May 3, 2024

అమ్మమ్మ – 45

రచన: గిరిజ పీసపాటి రాత్రి షాప్ నుండి ఉత్సాహంగా ఇంటికి వచ్చిన గిరిజ, తనకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులందరికీ షాప్ సంగతులన్నీ పూసగుచ్చినట్లు వివరించి “అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే, ఇదివరకు బిల్స్ రాసే ఆవిడ తిరిగి వచ్చేవరకే నాకీ ఉద్యోగం ఉంటుంది.” “ఆవిడ తమిళియన్ కావడంతో మద్రాస్ (ఇప్పుడు చెన్నై) వెళ్ళిందట. రెండు మూడు నెలల్లో ఆవిడ వచ్చేస్తుంది. తరువాత మళ్ళీ ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి” అంది కొంచెం దిగులుగా. “ఏం పరవాలేదు గిరీ! […]

ఏది శాశ్వతం?

రచన : తాతా కామేశ్వరి శారద తన ఇంట్లో బీరువాలు, షోకేసులలో ఉన్న వస్తువులను రెండు చేతులతో పట్టుకొని విరక్తిగా వాటికి తనకి ఉన్న బంధం తీరిపోయింది అని మనసులో అనుకుంటు వాటిని అటు ఇటు తిప్పి చూసి మళ్ళీ చక్కగా తీసిన చోటే పెట్టసాగింది. ఆమెను చూస్తే ఆమె మనసులో ఎంత విరక్తి చెంది ఉందో అర్థం అవుతుంది. అవి ఆమెకి చాలా ఇష్టమైన వస్తువులు అయినా కూడా ఆమెకు ఇపుడు వాటి మీద ఏ […]

గోపమ్మ కథ – 7

రచన: గిరిజారాణి కలవల లక్ష్మి, కోటి కాపురం … ఇక వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మూడు పురుడులు పోసి … తన బాధ్యత తీర్చుకుంది గోపమ్మ. మరో పక్క… కొడుకు పిల్లలు పెద్దవుతున్నారు. కొడుకు, కోడలు, మనవలు అంటూ మళ్ళీ మొదలెట్టింది. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. ‘పెళ్ళి చేసావు. వాడికీ పెళ్ళాం, పిల్లల బాధ్యతలు తెలియనియ్యి. తల్లి కోడిలాగా, నీ రెక్కల కిందే ఎన్నాళ్ళు చేస్తావు? నీకూ రెక్కల శ్రమ ఎక్కువ అవుతుంది.’ వింటే కదూ! […]

పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

రచన: డా. వివేకానందమూర్తి రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను హైదరాబాదులో […]

వెంటాడే కథ – 17

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

విరించినై విరచించితిని – అడివి గీత

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి ఢిల్లీ వారిని ఆకట్టుకున్న తెలుగు కళాకారిణి గీతారావ్ కొందరిలో సహజంగా లలితకళలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పాట ఎవరు నేర్పారు? ఈ నటనకి మార్గదర్శకులెవరు? ఈ కవిత ఎవరు రాయించారు అని ఆశ్చర్యపోనక్కరలేదు. గాలికి కదలిక ఎంత సహజమో, వెన్నెలకి చల్లదనం ఎంత సహజమో, అంత సహజంగా వారిలో కళాప్రతిభ బయటపడుతుంది. అలాంటి వ్యక్తుల కోవకు చెందిన ధీరవనిత అడివి గీత. నేనూ, శ్రీలక్ష్మీ గీత వాళ్ళ గుమ్మంలోకి అడుగుపెట్టగానే ‘రండి, రండి’ […]

నేటి కవులకు ‘దివిజ’ రచనా దిశ

రచన: డా. ర్యాలి శ్రీనివాసు మనిషి భావ పరిమళాన్ని అద్దుకొని కవిత్వమై వికసిస్తాడు. సాహితీ కీర్తి బిరుదు పొందిన శ్రీ చాగంటి సుబ్రమణ్యం గారి ‘దివిజ’ కవితా సంకలనం పరికిస్తే భావ పరిమళాల అస్వాదన తెలుస్తుంది. కవిత్వ రచనలో శబ్దం యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తే మనకు కొన్ని కొత్త విషయాలు అవగాహనకు వస్తాయి అరవయ్యో వడిలో బడిన ఆయన తన 40 సంవత్సరాల రచనా వ్యాసంగ పరిపుష్టికి దివిజ తార్కాణంగా చెప్పవచ్చు. కవిత్వం అంటే గ్రాంథిక […]

అందాల రంగుల హరివిల్లు

రచన: లక్ష్మీ ఏలూరి అందాలండీ…!! ఆనంద రాగ రంజిత వర్ణాలు, పాపాయి పుట్టిన రోజు చైత్ర మాస ఫుష్పరాగం, ఆమె బుడి బుడి నడకల చిరు మువ్వలసడి, వైశాఖ మాస కళ్యాణ పసుపు కుంకుమ శోభ. ఆ బంగారు తల్లి మాట మాఘమాస మల్లెసుమం, ఆ అందాల సుందరి నవ్వులు కోకిలమ్మ కూజితాలు, పాపాయి ఆకుపచ్చ పట్టుపావడ లో శ్రావణలక్ష్మి శోభ, యుక్తవయస్సులో ఆశ్వయుజ మాస నవరాత్రి శోభ, నవవధువుగా కార్తీక మాస దీప లక్ష్మీ శోభ, […]

ఊహల హరివిల్లు

రచన: అనుపమ పిల్లారిసెట్టి మనస్సు ఉప్పొంగింది… గుండెల్లో గుబాళింపు చెలరేగింది. కళ్ళల్లో చిలిపితనం తొంగి చూసింది, కొంటె పనులు చేసి కవ్వించమంది. యవ్వనం పంచ వన్నెల చిలుకయ్యింది… పమిట ఎదపై నిలవనంటున్నది. పెదవులు పదే పదే నీ పేరే పలుకుతున్నవి, గొంతులో కోయిల కుహూ కుహూ అంటున్నది. నాగులాంటి వాలుజడ నడుమును చుట్టింది. చేతి వేళ్ళు ముద్రలు వేస్తుంటే, పాదాలు చేశాయి చిరు మువ్వల సవ్వడి. పంచ భూతాల సాక్షిగా హరివిల్లు విరిసింది, ధరిత్రిపై రంగులు మబ్బులై […]