April 26, 2024

సాహిత్యంలో “అమ్మ”

రచన-డా. వి. సీతాలక్ష్మి “ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా సహస్రంతు పితౄన్మాతా గౌరవేణాతి రిచ్యతే” -మనుస్మృతి “మాత జాతినే నిర్మించే నిర్మాత” గా మనవాళ్ళు గుర్తించారు. మన సంస్కృతి మాతృత్వ పరిమళంతో నిండి ఉంది. అమ్మతో సరిపడే బంధువు ఈ ప్రపంచంలో మరొకళ్ళుండరు. తల్లి ఒక పౌరుని ఉత్పత్తి చేసి సమాజానికి అందిస్తుంది. అతని/ఆమె పెంపకం, వ్యక్తిత్వం సమాజం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మాతృత్వం వ్యక్తిగతమైనప్పటికి అది సామాజిక బాధ్యతగా ప్రతి తల్లి గుర్తించాలి. […]

ఏదో ఒకరోజు నేను సన్యసిస్తా!

రచన: టి.వి.ఎస్.శాస్త్రి నాకు ఈ మధ్య ఒక కోరిక కలిగింది. మీరు నవ్వుకున్నాసరే! ఆ కోరిక చెప్పితీరుతాను. అది ఏమిటంటే ‘సన్యసించాలని’! ఆధ్యాత్మిక వాసనలు ఎక్కువై సన్యసించాలనుకోవటంలేదు. ప్రాపంచిక సుఖాలమీద మోజు ఎక్కువై సన్యసించాలనుకుంటున్నాను. అబ్బురపడకండి!అటువంటి కోరిక కలగటానికి కారణం, ఈనాటి కొంతమంది ‘సన్యాసుల’ జీవితాలను గురించిన విశేషాలు విన్న తరువాత నాకు మాత్రం అనిపిస్తుంది– బ్రతికితే సన్యాసిగానే బ్రతకాలని!ఈ మధ్య ఒక సన్యాసి కాని సన్యాసి 5 కోట్ల రూపాయల జరిమానాను 3 వారాల్లో కడతానన్నాడు […]

భగవద్గీత మనకు నేర్పే పాఠాలు

రచన:అంబడిపూడి శ్యామసుందరరావు సనాతన ధర్మము ప్రకారము భగవద్గీతలోని అంశాలు విశ్వానికి , అన్ని కాలాలకు సంభందించినవి. పంచమ వేదముగా పరిగణించబడే ద్వాపరయుగము నాటి మహాభారతములో భగవత్ గీతను సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్దములో అర్జునుడు తన” సన్నిహితులను బంధు జనాన్నిచంపాలా నేను యుద్దము చేయను”అని అన్నప్పుడు “చంపేదెవరు చచ్చేదెవరు”అని శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునిడిని యుద్దానికి సన్నద్దము చేయటానికి గీతోపదేశము భోదిస్తాడు. పేరుకు ఈ గీతోపదేశము అర్జునిడికి చేసిన గీతా సారాంశము యావత్తు మానావాళికి […]

వలస

రచన- గంటి సుజల (అనురాధ) “మా అబ్బాయి అమెరికా వెడుతున్నాడు వదినా” అన్న మాటలు చెవిన పడ్డాయి. నా చిన్నప్పటినించీ ఈ మాట వింటున్నాను. అమెరికా ఏదో భూతల స్వర్గం అని అందరూ అక్కడికే పారిపోతున్నారు.మనిషి వలస వెళ్ళడం అన్నది అనాది నించీ వస్తోంది. ఇందులో కొత్త దనం ఏమీ లేదు.తన ఉన్నతి, స్వార్ధం కూడా మనిషికి అవసరమే.ప్రతిభ ఉన్నవాడు తన ప్రతిభకు గుర్తింపు కోసం వెడితే వెళ్ళిన వాళ్ళు బావుకున్నది తాము కూడా పొందాలని కొంత […]

స్నేహధర్మము

రచన-బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ఆటపాటల్లో స్నేహాలు వేరు. వయసు పెరిగాక, వ్యక్తిత్వం ఏర్పడినాక స్నేహాలు వేరు. బాల్యంలో, మంచి చెడు తెలియని కాలంలో ఆటల మాటల పాటల తోడుగా వచ్చే స్నేహంలో బాధ్యత ఉండదు. బంధం మాత్రమే ఉంటుంది. కానీ విచక్షణా జ్ఞానం తెలిసిన తర్వాత ప్రతి బంధంలోనూ, ప్రతి కర్తవ్యంలోనూ ఒక బాధ్యత ఏర్పడినట్టే, స్నేహబంధంలో కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది. స్నేహ ధర్మమంటే అదే. అంతే కానీ స్నేహితులు చేసిన ప్రతి పనీ, వ్రాసిన […]

పిచ్చుకల్లేని ఇల్లు

రచన: గవిడి శ్రీనివాస్ ఇంటిలో వరికంకులు దూలానికి రెక్కలు చాచుకు వేలాడినపుడు చెంగు చెంగున ఎగురుతూ తేలివచ్చిన పిచ్చుకలు మనసు లోయల్లో ఊయలలూగేవి . వరిచేను కోసిన దగ్గరనుంచీ కుప్పలు నూర్చే వరకూ కదులుతున్న నేస్తాలుగా ఉండేవి . పిచ్చుకలల్లిన గూళ్ళు ఇప్పటికీ మనసు పొరల్లో జ్ఞాపకాల ఊటలు గా సంచరిస్తూనే వున్నాయి . పిచ్చుకల కిచకిచలు ఇంటిలో మర్మోగుతుంటే ఆప్యాయతలు బంధువల్లే నడిచొచ్చినట్టు గుండె లోతుల్లోంచి అభిమానం తీగలై లాగుతున్నట్లు తెలియని పరవశం పరిచయమయ్యేది . […]

మట్టైనా..మనిషైనా..

రచన: అశోక్ అవారి ఇనుప నాగళ్ళేసి ఇష్టంగా భూమి దున్నినప్పుడు మట్టి రేణువులన్నీ.. ఎగుడు దిగుడుగా చిన్నచిన్న పెళ్లలుగా మరిన్ని మట్టి బెడ్డలుగా మాధుర్య మట్టి పరిమళాన్ని.. పుప్పొడిలా వెదజల్లుతూ. నీరుపారితే కుంగుతూ చదునవుతుంటుంది విత్తు విత్తితే చిగురు మొలకై మొలుస్తుంది పాడి పంటై కర్షకుల పాలిట వరమవుతుంది ఫలితం అందాలంటే పనిచేయాల్సిందే మిత్రమా ! మొక్క చెట్టై నిలిచేదీ.. వేరు బలంగా దిగినప్పుడే కదా ! గోడలు మేడలయ్యేదీ.. పునాది దృఢమై నిలిచినప్పుడే కదా! స్వేదం […]

“వసంతం మన చేతిలోనే”

రచన -ధనలక్ష్మి సైదు   బ్రతుకంటే శాంతి కాదు పోరు అంతకన్నా కాదు.. బ్రతికి చూపించటమే బ్రతుకు .. అర్దంకాని ఎన్నిటి కలయికో బ్రతుకు .. ఆయుధాలుంటే మనుగడ సాద్యమే.. అలాగని ఆటవిక కాలానికి పోలేము .. సమాజానికి బలి కాకుండ బ్రతకాలి దైర్యాన్ని కూడుకుంటే బ్రతకగలవు    మట్టిలో కలిసే ఆలోచన వద్దు మట్టితొ కలిసి బ్రతికే ఆలోచన చెయ్యి . గమనించు అతిచిన్నమట్టిపురుగుకూడ మట్టితొ చేస్తున్న బ్రతుకుపోరు చూడు నీపట్ల నిజాయితీగ అంచనా వేసుకో .. పొయినదేదొ పొందబోయెదేదొ్ తెల్సుకో.. బ్రతకటానికో అవకాశం కనిపిస్తుంది గుర్తించు స్వీకరించు మళ్ళీ మొదలెట్టు .. జీవితం ఎలాగున్నా జీవించాల్సిందే … జీవించి చూపించాల్సిందే .. […]

విజేత 

రచన-నాగజ్యోతీ సుసర్ల వేకువెదురు చూసేనా వెలుగిచ్చే సూర్యుని కోసం తారలెదురు చూసేనా నిశి తెచ్చే చీకటి కోసం . ఆకురాల్చు శిశిరానికీ తరువులన్నిజడిసేనా? ప్రతి ఋతువూ వసంతమవగా ప్రకృతికాంత పరితపించునా? కొండ కొనకు కంటగింపనీ ఏరు పరుగు నాపేనా?  జలపాతమ్మై దూకీ తన ఉనికిని చాటుతుందిగా  . నలకనైనా, చినుకునైనా ఒడిసిపట్టి ముత్యపు చిప్ప  ముత్యమల్లె మార్చి జగతికీ మంచి బహుమానమివ్వదా? అవకాశము చిన్నదె అయినా అందుకునే రీతిని తెలిపీ అందలముగ మార్చుకొమ్మనీ చక్కని సందేశమిచ్చుగా…… . […]

గమ్యం

రచన-కృష్ణ మణి నాదే కులమని అడిగాడో మిత్రుడు  నాదే కులమైతే నీకేంటి ఏ మతమైతే ఎవరికేంటి ఎవరెటు పొతే నాకేంటని అరిచాను ! మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది  తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి     ఏడవడమే మిగిలింది ఎందుకేడవాలో అర్ధం కావట్లేదు ఈ కసాయిల వనంలో ! నీవు పలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని  పలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే ఈ భూమి మీద పుట్టేటప్పుడు మా అమ్మను అడగాలా తనదే కులమని మా నాన్నను అడగాలా […]