May 9, 2024

ఆయన ఆరామ గోపాలం కాదు 'అమర గోపాలం'

తెలుగు కథాసాహిత్యంలో “భరాగో” గా సుపరిచితుడైన భమిడిపాటి రామగోపాలం మహాప్రస్థానంతో తెలుగు కధా వినీలాకాశం ఒక ధృవతారను కోల్పోయింది. ‘భరాగో’ అంటే ‘భరించలేని గోల’ అని తన మీద తానే వ్యంగ్య బాణాలు విసురుకుని నవ్వించే సహృదయుడాయన. ఆయనతో వున్న వ్యక్తిగత పరిచయం ఆయన వ్యక్తిత్వాన్ని అనేక కోణాల్లోంచి అవలోకించి, అవగాహన చేసుకొనే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కలిగించింది. చిన్నా, పెద్దా అందరికీ ఆయన ఆత్మీయులే. ఆయనతో నా పరిచయం సుమారు దశాబ్దంకంటే తక్కువ కాలమే. 2001 […]

జెర్సీసిటీలో దసరా, దీపావళి

దసరా సమయం వచ్చిందంటే చాలు – జెర్సీ సిటీలోని జర్న స్క్వేర్ ప్రాంతంలో కోలాహలం మొదలవుతుంది. ఇండియన్ స్త్రీట్ గా వ్యవహరింపడే న్యూఆర్క్ ఏవెన్యూ భారతీయులతో కిటకిటలాడుతుంది. అలా మొదలయ్యే హడావిడి దీపావళిదాకా సంబరాలతో, గర్బా డాండియా నృత్యాలతో, వివిధ కళాకారుల ప్రదర్శనలతో కొనసాగుతుంది. వేలకొద్దీ ప్రవాస భారతీయులు పాల్గొనే ఈ దసరా దీపావళి ఉత్సవాలు చూపరులకు నిజంగానే కన్నులపండువుగా ఉంటాయి. 2010 లో జరిగిన ఉత్సవాల టూకీ నివేదికే ఈ వ్యాసం. దసరా దీపావళి రోజుల్లో […]

ఆంధ్రపద్యకవితాసదస్సు-డా.అచార్య ఫణీంద్రగారికి సత్కారం

ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా అష్టాదశ వార్షికోత్సవం డిసెంబరు 26, 2010 నడు అనకాపల్లి పట్తణంలో జరిగింది. శ్రీ కే. కోటారావుగారు అధ్యక్షునిగా, డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావుగారు ప్రధాన కార్యదర్శిగా, సదస్సు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పద్యభాస్కర శ్రీ శ్లిష్ట్లా వేంకటరావుగారు పాల్గొన్న ఈ సభా చలా అహ్లాదంగా, విజ్ఞానదాయకంగా సాగింది. పద్యకళాప్రవీణ డా.ఆచార్య ఫణింద్రగారు (ఉపాధ్యక్షులు, ఆంధ్ర పద్యకవితాసదస్సు) ఆనాటి ప్రధాన వక్తగా “19వ శతాబ్ది పద్యకవిత్వం” అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగం చేశారు. దేనినైతే […]

సహ ధర్మపత్ని సప్తమ “కర్మ…”

ఈ మధ్యన ఒక బ్లాగ్ లో హృదయాన్ని పట్టివేసిన “షట్కర్మయుక్త” అనే కథనాన్ని చదివాక నాకు అత్యంత ఆప్తురాలైన ఒక వ్యక్తి కళ్ళల్లో కొచ్చింది. ఈ షట్కర్మలన్నీ గడిచి చాలాదూరం నడిచొచ్చిన వ్యక్తి.. షష్టిపూర్తి అయి కూడా కొంతకాలమైన వ్యక్తి. ఇప్పుడు ఈ కథనం చదివాక నేను నా మితృరాలిని గురించి తప్పకుండా చెప్పాలనిపించింది. చదువుకుంది . ఉద్యోగం చేసింది. పిల్లల్ని పెంచింది. రెక్కలొచ్చి ఎగిరిపోయినా అప్పుడప్పుడూ వచ్చి అజా పజా అడిగి పోతూనే వున్నారు. నెత్తిమీద […]

చిన్నక్క & పీతాంబరం

ఏంటో ఈ పీతాంబరం ఇంకా రాలేదు ఎప్పుడనగా చెప్పాను “ఎక్కడ హత్యలు, దొంగతనాలు, రక్తపాతాలు జరిగినా కాస్త సృజనాత్మకత జోడించి ఆ వార్తలని తీసుకుని రమ్మన్నా . 24 గంటలు న్యూస్ చూసి , చూసి … రక్తపాతం, నేరాలు , ఘోరాలు లాంటి భయాంక భీభత్స వార్తలు కావాలి .. మరీ చప్పగా ఏంటి అంటున్నాడు బాస్. ప్చ్! జనాలు మోటువారిపోయారు. తలకాయల్ని కూరగాయల్లా నరికేసుకుంటున్నారు, జనాలు వాటికే అలవాటు పడిపోయారు. ఏంటి చిన్నక్కా! అంత […]

మొగుడూపెళ్ళాల పద్యాలు

ఆ.వె. బెడ్డు కాఫి అడిగి బెదరగొట్టగభర్త; ఉరిమి చూచు భార్య ఉష్షుమనుచు; కాఫి ఇవ్వలేని కారణ మేమన; టయము జూడు బాబు! భయము లేద? ఆ.వె.అమ్మ డ్రస్సు వేయి! ఆలస్య మౌనాకు అనుచు యేడ్చు బిడ్డ.. అయ్యొ… వనిత! ఆడు దాని బాధ అరణ్య రోదనే! సర్వ పనులు జేయు సాధ్వి నీవే! ఆ.వె. టిఫిను పెట్టి త్వరగ టీయివ్వు నాకింక. గోల జేయు బాసు ఈల వేసి బాక్సు ఏది? కాళ్ళ సాక్సు లేవి? వెదికి […]

పూలగుత్తులు-1

హలో దెబ్బకు ఉత్తరం చచ్చింది ఆత్మీయతా! నువ్వెక్కడున్నావ్? చుక్కలు పగలు కూడ ఉంటాయి చీకటి దయవల్ల రాత్రి కనపడతాయి. అమ్మకూడా చీపురులాంటిదే అవసరం తీరగానే వారి స్థానం మూలనే. వస్త్రాలు నేసే నేతన్నకు మిగిలేది వేమన్న రూపమేనా? వృద్ధాశ్రమానికి దానిమిస్తున్నాం డబ్బులు కాదు కన్నవారిని..

ఆంధ్ర భారత భారతి – కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం

రాజకులైక భూషణుడు, రాజమనోహరు, డన్య రాజ తే జో జయ శాలి శౌర్యుడు, విశుద్ధ యశశ్శరదిందు చంద్రికా రాజిత సర్వ లోకు, డపరాజిత భూరి భుజా కృపాణ ధా రాజల శాంత శాత్రవ పరాగుడు, రాజ మహేంద్రు డున్నతిన్! సుందరానుప్రాసతో, సుమధుర సంస్కృత సమాసాలతో శోభిల్లిన ఈ పద్యం ఆదికవి నన్నయ భట్టారక ప్రణీతమైన శ్రీమదాంధ్రమహాభారత మహాకావ్యంలో ప్రథమాశ్వాసంలోని అవతారికలోనిది. తనకు ఆశ్రయమిచ్చి మహా భారత మహేతిహాస నిర్మాణానికి ప్రేరేపించిన మహనీయుడు, మహారాజు రాజరాజ నరేంద్రుని ప్రస్తుతించడం […]

మహారాజ్ఞి మండోదరి

శ్రీరామ చంద్రుడు సద్ధర్మ ప్రతిష్ఠ చేసి శిష్ట రక్షణ చేయడానికి దుష్టశిక్షణ చేయడానికి పుట్టినాడని, మానవ మాత్రుడు గాడని గోపీనాథ రామాయణంలో అటనట చెప్పబడిన విషయమే. శ్రీరాముని ఔన్నత్యాన్ని, ధర్మ స్వరూపాన్ని కూడ చాల సందర్భాలలో పాత్రల ముఖతః వినిపింపచేసాడు కవి. అలాంటి కొన్ని పాత్రలలో రాక్షస స్త్రీలూ వున్నారు. ప్రతినాయకుడైన రావణాసురుని పట్టమహిషి మండోదరి కూడ ప్రథమంగా చెప్పదగినది. ఎందరో రఘురామచరిత్ర కల్లగాదు, కల్పితం కాదు అని అంగీకరించారు. “మానవులకు గల దురంత చింతనాల వల్ల […]

పంచామృతాలు-1

దేవి! నీ దర్శనములేని దినమున నొక కవిత రాదు, వచ్చినదేని కలుగదందు ప్రాణమొక్కింత, తెలిసెను ప్రాణమీవె నాకు, డెందము నలరించు నా కవితకు. దేవి! నీవుగాక మరొక్క దేవుడు కల డటె భువనమందు? ఒకడెవడైన నుండె నేని, అతడు, నీ శక్తినే ఒకించు కంత పొందియెకద అట్టలరుచుండె. తల్లితండ్రులు లేని ఈ తనయుని కొక ముద్దులేదు లేదొక్కింత మురిపెమైన అనుచు జాలితో దేవి! నన్ననునయింప తల్లివై ఇంటిలోనికి తరలి రావా! దేవి! బిసతంతువు వలెనె నీవు సన్న […]