April 27, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 8

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య మనుమడైన చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణమైన “పదచ్ఛందము” లో సంకీర్తనల గొప్ప దనాన్ని ఎంతో వైభవంగా కీర్తించాడు. “శృతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై / యతిలోకాగమ వీథులై వివిధమంత్రార్థంబులై నీతులై కృతులై వేంకటశైలవల్లభ రతిక్రీడారహస్యంబులై / నుతులై తాళుల పాక న్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్.” అంటాడు. తాతగారైన అన్నముని కీర్తనలు వేద, వేదాంగాలతో సమానం, సకల శాస్త్రాలతో సమానం, ఇవి జ్ఞాన భాండాగారాలు, వివిధ మంత్రాల యొక్క అర్ధాలై, నుతులై, శ్రీవేంకటేశ్వరుని శృంగార […]

“పోరనట్టి ఆలిగలదె?” ఆటవెలదులు

రచన: కిభశ్రీ ఏ మగాడైనా, భార్య పదే పదే ఏదైనా చెప్పిందంటే దాన్ని పోరు కింద పరిగణిస్తాడు. సరదాగా భార్య పెట్టే పోరుగానే వివరిస్తూ, తనమంచికే ఆమె చెబుతూందన్న భావాన్ని కొన్ని ఆటవెలది పద్యాలలో ….. ఏమగాడికైన ఇంట్లోన యేబాధలసలు పెట్టనట్టి ఆలి గలదె? చదువులెన్నియున్న చవటాయివేనీవుయనుచు పోరనట్టి ఆలి గలదె? సూర్యుడదిగొ లేచె చూడెంత బాగుండె మొద్దు నిదుర మాని ముసుగు తీసి జాగుచేయకుండ జాగింగుకే పొమ్మననుచు పోరనట్టియాలి గలదె? బానపొట్ట చూడు పనస పండంతయ్యి […]

మాయామాళవగౌళ రాగ లక్షణములు

రచన: భారతి ప్రకాష్. ఈ రాగము 15.వ. మేళకర్త రాగం. మూడవ చక్రమైన “అగ్ని” లో మూడవ రాగం. ఈ రాగం యొక్క అసలు పేరు ” మాళవగౌళ “. కటపయాది సూత్ర ప్రకారం 15.వ. సంఖ్య కోసం ” మాయా ” అనే పదం ఈ పేరుకు ముందుగా జేర్చబడింది. ఆరోహణ -> స రి గ మ ప ద ని స. అవరోహణ -> స. ని ద ప మ గ […]

లింగ పురాణము – విమర్శనాత్మక పరిశీలన

రచన: కొరిడే విశ్వనాథశర్మ ఓం గం గణపతయే నమః ఓమ్ శ్రీ వాగీశ్వర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఒక పురాణప్రస్తావన మరొక పురాణమునందు కనబడున్నది. లింగపురాణప్రస్తావన లింగపురాణమునందే కాక ఏకాదశసాహస్రశ్లోకగ్రథితముగానూ, పదకొండవ పురాణముగానూ మత్స్యాగ్నినారద భాగవతాదులయఓదు కీర్తించబడినది. 12, 13 శతాబ్దీయుడైన బల్లాలసేనుడు తన ‘దానసాగరము’న “షట్సాహస్రమితం లింగపురాణమపరం తథా.” అని ఆరువేల శ్లోకపరిమితమైనది గా పేర్కొన్నాడు. కాని ప్రస్తుతం లభిస్తున్న లింగపురాణము తొమ్మిదివేల శ్లోకముల గ్రంథము లభించుతున్నది. కావున మూలలింగపురానగ్రంథము కాలప్రవాహమువలన శ్లోకముల […]

రాయినైనా కాకపోతిని…..

కన్నడ మూలం – ఎమ్. ఆర్ మందారవల్లి తెలుగు అనువాదం- బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి కంపెనీ బస్ లో ఇంటికి బయల్దేరాడు సుందరం. మొదటి ట్రిప్ కావడంతో బస్ కొంచెం ఖాళీగానే ఉంది. పండగరోజు కావడం వల్ల చాలామంది రాలేదు. బస్ మధ్య ఉన్న సీట్ లో కిటికీ ప్రక్క కూచున్నాడు. ఇంటికి చేరడానికి ఒక గంటకు తక్కువేమీ పట్టదు. హాయిగా ఒక కునుకేసేయవచ్చు. కళ్ళు మూసుకుని కూర్చోగానే అతనికి సుమతి మదిలో మెదలసాగింది. భార్యే అయినా, […]

వేద వాజ్మయము – పరిచయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు భారతదేశము పుణ్యభూమి అనడానికి కారణము వేదాలు పుట్టినచోటు కావటమే. అందుచేతే వేదభూమి అని కూడా అంటారు . వేదాలు భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి అదర్శజీవనానికి మూలాధారము. మనిషిని నడిపించే ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్ధలను తెలియజేసే శబ్దరాశే వేదము. వేదమనే శబ్దము”విద్” అనే సంస్కృత శబ్దము నుండి ఏర్పడింది . వేదాలు ఒక మతానికి, ఒకప్రాంతానికి లేదా ఒక వర్గానికి , దేశానికి చెందినవి కావు వేదాలను విశ్వవాజ్మయముగా పేర్కొనవచ్చు . […]

అనగనగా ఒక రాజు

రచన: ధనికొండ రవిప్రసాద్ “ఏం గురూ ! ఈ మధ్య కథలేమీ రాయట్లేదా ? ” అన్నాడు సుబ్బారావ్. “పత్రికలకి రాస్తూనే ఉన్నా” అన్నాను. “ఇంకా పత్రికల కథల దగ్గరే ఉన్నావా ? ఏ టి.వి.సీరియల్సో రాయక. ఆ పత్రికలోళ్లు పది కతల్రాస్తే ఒక కత యెయ్యటమే ఎక్కువ. ఆళ్లిచ్చే డబ్బులు మనకేం లెక్క ! ఈ మద్య నేను టి.వి. సీరియల్స్ కి రాస్తన్నా అన్నాడు. నాకు మతి పోయినంత పని అయ్యింది. “నువ్వు టి.వి. […]

నేను అమ్మనయ్యాను!

రచన: వడ్లమాని బాలా మూర్తి. “నువ్వు గొడ్రాలివి… నువ్వు గొడ్రాలివేనే మహాతల్లీ ఏం పాపం చేసుకున్నామో మా పాలిట పడ్డావు. నాకా వీడొక్కడే, వీడికో నలుసైనా పుడుతుందా అంటే, నీ కడుపు పండదాయే..ఖర్మ…… నువ్వు గొడ్రాలివి……. గొడ్రాలివి…… గొడ్రాలివి……..” “అబ్బా” అని రెండు చెవ్వులూ మూసుకుంది రమావాణీ. గత రెండు సంవత్సరాలై ఇదే తంతు. ఏడాది దాటింది తానూ శేఖర్ విడిపోయి. డైవోర్స్ కూడా వచ్చేసింది. కానీ అత్తగారి శాపనార్ధాలు ఇంకా చెవులో గింగుర్లాడుతూనే ఉన్నాయి. అబ్బా […]

కాలం మారిందా?

రచన: సుజల గంటి ధరణి మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణం ఏమిటీ. అన్నిటికీ సర్దుకుపోవడం అన్నది ఎన్నాళ్ళు జరగాలి? సర్దుబాటన్నది భార్యాభర్తలిద్దరి మధ్యా ఉండాలి. కాడికి కట్టిన ఎద్దుల్లా జీవిత భారాన్ని ఇద్దరూ సమానంగా మొయ్యాలి. ఒక ఎద్దు అలిసినప్పుడు ఇంకో ఎద్దు మిగిలిన భారాన్ని కూడా మొయ్యాలి. ఇది ఇద్దరికీ వర్తించినా అవసరమైనప్పుడు అదనపు భారాన్ని ఎప్పుడూ ఆడదే మోస్తుంది. తప్పించుకుందుకు, సాకులకు ఆమెకు అవకాశం దొరకదు. అమ్మగా ఆమె అలా […]

సస్పెన్స్ కధలు: 2 – అమ్మా, నాన్న ఒక బాబు

రచన: మధు అద్దంకి కెవ్వుమనరిచాడు సోను. ” మమ్మీ వద్దు మమ్మీ , కొట్టకు మమ్మీ, మళ్ళీ చెయ్యను మమ్మీ అంటూ ఏడుస్తూ, అరుస్తున్నాడు సోను.. అయినా కనికరించకుండా బెల్టుతో చితక బాదుతోంది లక్ష్మి..పనిమనిషి రత్తాలు అడ్డమొచ్చి తల్లి చేతుల్లోంచి బెల్ట్ లాక్కుని, సోనూని పక్క గదిలోకి తీసుకుపోయింది.. ” రాస్కెల్ వద్దన్న పని చేస్తాడా ఇవాళ వీడిని చంపేస్తాను” అని మళ్ళీ పక్కగదిలోకి పోబోయింది. లక్ష్మి అరుపులు విన్న రత్తాలు గభాల్న తలుపేసి గొళ్ళెం పెట్టింది.. […]