April 27, 2024

మాయానగరం-24

“కిషన్ నువ్వివ్వాళ నాతో కూర్చోవాలి” అధికారం ధ్వనించే గోముతో అంది సుందరీబాయ్. “దేనికి?” సావధానంగానే అడిగాడు కిషన్ చంద్ జరీవాల. “తాగాలి” సూటిగా అతని వంకే చూస్తూ అంది. “ఆర్డరా?” నవ్వాడు కిషన్ చంద్. సైలెంట్ అయ్యింది సుందరి ఓ క్షణం. కారణం అదివరకట్లో మహోత్సాహంజేసేవాడు. “ఆర్డర్ అయితే ‘నో ‘.. ప్రెండ్లీ గా అయితే ఓ.కే. ” స్పష్టంగా అన్నాడు కిషన్ చంద్. “ఆర్డరే” కళ్ళలో నిప్పులు కురిపిస్తూ అన్నది సుందరి. “అయితే నో!” లేచి వెళ్ళబోయాడు కిషన్. “యూ…. ” ఏదో […]

జీవితం ఇలా కూడా ఉంటుందా?? 4

  రచన: అంగులూరి అంజనీదేవి   నరేంద్ర తల్లివైపు చూడకుండా ఎటో చూస్తూ ”అత్తా, కోడలూ పులి మేకలా వుండాలంటే ఒకే ఇంో్ల వీలుకాదు. సింప్టంస్ లేనిచోట ఏ అనుబంధం నిలవదు. అనుబంధం లేనిచోట మనుషులు మనుషుల్లా ప్రవర్తించలేరు. ఎప్పుడు చూసినా మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్లే వుంటారు. ఇక జీవించేదెప్పుడు? జీవించటం చేతకానప్పుడు ఎవరు గీసుకున్న గిరిలో వాళ్లుండటమే మంచిది. నా నిర్ణయానికి మీరు అడ్డురావద్దు. నేను కూడా మీకు అడ్డుగా వుండదలచుకోలేదు” అన్నాడు. […]

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

రచన: లక్ష్మీదేవి తరచుగా మన సామెతల్లోనూ, పద్యాల్లోనూ మన అలవాట్లు, ఆచారాలు, ఆహారాలు నిక్షిప్తం చేయబడడం మనం గమనిస్తూనే ఉంటాం. నానాటికీ మారే నాగరికతతో పాటు మన అలవాట్లూ, ఆహారవ్యవహారాలు మారడం చాలా సహజమైన విషయం. తనతోటి మానవులతో కలిసి మెలిగే మనస్తత్వం ఉన్న మానవులు తను వెళ్ళగలిగే అన్ని ప్రదేశాలకూ ప్రయాణం చేస్తుంటారు. కొండొకచో శాశ్వతంగానూ పుట్టిపెరిగిన ఊరిని వదలి తనకు నచ్చినచోట, అనుకూలం ఉన్న చోట నివాసముండడం మనుష్యులకే కాదు, ప్రాణిమాత్రులకందరికీ సహజమైన విషయమే. […]

అభాగ్యపు బాలల జీవితాలు

రచన : ప్రియ నాయుడు దుర్భర దారిద్రము మిగిల్చిన అనాధ బూడిద బ్రతుకులు మీవి చిక్కని చీకటి దుప్పటి కప్పిన అంధకార జీవితాలు మీవి భయంకర బాధల శోకం తరిమి తరిమి కొడుతుంటే బక్కచిక్కిన భీబత్స బాల్యపు భయంకర బతుకులు మీవి చితి మంటల సాక్షిగా చితికిన బాల్యపు అరణ్య రోదన మీది గాండ్రించి ఊసిన కామవాంచలు చిమ్మిన ఊపిరిలు మీవి కొవ్వు పట్టి సందుల గొందుల పందుల వలే నేల దొర్లిన క్షణిక కామ కోరికల.కండకావరాల […]

నీ చూపుల దీవెన!

రచన: గవిడి శ్రీనివాస్ నీ చిరునవ్వు పవనమే కష్టాల కడలి నుంచీ చేతులిచ్చీ ఎత్తుకుని మలయమారుతం వైపు నన్ను లాక్కుపోతుంది . నీ చూపుల దీవెనే ఊహలకు రెక్కలిచ్చి భావ సోయగాల మధ్య బందీని చేసింది. దొండ పండులా మెరిసే నీ పెదవుల్ని చిలకలా కోరకడానికి ఉరికి నపుడల్లా మంచు వర్షం నా గుండెల్లో కురుస్తూనే వుంది . నీ పాద పద్మాల్ని చుంబించి నపుడల్లా వెన్నెల సెలయేళ్ళు నాపై జాలువారుతున్నాయి. ఊపిరి సలపని నీ బిగి […]

ప్రకృతే దేవుడు : దేవ్ ఘర్ (Nature is the house of God)

సేకరణ, రచన: డా. శ్రీసత్య గౌతమి మహారాష్ట్ర, రాయ్ గడ్ జిల్లాలో హరిహరేశ్వర్ అనే చిన్న ఊరు నాలుగు కొండల మధ్య చిక్కుకున్నట్లుగా వుంది. ఈ ఊరిచుట్టూ ఈ నాలుగు కొండలే కాకుండా ఆ కొండల మధ్యలో ప్రవహిస్తూ ఆ ఊరిచుట్టూ అరేబియా సముద్రం అల్లుకొని వుంటుంది. అందువల్ల హరిహరేశ్వర్ చుట్టూ అందమైన సముద్ర తీరాలతో చల్లని గాలులతో వచ్చిన సంధర్శకులని అలరిస్తూ వుంటుంది. నిజానికదొక దీవి. మరి ఆ చుట్టూ విస్తరించుకొని వున్న ఆ నాలుగు […]

మాయానగరం – 23

రచన: భువనచంద్ర బోసుబాబు ప్రభ వెలిగిపోతోంది. కారణం గురుపూజా మహోత్సవం. సారా ప్రవాహానికి గురుపూజకి సంబంధం ఏమిటని ఎవరూ అడగరు. కడుపు నిండా సారా కావల్సినంత తిండి దొరికిందా లేదా అన్నదే ముఖ్యం. అందరూ శివస్వరూపులే… అంటే భోళా శంకరులే. పుష్పం పత్రం తోయం.. చాలు పాపం. రోడ్డు మీద పోయే సామాన్య మానవుడ్ని పిలిచి “ఇదిగో మనిషి… యీ సంచీలో పది కోట్లు వున్నాయి. హాయిగా తీసుకెళ్ళి ఖర్చుబెట్టుకో అనండి. ఒట్టేసి చెబుతున్నా … ఒక్కడు […]

అనకాపల్ల్లిలో శ్రీ దత్తాత్రేయ వైభవం

సేకరణ మరియు రచన: వెంకట సుశీల, అనకాపల్లి దత్తాత్రేయం మహాత్మానం,వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు | చాలామంది నోటనుండి నేను విన్నాను. “రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు అలాగే షిరిడీ సాయిబాబా మొదలైన వారు మానవులు, వారు మానవులవలె ప్రేమించారు, విలపించారు, అందరిమధ్య ఒకరు గా జీవించారు, అందరూ తిన్న ఆహారాన్నే భుజించారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు (సాయిబాబా కాదులెండి), పిల్లల్ని కలిగివున్నారు, బంధాలకి బాందవ్యాలకి లోనయ్యారు. అటువంటప్పుడు దేవుళ్ళెలా అవుతారు? వీటన్నింటినీ జయించిన వాడే […]

యాత్రామాలిక: భారతీయులలో పెద్దగా ప్రాచుర్యం లేని అమెరికాలో చూడదగ్గ ప్రదేశాలు – మొదటి భాగం.

రచన: భరద్వాజ్ వెలమకన్ని అమెరికా గురించి సందర్శకులు మాట్లాడుకునేడప్పుడు వారి నోళ్ళలో ముఖ్యంగా నానేవి నయాగరా, లిబర్టీ విగ్రహం, వైట్ హౌస్, గ్రేండ్ కేన్యన్, హాలీవుడ్, డిస్నీ, ఓర్లాండో, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ లాంటి ప్రదేశాలు. చాలా మంది అమేరికా వసులైన భారతీయులకు కూడా ఈ ప్రదేశాలు మాత్రమే తెలుసు. అయితే అమోఘమైన ప్రకృతి సౌందర్యం అమేరికా స్వంతం. చాలా నేషనల్ పార్కులు సందర్శకులను ఒక అద్వితీయమైన అనుభూతికి లోను చేస్తాయి. ఈ వ్యాసంలో మనం భారతీయుల్లో పెద్దగా […]

జీవితం ఇలా కూడా ఉంటుందా??? 3

రచన: శ్రీమతి అంగులూరి అంజనీదేవి ”నాకేమైనా తెలుసా? ఎందుకంత ఆయాస పడతావ్‌! ఇంత పెద్ద హాస్పిటల్‌కి తీసుకొస్తే బ్రతకదా! నిన్ను చూస్తుంటే ముందు నువ్వు పోయేలా వున్నావ్‌! అటు వెళ్లి కూర్చో! ఆ కారాయన ఎవరో మంచి హాస్పిటల్‌కే తీసుకొచ్చాడు” అంటూ అంకిరెడ్డి వైపు చూపించింది తారమ్మ. ఆయన మీద ఆమెకు కోపం వస్తోంది. ఇన్ని అంతస్తులున్న హాస్పిటల్‌ని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఒక్క అంతస్తు, అదీ రంగువెలసి చెడువాసన వచ్చే హాస్పిటల్‌. అందులో ఒక్క […]