May 9, 2024

ఖరహరప్రియరాగం

రచన: భారతీప్రకాష్ ( డైరెక్టర్, స్వరాలంకృత మ్యూజిక్ స్కూల్) – email : bharatiiyengar@yahoo.co.in             22వ మేళకర్త రాగం. 4వ  చక్రమైన “వేద” లో 4వ రాగం. మూర్చనకారక మేళరాగం.ఈ రాగము యొక్క ’రి’ ని షడ్జమం చేస్తే  హనుమత్తోడి, ’గ’ ని షడ్జమం చేస్తే మేచకల్యాణి, ’మ’ ని షడ్జమం చేస్తే హరికాంభోజి, ’ప’ ని షడ్జమం చేస్తే నటభైరవి, ’ని’ ని షడ్జమం చేస్తే ధీరశంకరాభరణం […]

కృష్ణ మృగం

రచన : శ్రీధర అయల   నీళ్లు నిండిన బిందె అరుగు మీదికి దించి, నెరసిన కబరీ భరం  జారిన  ముడి వేస్తూ, ‘అమ్మయ్య’ అంటూ నిట్టూర్చింది వరలక్ష్మమ్మ.. ‘ ఇక లాభం లేదు, ఈ ౫౨ పావంచాలూ గడచి నాగావళి ఏట్లో  బిందె ముంచి, ఇంటికి తెచ్చే  ఓపిక తనలో  క్షీణించి పోయింది. నిన్న మొన్నటి వరకూ, కొంగు వెనకాలే తిరుగుతూ నోటికీ, చేతికీ ఆసరాగా నిల్చిన ‘విశాలి’ కూడా వెళ్లిపోయింది. అయినా పెళ్లి అయిన […]

సంసారసాగరంలో సుడిగుండం

పెద్దల  ఆశీర్వాదాలతో   పెళ్లి పందిరిలో  ఫెళ్లుమని  కుప్పుస్వామి,   కుప్పుసానమ్మ మెడలో తాళి కట్టేసి అమ్మయ్య నాకు కూడా పెళ్లి అయిపోయింది అని సంతోషించేశాడు. పెళ్లి అయిన నాలుగు రోజుల తరువాత  కుప్పుసానమ్మ సమేతుడై   కుప్పుస్వామి ఉద్యోగం చేసే అస్సాం లోని జోర్హాట్ కి వచ్చేశాడు.  దూరభారం వల్ల ఎవరూ తోడు రాలేదు. కుప్పుసానమ్మ సంగీతం అయితే నేర్చుకుంది కానీ, చదువు స్కూలు దాటలేదు. తెలుగు తప్ప మరో భాష రాదు.  ఇన్స్టిట్యూట్ లో మూడు  తెలుగు కుటుంబాలు […]

పంచామృతాలు-2

ఆచార్య అనుమాండ్ల భూమయ్య ( వైస్ ఛాన్సలర్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)   దేవి! నీ పాదరజమింత తీసి, నా నుదుట తిలకముగ దిద్దగా తోచె కవిత యను మరాళమొకటి ..న్ ఈ వదన విశాల గగన మందున తెల్ల రెక్కలను విప్పి   దేవి! నేడు నీదు దివ్యమౌశ్రీపాద ములను నాయెడందమోపినంత కవిత  జాలువారి కడిగె నీ పాదాలు నిట్లు కుదిరె బంధమిద్దరికిని   దేవి! నీ దరహాస చంద్రికలు కురిసి తడిసి ఎంత మెత్తగ […]

పూలగుత్తులు-2

పోగుల విజయశ్రీ   హృదయం నిండా పూలగుత్తులు పరిమళాలు తుపాన్లు తీరాచూస్తే నానీలు. మా ఊరు ఒక బృందావనం తుపాను వచ్చిందా కడగండ్ల గానం మనిషికేమో కోరికల కుప్ప దేవుడికి మిగిలేది కొబ్బరిచిప్ప. మాటల పదును తూటాల కెక్కడ అందుకె గుండె ముక్కలు… ముక్కలు వెర్రోడా! చెట్టును అమ్ముకున్నావా? నమ్ముకోవాలిగాని రేపటి ప్రాణమిదే! పూలగుత్తులు (నానీలు) కవితామాలిక నుండి)

ఆధునిక మీరా – జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాదేవి వర్మ

రచన: ఎ.జె. సావిత్రీమౌళి అభివ్యక్తీకరణ కాంక్ష మానవుని సహజ ప్రవృత్తి. మానవుడు తన హృదయంలోని భావాలు, సుఖ దుఃఖాలు మొదలయిన జీవితపు వివిధ చిత్రాలను అభివ్యక్తంచేసి, ప్రపంచ అనుగ్రహాన్ని అభిలషిస్తాడు. తద్వారా ధన్యులౌతారు. ఈ భావన సనాతనమైనది. అన్య భాషలలో వలెనే ఆధునిక హిందీ సాహిత్యంలో కూడా కమనీయమైన కల్పనలతో కావ్యాలందించిన మహానుభావులు అసంఖ్యాకులు. వారిలో శ్రీమతి మహాదేవి వర్మ హిందీ కావ్యాకాశపు మహోజ్వల తారికగా పరిగణింపబడెదరు. ఆమెనెరుగనివారు హిందీ సాహిత్యమందేకాక, అన్య భాషాకోవిదులలో కూడా లేరు. […]

నీ”వై” నా “వై”

వై. శ్రీరాములు ఏదైనా కానీ, ఏమైనా కానీ మరణం దాకా ప్రేమించడమే జీవితానికి అర్ధం ప్రేమ తోడుంటే తుఫానులైనా లోకం ఏమనుకున్నా ప్రేమే, ప్రేమే పరమార్ధం. ప్రేమించడమంటే అంత సులభం కాదు! నిన్ను నువ్వు అర్పించుకోనిదే అది అర్ధం కాదు ప్రతి క్షణం హృదయాన్ని వెలిగించే వుండాలి ! వేరే ఆలోచనకు తావే లేదు. అటు అలజడి, ఇటు అలజడి ఎటు అడిగిడితే అటు గుండె సడి తణువు అణువణువు భావాల పూల పుప్పొడి మనువులో వెన్నెల […]

మేల్ అబార్షన్

మేల్ అబార్షన్ – పురుషుడికి తండ్రి అవ్వాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం..!! మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించండి. ఒక స్త్రీ, తనకు ఇష్టము లేక పోయినా గర్భాన్ని ధరించవలసి వచ్చింది. బహుశా ఆమె ఇప్పుడే పిల్లలు వద్దు అని అనుకొని ఉండొచ్చు. దానికి ఆమె కారణాలు ఆమెకుండొచ్చు. దురదృష్టవశాత్తూ ..ఆమె ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి, బిడ్డకు జన్మ నివ్వడం తప్ప వేరే మార్గం లేదనుకుందాం. మరొక సందర్భాన్ని తీసుకుంటే, స్త్రీ […]

సెంటిమెంటల్ రేజర్

( రచన: డి.వి.హనుమంతరావు.) ’అయ్యో! అయ్యో!…” అంటూ పెరట్లోంచి మా ఆవిడ గావుకేక పెట్టింది…నా కంగారులో చివరి మాటలు సరిగా వినపడలేదు. పెరట్లోకి పరిగెత్తాను.. “ఏమిటి? ఎక్కడ? పాము కుట్టిందా, తేలు కరిచిందా”  పెళ్ళికానుక  సినీమాలో రేలంగిలా అడిగా! “అదికాదండీ–మా అన్నయ్య రేజర్ మరచిపోయాడండీ” “ఓస్! ఇంతేనా? చంపావు కదే!”. “ఇంతేనా అంటూ అలా తీసిపారేస్తారేమిటండీ..అది మా తాత గారి టైములో రేజరండీ… అన్నయ్య గెడ్డం గీసుకోవడానికి ముందు…గెడ్డం గీసుకున్నాకా కూడా  నాన్నగార్నీ, మా తాతగార్నీ తలచుకుని […]

ఇంటి భాషంటే ఎంత చులకనో!

  భాషను కేవలం కొన్ని కులాల వాళ్ళే పుట్టించారు. వివిధ కులాల వాళ్ళు వాళ్ల వృత్తుల్ని బట్టి, అవసరాలను బట్టి పదాలను పుట్టిస్తూ, వాడుతూ ఉండటం వల్ల ఆ భాష అభివృద్ధి చెందుతుంది. అన్ని పదాలూ మా గ్రంథాల్లోనే ఉన్నాయనే అహంకారం పనికిరాదు. అన్ని కులాల వాళ్ల భాషనూ, వాళ్ళు వాడే పదాల్నీ నిజాయితీగల భాషా శాస్త్రజ్ఞుడు గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, గ్రంథస్తం చేస్తాడు. కొన్ని కులాల వాళ్ళ భాషనూ, వాళ్ళువాడే పదాలను అపహాస్యం చేస్తూ, నీచంగా భావిస్తూ, […]