May 7, 2024

ఆలి కోసం అలికిడి

శ్రీధర మా  వాడు మేధావి  అవునో కాదో  నేను చెప్పలేను కానీ, మేధావికి ఉండాల్సిన అవలక్షణాలు – అదే లెండి లక్షణాలు  పుష్కలంగా ఉన్నాయి. కొంచెం మతిమరుపు, కొంచెం బద్ధకం  కొంచెం నిర్లక్ష్యంలాంటి సద్గుణాలన్నీ ఉన్నసకల కళ్యాణ గుణాభిరాముడు మావాడు. ఇవన్నీ కలిసొచ్చి కళ్యాణానికి ఎప్పటి కప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వేస్తున్నాయి. జీవితం దాదాపు ఇంటర్వెల్  దాకా వచ్చినా పెళ్లి కాకపోవడానికి పైన చెప్పిన లక్షణాలే కారణం. ’నెట్’  లో ఎప్పటికప్పుడు అమ్మాయిలతో చాట్ చేస్తునే ఉన్నాడు. […]

ఎగిసే కెరటం-3       

డా. శ్రీసత్య గౌతమి   [జరిగిన కధ: అతి తెలివైన సింథియా ఏమాత్రం ఆలశ్యం చేయకుండా గిరి గీసి రాకేష్ ను అందులో ఉంచేస్తేనే మంచిది, లేకుంటే మొగుడు అనే డెసిగ్నేషన్ ని పెట్టుకొని చంకనెక్కుతాడని వెంటనే ఊహించి, వంట చెయ్యను పొమ్మంది. కానీ తన లంచ్ లో మిగిలిపోయిన పిజ్జా ముక్కని రాకేష్ కి డిన్నర్ లో ఆఫర్ చేసింది. ఇండియాలో ఈజీ గా చటర్జీ దగ్గిర తనకి నచ్చినట్లుగా ఉద్యోగం చేసుకోగలిగింది, ఆ నైపుణ్యం […]

మాయానగరం 27  

భువనచంద్ర నన్ను నేను పోషించుకోలేని కుచేలుడ్ని. దరిద్రం అనే మొసలి బారిన పడ్డ గజేంద్రుడ్ని. అభిమానాన్ని కాపాడే దుర్యోధనుడి లాంటి స్నేహితుడు దొరకని కర్ణుడ్ని. ఎంత హింసను అనుభవించినా దైవదర్శనం  లభించని భక్తుడ్ని. నన్ను ప్రేమించద్దు. నన్ను గౌరవించనూ వద్దు. కేవలం నన్నో ‘జీవి ‘ లా చూడంది. మనిషిలా చూడకపోయినా ఫర్వాలేదు. “అంటే ఏం చేయమంటారు?” అన్నాడు విసురుగా శామ్యూల్ రెడ్డి. “అయ్యా! మీరో గొప్ప మానవతావాది … ఓ గొప్ప స్కూలు నడుపుతున్నారు. నేను […]

శ్రీకృష్ణదేవరాయ వైభవం           ఎపిసోడ్-2

  రాచవేల్పుల విజయభాస్కరరాజు శ్రీ కృష్ణదేవరాయల వారి జన్మ దిన తేదీలపై, ఆ మహనీయుని వయస్సు పై రక రకాల వాదోప వాదాలున్నాయి. కవులు, రచయితలు ఎవరికి తోచిన విదంగా వారు సదరు తేదీని, వయస్సును నిర్ణయిస్తూ వచ్చారు. వారి వారి వాదనలకు మద్దతుగా ఎన్నెన్నో ఆధారాలను క్రొడీకరించారు. అయితే అవన్నీ నిరాధారాలే. కృష్ణదేవ రాయల వద్ద నున్న అష్టదిగ్గజాల్లో ప్రధాన కవివర్యులైన అల్లసాని పెద్దన గారు ఒకానొక పద్యము ద్వారా శ్రీ కృష్ణ దేవ రాయలు […]

శుద్ధ కవిత్వ భాషలో జరిపిన సుదీర్ఘ సంభాషణ – ఇందిరకవిత్వం

సమీక్ష: రామాచంద్రమౌళి   From the Biography of an Unknown Woman                                        – Indira Babbellapati     కవిత్వం రకరకాలుగా నిర్వచించబడి మనిషి ఆవిర్భావం నుండి ఇప్పటిదాకా ఒక అతీత భావస్పర్శకోసం నిరంతరం అన్వేషిస్తూనే కవిత్వాన్ని కేవలం ఒక అనుభవైకవేద్యమైన రసాత్మక మహానుభూతిగా మాత్రమే స్వీకరిస్తూ రకరకాల రూపాలతో,శైలితో, వ్యక్తీకరణలతో,ప్రతీకలతో,అనేకానేక నైరూప్య మార్మిక అభివ్యక్తులతో కేవలం శరీరంతో మాత్రమే కాక హృదయంతోకూడా జీవించే వ్యక్తులకోసం రసభాషగా కొనసాగుతూ వస్తూనేఉంది యుగయుగాలుగా.దేశాలు,ప్రాంతాలు,నాగరికతలు,భౌగోళిక నేపథ్యాలు..ఇవేవీ కవిత్వ సంగ్రహణా…అనుభవ దాహానికి ఎప్పుడూ అవరోధాలు కాలేదు.ఎక్కడ ఒక వాక్యం రసాత్మకంగా వెలువడ్డా సకల సరిహద్దులనూ చెరిపేస్తూ అక్షరాన్ని కవిత్వం ప్రజ్వరిల్లజేస్తూ కవిత్వ ప్రక్రియను విశ్వజనీనం చేస్తూనే ఉంది.ఆ పరిణామ వికాసాలను మెట్లు మెట్లుగా అధిరోహిస్తూ కవిత్వ సృజన ఆధునికంగా..అత్యాధునికంగా…ఆధునికోత్తర సాహిత్య ఉద్గారతగా తన రూపురేఖలను వికిరణ పరుస్తూ భాసిస్తూ వస్తూనే ఉంది.ఆ క్రమంలో కొన్ని సంక్లిష్టతలు…కొన్ని అనిర్ధుష్టతలు…కొన్ని అస్పష్ట సంలీనతలు…వీటన్నింటినీ ప్రవాహీకరించుకుంటూ చొచ్చుకొస్తూనే ఉంది కవిత్వ సృష్టి.   ఈ ఇరవైయ్యవ శతాబ్దిని దాటుతున్న కాల క్రమంలోప్రసిద్ధుడూ, మనకంటే వరిష్ఠుడూ ఐ న టి ఎస్ ఇలియట్ … తదనంతర ఈనాటి యువ కవిత్వ సృజనకారులు “కవిత్వాన్ని” నిర్వచిస్తున్న తీరును గమనించండి.   T.S. Eliot: “Poetry is not a turning loose of emotion, but an escape from emotion; it is not the expression of personality, but an escape from personality. But, of course, only […]

ఒక్క సారి రారాదా!                                        

వాయుగుండ్ల శశి కళ    ఒక్క సారి రారాదా నీకోసం హృదయం పచ్చని ఆకులుగా మార్చి తోరణాలు కడుతాను ఒక్క క్షణం లో ఎర్రటి జ్వాల ను పూసుకున్న కళ్ళు ఒక ప్రశ్నగా మారి వేలాడుతూ నీరు లేక జనాలు చేసే రణాలు సంగతి ఏమిటి? యుద్దాల మధ్యలో ఎక్కడైనా పచ్చని చిగురు విరబూస్తుందా ?   నా ఉద్వేగాలను రంగరించి షడ్రుచుల పచ్చడిగా చేసి నైవేద్యం చేస్తాను ఒక్క సారి రారాదా ….. వేదనతో మ్లానమైన మొహం తో ఒక్క సారి తిరస్కరింపు తల అటు తిప్పుతూ రోదనలు ఆవేదనలు తప్ప నీ చుట్టూ సమాజం లో ఏ ఉద్వేగము లేదు ఆరు రుచులు ఎక్కడినుండి తెస్తావు దోసెడు నుండి కన్నీళ్లు తప్ప!   ఈ ఏడాది పంచాంగానికి నిన్నే రాజును చేస్తాను కాసిన్ని నీ మెత్తని అడుగులు ఇటు వైపు వేయరాదా ! కోయిల కూజితాల తో స్వాగతం పలుకుతాను   సన్నటి నవ్వు లేత పెదాలపై చిగురాకు ఎరుపులా …. నింగి లోని నెలరాజునే నాలో పొదువుకున్నాను ఈ ఎడారి రాజరికాలతో నాకు పని ఏమిటి ? ఆక్రమించుకున్న పంట భూముల సాక్షిగా కట్టబోయే ఆకాశ హర్మ్యాల సాక్షిగా లేత చివుళ్ళు లేని తెలుగు గడ్డపై కోయిలలు ఎలా తెస్తావు ! ఆకలికి మండిన గుండెల అరుపుల తప్ప పర్లేదు …. నీకు అలవాటేగా ఈ ఉగాదిని కూడా హాలోగ్రామ్స్ గా మార్చి చూసుకో …. తెలుగు ఉగాది ఒక్క సారి రారాదా !

దుర్ముఖీ నీవు సుముఖివే                                         

స్వధ వెలమకన్ని   ఏ ముఖం పెట్టుకోని వస్తున్నావు నీవు? ఓహో మన్మధయేమందంగా వుందని అడుగుతున్నావా? మనసందం లేని మనుషులకి మన్మదైనా, దుర్ముఖైనా ఒకటేనంటావా? దుర్మతులు, నరరూప రాక్షసులు మన్మధలో లేరా, నేనొస్తానంటే వద్దంటావేం వచ్చితీరుతానంటావా? దుర్ముఖీ! నీవెలాగో మా సముఖానికి రానేవచ్చావ్ ఎన్ని ఉగాదులు వచ్చినా మారని దగాకోరులు, కల్తీశాలులు, అవినీతిపరులు, స్త్రీని వేధించే నీచ కీచకులు ఇకనీవంటే హడలి మారాలి లేకుంటే చావాలి, అమ్మా! దుర్ముఖీ మాలో సుహుద్బావాన్ని నింపి మాకు సుఖశాంతులనిచ్చి, అందరికి ఆనందాన్ని పంచి తెరమరుగు కాకుండా “భాషలరాణి తెలుగు సుభాషిణి” అందలమెక్కించి నీవు సుముఖివే అనిపించు మమ్ము అలరించు!

 సాగనంపేస్తా 

యు.ఎల్. ఎన్. సింహా అదిగో నవ ఉగాది వచ్చేస్తుంది ఇక పండగే పండుగ మనకు దినపత్రిక పేజీలలో దినఫలాలుగా దూరదర్శన్లలో దేదీప్యమానంగా ముఖపుస్తకంలో మె(ము)రిసిపోతూ వెబ్ సైటులో వెలిగిపోతోంది…. కవితా పోటీలు…పండుగ సంబరాలు… పంచాంగ శ్రవణాలు, అష్టవధాన కాలక్షేపాలు మనకిక పండుగే పండుగ… ఆనాటి పల్లెలు లేకపోతేనేం.. మావిడితోరణాలు గుమ్మానికి కట్టకపోతేనేం… పసుపుగడపలు కనుమరుగైతేనేం … గుండెల నిండా ఆత్మీయతల్ని… మనసునిండా మమతానురాగాల్ని నింపుకుని… ఓ నలుగురు బంధువులు మన మధ్యకు రాకపోతేనేం… చిచ్చుబుడ్డికి కొత్త చొక్కా తొడిగినట్టు సంతోషాల్ని విరజిమ్ముతూ తిరిగే చిన్నారులు మన మధ్య ఆడకపోతేనేం… పట్టు పరికిణీల్లో చిట్టి తల్లుల్ని చూడకపోతేనేం.. ఆ సంతోషాల వెలుగుల్లో పెద్దల ముచ్చట్లు మెరవకపోతేనేం.. కోయిలమ్మల రాగాలాపనలు వినకుంటేనేం… చిగురించడం మానేసిన చెట్లు… కూలిపోయి పలకరించే గులకరాళ్ళ మొండి గోడలు.. ఇంకా పల్లె వెలుగు బస్సు కోసం ఎదురు చూసే ఆ పెద్దాయన చేతిలోని చుట్ట వాసన… ఇవి తప్ప ఏముంది అక్కడ పండగ… పండుగంటే మనది… పసందంటే మనది…. మనిషితో పనిలేదు…మాటతో పనిలేదు… ఇంటర్నెట్ ముందు ఇకిలించి కూర్చుంటా… ముఖ పుస్తకంలో ఉగాదికి ఊరేగింపు చేస్తుంటా… లైకుల నైవేద్యాలతో.. కామెంట్ల కర్పూరహారతి పట్టిస్తా.. ఉసూరుమంటూ ఉగాదిని మరోమారు ఉత్తచేతులతో  సాగనంపేస్తా… ఓ పిడికెడు కూడ ఆనాటి పల్లె పరిమళాన్ని పెట్టకుండా..!!!

గత సంవత్సర మాతృమూర్తి

 ప్రవీణ్ కుమార్ వేముల నా మనసు సుమబాలను సంపెంగరసితో స్నానం చేయించి ఉరిమిని అరువుతెచ్చి వస్త్రాన్ని కుట్టించి కరుణను నా కంటికి కాటుకజేసి వినయ, విధేయత వజ్రాలతో నా ఆభరణాలను చేయించి తామస సంహారశైలి తిలకంగా దిద్ది మమతలను కరిగించి ముక్కెరగా చేయించి జ్ఞానసంపదను నా జడకుచ్చులుగా వేయించి ఆత్మీయతా స్నేహంలో నా అలంకరణ గావించి ప్రపంచ పూదోటలో నను విహారానికి తీస్కెళ్ళింది… శోకగ్రస్తమైనవేళ చెలిమిని పంచి సంతసంతో చిందులువేస్తే కౌగిలి పంచి ఓటమికి వెరచినవేళ వెన్నుతట్టి ప్రతి […]

ఆమనిలో 

వాణి కొరటమద్ది                                                                                       తరువులన్ని కొత్తచిగురు తొడుగుతాయి ఆమనిలో ప్రతిమదిలొ పులకింతలు రేపుతాయి ఆమనిలో || సుఖ […]