత్రిక నిర్వహించిన కవితలపోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైనవి: జీవితం -ప్రతాప వెంకట సుబ్బారాయుడు జీవితం ఇంద్రధనుస్సులా ఆకర్షణీయంగా కనిపించాలి ఆనందాంబుధిలో అనుక్షణం ఓలలాడాలి మధుర తాయిలాలని ఒక్కసారన్నా రుచిచూడాలి సౌగంధికపుష్ప సుకుమారత్వం అణువణువునా గోచరించాలి పంచేంద్రియాలను మధురానుభూతుల భావనలు ముప్పిరిగొనాలి ఇలాంటి అందమైన అనుభూతులన్నీ మనకి కావాలనుకుంటే ఎలా? షడ్రుచుల కలయికే జీవితం అన్న స్థితప్రజ్ఞత అలవడడానికే వత్సరానికోసారి షడ్రుచులపచ్చడి సందేశం వర్తమానం ఎలావున్నా..భవిష్యత్తుపట్ల జాగరూకత ఎరకపరచేదే పంచాంగశ్రవణం ఎండలు మండిపోతున్నా_ కమ్మని […]

ప్రసిద్ధ వాడపల్లి లక్ష్మీనృసింహ స్వామి

పుష్యమిసాగర్                                                       మా చెల్లెలు ఎప్పటినుంచో అడుగ్తున్న “వాడపల్లి” టూర్ ని మొన్న మార్చ్ లో వెళ్ళడం జరిగింది. ఎండలు మండిపోతున్నాసరే వెళ్లి తీరాల్సిందే అన్నప్పుడు ఇంకో ఆప్షన్ లేదు కదా…ఓ వర్కింగ్ డే ని త్యాగం చేసి ఉదయాన్నే […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 6

టేకుమళ్ళ వెంకటప్పయ్య   శ్రీవేంకటేశ్వరుని అన్నమయ్య కీర్తించిన సంకీర్తనాలయంలో, వారి కుమారులు, మనవళ్ళూ ఆ ఆ”లయ” ప్రాకారాలైతే … శ్రీయుతులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గార్లు నాలుగు మూల స్థంభాలుగా భావించవచ్చు. అన్నముని వేవేల స్వరసంకీర్తనాజ్యోతులు అజ్ఞానాంధకారంలో మునిగిఉన్న భక్తులకు సదా ఆధ్యాత్మిక జ్ఞానమార్గాలుగా.. ఉషోదయ కిరణాలుగా.. ఎన్ని తరాలు మారినా … ఎన్ని శతాబ్దాలు గతించినా నిత్య నూతనంగా, మార్గదర్శకంగా, ప్రకాశిస్తూనే  ఉంటాయి. మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన […]

“వరాళి” రాగ లక్షణములు

భారతీప్రకాష్   ఈ రాగం 39.వ. మేళకర్త రాగం. కటపయాది సంఖ్య కోసం ఈ పేరుకు ముందుగా “ఝాల” అని పెట్టారు. ఈ రాగం ఏడవ చక్రమైన “రిషి” లోని మూడవ మేళకర్త రాగం. వివాది మేళ రాగాలలో ఇది ఒకటి. అమూర్చనకారకమేళరాగం. ఆరోహణ:సరిగమపదనిస. సగరిగమపదనిస. అవరోహణ:స. ని ద ప మ గ రి స ఈరాగం లో “స రి గ మ” అనే ప్రయోగం వివాదిత్వం కాబట్టి ” స  గ  రి  […]

రజియా …..      

కె.యన్.మూర్తి అసుర సంధ్య వేళ. అది బీదర్ కోట. విశాల ప్రదేశంలో కోటను  రెండు భాగాలుగా నిర్మించారు. ముందు వైపు కొత్త కోట. దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు. కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు, కూలిన భవనపు శకలాలు…. చెల్లా చెదురుగా పడిఉన్నాయి. కోటను చూసేందుకు అక్కడికి వెళ్ళిన మేము ఆ ప్రాంతమంతా కలియ తిరిగాము. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు మొదలవడంతో చెరసాల […]

ఇలాక్కూడా మనుషులు…!                                     

డా. కోగంటి విజయబాబు అరుణాచలం ఈ వూరు వచ్చి సంవత్సరం దాటింది. ఆర్నెల్ల క్రితం బాంక్ లో రిటైరై ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాడు. రోజూ మేడపైన సాయంత్రంపూట తిరగటం బాగా అలవాటు. ఎదురింటి మేడ పైన రెండు పోర్షన్లు. ఈమధ్యనే వాటిలోకి ఎవరో చేరారు. తప్పకుండా వాటిలో ఒకదానిలో బాంక్ ఉద్యోగులు వస్తూఉంటారు. పరామర్శగా చేయి ఊపుతూ పచార్లు చేస్తూ ఉంటాడు. వారి ఇంటి ఓనరు పేరు విశాల. అరుణాచలం పనిచేసిన బాంక్ లోనే పనిచేస్తోంది. వాళ్ళాయన […]