May 10, 2024

అగ్గ్గిపెట్టెలో ఆరు గజాలు – సమీక్ష

రచన: – బి.ఎస్‌.రాములు, సామాజిక తత్త్వవేత్త వేల ఏళ్ల చేనేత పరిశ్రమ, జీవిత పరిణామాలను ‘అగ్గి పెట్టెలో ఆరుగజాలు’లో ఇమిడ్చిన మంథా భానుమతి     ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి గారు రాసిన ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’ నవల కేవలం నవల మాత్రమే కాదు. ఒక పరిశోధనాత్మక రచన. ఒక పిహెచ్‌.డి.కి తక్కువ కాకుండ దేశ వ్యాప్తంగా చేనేత రంగంలో, వస్త్ర పరిశ్రమలో, నేతపై ఆధారపడి జీవిస్తూ వచ్చిన మానవుల జీవితాల్లో, సంస్కృతిలో వచ్చిన అభివృద్ధి, వికాసం, […]

నీలి చందమామ

సమీక్ష: సుజల గంటి ప్రముఖ రచయిత్రి తమిరిశ జానకి గారి నవల “నీలి చందమామ” అన్న నవలను పాఠకులకు పరిచయం చేయదల్చుకున్నాను. నవలలో పాత్రల పేర్లు పెట్టడంలో కూడా నూతనత్వం కనబడింది నాకు. ఆవిడ కవియిత్రి కూడా కావడంతో ఈ నవల లో మనం కవిత్వాన్ని కూడా దర్శించగలం. ఇది డిటెక్టివ నవల కాదు. కానీ చక్కని సస్పెన్స్ తో కధను ముందుకు నడిపించారు. తరువాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠత పాఠకులకు కలుగుతుంది. యజ్ఞపతి రేష్మాల కుమార్తె […]

!! నిప్పులను వెదజల్లే అక్షరాల లిపి !!

సమీక్ష: పుష్యమీ సాగర్ మంత్ర లిపి కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత వెలుగు చూసిన అక్షరాలు. చీకటి రాజ్యం పై దండెత్తిన కరవాలం. నిజం నిప్పు అయితే దాన్ని పట్టి చూపించే దమ్మున్న అక్షరాల సుమం ఈ మంత్రం లిపి. కొనకంచి లక్ష్మి నరసింహ గారు మంచి కధకులు, నవలాకారులే కాదు మంచి కవి కూడా. మొత్తం 54 కవితలలో తర తరాలు గా సాగుతున్న మానసిక బానిసత్వపు సంకెళ్ళని, పుచ్చిపోయిన రాజకీయ వ్యవస్థ ని కడిగిపడేసే […]

జీవితపు మలి దశ వాస్తవాలు-పరిశీలన !!

సమీక్ష: పుష్యమి సాగర్ జీవితంలో మూడు దశలు ఉంటాయి బాల్యం, యవ్వనం, వృధ్యాప్యం. బాల్యం నుంచి యవ్వనం దాక పరిగెత్తిన మనిషి వృధ్యాప్యం వచ్చేసరికి డీలా పడతాడు. ఎంతటి గొప్ప వాడయినా వార్ధక్యం బారిన పడవలసిందే. సమస్యలు కేవలం మొదటి రెండు దశల్లో నే నా …. చివరి దశ అయిన వృధ్యాప్యం లో కూడా వచ్చే సమస్యలని చర్చించే పుస్తకం “ఈ వార్ధక్యం వరమా ? శాపమా ?”. ఈ పుస్తక రచయిత్రిగారు వృధ్యాప్యం అంశం […]

Rj వంశీతో అనగా అనగా…

అనగా అనగా అంటూ సంవత్సరంనుండి మంచి హారర్,సస్పెన్స్ కథలు ఎంతో ఆసక్తిగా కథలు చెప్తున్నారు.. ప్రతీ నెల ఏ టాపిక్ తీసుకోావాలా, మాట్లాడాలా అని తలపట్టుకుని, కొట్టుకుని మరీ ఆఖరి రోజుల్లో కథను పంపిస్తున్నారు. మరి ఈసారి ఏం కథ చెప్తున్నారో తెలుసా??? గాగుల్స్ అదేనండి నల్ల కళ్లద్దాలు. వీటితో ఏం కథ ఉంటుందబ్బా అనుకుంటున్నారా.. విందాం మరి.. గాగుల్స్ మీద క్లిక్కండి..    

రీతిగౌళ రాగ లక్షణములు

రచన:భారతీ ప్రకాష్ రీతిగౌళ రాగం 22.వ. మేళకర్త రాగమైన, ఖరహరప్రియ రాగం నుండి పుట్టింది. మూర్చన : స గ రి గ మ ని ద మ ని ని స. స. ని ద మ గ మ ప మ గ రి స షడ్జమ, పంచమాలతో కలిపి ఈ రాగంలోని స్వరాలు : చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం మరియు కైశికి నిషాదం. చాలా అరుదుగా శుద్ధ దైవతం […]

శంకరాభరణం:

రచన: వైశాలి పేరి ధీర శంకరాభరణం రాగాన్నే వాడుకలో శంకరాభరణం అని అందురు. ఇది 29 వ మేళకర్త రాగము. ఆరోహణ : : S R2 G3 M1 P D2 N3 S అవరోహణ : S N3 D2 P M1 G3 R2 S సంగీతరత్నాకరంలో పేర్కొన్న ఎంతో ప్రాచీనమైన ఈ సంపూర్ణ జనకరాగం ఐదవ బాణ చక్రంలో ఐదవ రాగం. చతుర్దండి ప్రకాశిక ఈ రాగాన్ని ‘రాగ రాజస్య మేళకః’ […]

పొగ చూరిన ప్రశ్న

అనువాదం: వాయుగుండ్ల శశి కళ కవయిత్రి మ్రిలిన్ నరోహా (Mrilyn Naroha) ఇప్పటి కాలానికి చెందిన వారు, ముంబాయి వాస్తవ్యులు. వారు ఆంగ్లంలో వ్రాసుకున్న నాకు ఎంతో నచ్చిన కవితలను నేను తెలుగులోకి అనువదించాను. టీచర్ గా పనిచేస్తూ ఈవిడ కవితలే కాకుండా ఎన్నో కధలు, నవలారచనలను కూడా చేస్తారు. నాకు నచ్చిన ఆవిడ నవల డిఫరెంట్ ఫేసెస్. ఈవిడ కవితల్ని ఒకసారి పరిశీలిస్తే దీనిలో పదాలతో కలిసి నడిచే స్త్రీ అంతరిక ఘర్షణ గంబీరంగా నదిలా […]

బాధ్యత

రచన: వై.యస్.ఆర్. లక్ష్మి “శనక్కాయల్…………వేరుశనక్కాయల్………వేవేడి కాయల్”అరుచుకుంటూ వెళుతున్నాడు ఒక 12, 13 ఏళ్ళ కుర్రాడు. ఇంట్లో ఖాళీగా ఉండటంతో రోజూ సాయంత్రం పార్కుకు రావడం అలవాటైంది. ఆ పార్కు రెండు కాలనీల మధ్య ఉండటంతో రెండు కాలనీల్లోని పిల్లలు, పెద్దలు అక్కడకు వస్తుంటారు. ఎందుకో మొదటి రోజు నుంచి అతని ఉత్సాహం, అరుపులు ఆకర్షణగా అనిపించాయి. చాలా రోజుల్నించి చూస్తున్నాను ఎవరు పిలిచినా దగ్గరకు వెళ్ళి కబుర్లు చెప్పి కాయలు అమ్మేస్తాడు. రెండు గంటల్లో బుట్ట ఖాళీ […]