May 6, 2024

ప్రేమలోనే గెలుపు …..  (ఓ ప్రేమిక మనోభావన)                       

రచన: కోసూరి ఉమాభారతి     నేను చిన్నదాన్నే ఐనా గడసరిని, సొగసరిని… నడకలతో పాటు నాకు నడతలు నేర్పావు లోకంపోకడలు తెలిపావు… తప్పొప్పులు చెప్పావు ప్రేమలు ఆకర్షణల నుండి హెచ్చరించావు కూడా ఎదుగుదలతో వొదుగుదల ఉండాలన్నావు అందాలతో పాటు అణుకువలు రావాలన్నావు వయసు సందడులు, మనసు అలజడులతో చుట్టూ లోకం సందడి సందడిగా ప్రేమనురాగాలు వలపుతలపులతో మనసంతా చిందరవందగా ఉంటుందే మరి… నా ప్రేమికుడు టక్కరివాడే ఐనా వలపుల నెలరేడు నా మనసెప్పుడో అతగాడి సొంతం […]

ఒక విధి వంచిత కధ

 రచన: ప్రియా   నా పరిస్థితి నన్ను నిలువునా దిక్కరిస్తోంది నా అనుమతి లేకుండానే నన్ను వెక్కిరిస్తోంది నా అసమర్ధతను నాకు ప్రతిక్షణం గుర్తుచేస్తోంది నా దీన స్థితిని చూసి విధి కసిగా వెక్కిరిస్తోంది నా బ్రతుకు ను తమాషా చేసి తెగ  పరిహసిస్తోంది జీవన ప్రయాణంలో ఎన్నో బాధల సుడిగుండాలు సంగర్షణవ్యధల  చితిమంటల  నరక యాతనలు మానవసంబంధాల నటనల్లో ఎన్నో భూటకాలు మానవత్వము సచ్చిన సమాజంలో పడిగాపులు విసిరేసిన విస్తరాకులాంటి చీత్కారాల బతుకువెతలు బాందవ్యాలు  కాదు […]

దృఢచిత్తులు ధీరవనితలు

రచన: ప్రియానాయుడు     అదిగో అల్లదిగో ఒక్కసారి అటు చూడండి అహో జ్వలిత వనితలారా దిక్కులు పిక్కటిల్లేలా ఫిరంగులు మారుమ్రోగేల కదం తొక్కుతున్నారా యుద్ధభూమినందు శత్రుసైన్యాన్ని గజ గజ వణికించే మహాయోధులారా ఆడసైన్యము కాదు మీరు శత్రువులకు చెమట పట్టించే అగ్నికణము మీరు వీరనారి ఝాన్సిరాణి బిడ్డను నడుమున కట్టి పోరాడిన పుణ్య భూమి మనది మగవారికి తగుదీటుగా తరిమితరిమి కొట్టగల ధైర్య సాహసాల ఆడపులులు మీరు మాతృభూమి కొరకుతనవారందరినీ వొదిలి మరణము సైతము త్రుణముగా […]

కలంకారీ శారీ డిజైనర్ భారతి గారితో కాసేపు…

 శ్రీసత్య గౌతమి మనందరం మనకలల్ని సాకారం చేసుకోవాలని కోరుకుంటాం లేదా చన్నీళ్ళకి వేణ్ణీళ్ళు తోడులా కుటుంబానికి కొంతాదాయం తేవాలని కోరుకుంటాం. దానికి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తేనే కాదు ఇంట్లోవుండి కూడా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ నిర్వర్తించుకోవచ్చు లేదా ఉన్న ఉద్యోగం లో వచ్చే ఆదాయం తో పాటు హోం బెజినెస్ వల్ల మరికొంచెం ఆదాయాన్ని జమా చేసుకోవచ్చు. ఇది అంత సులభమైన పనికాదు అలాగని అసాధ్యమూ కాదు. ఇటువంటి ఆలోచనలతో ఏమి చెయ్యాలా, ఏ మార్గాన్ని వెతుక్కోవాలా […]

అనుంగత  

రచన: కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ కళ్లజోడు సరిచేసుకుంటూ, మధ్యమధ్యలో గాల్లోకి చూస్తూ, కలం విదిలిస్తూ లేత నీలి రంగులోని ఇన్లాండ్ లెటర్ ను అక్షరాలతో నింపేస్తున్నాడు సుబ్రహ్మణ్యం.. “ప్రియమైన శారదకు..ఉభయకుశలోపరి” అని ప్రారంభించి ఇన్లాండ్ లెటర్ లోని మూడు వైపులా పూర్తయినా, ఇంకా వదలకుండా, ప్రక్కకు త్రిప్పి చిన్నచిన్న అక్షరాలను ఇరికించి మరీ వ్రాస్తున్నాడు. తాను చెప్పాలనుకుంటున్న భావాలకు అక్షరాలు సరిపోవటంలేదు. అక్షరాలు ఇరికించేందుకు లెటర్లో స్థలం సరిపోవటంలేదు. సుబ్రహ్మణ్యం తన జీవితంలో తొలిసారి వ్రాస్తున్న […]

మారుతున్న కాలంలో

 రచన:-ఓలేటి శశికళ సోమవారం ప్రొద్దున్నేవంటింట్లో అష్టావధానం, శతావధానం చేస్తున్నాను.” అమ్మా! పెద్దమ్మగారు లేచారా?”, ఇది నాలుగోసారి అడగడం తులసి. తొందరగా ఆమె గది చేసేసి వెళ్ళిపోవాలని దాని తొందర. టైం తొమ్మిదవుతోంది. ఇంక లేస్తారేమోలే అన్నా. మా అత్తగారికి అరవై ఏళ్ళు. మావగారు పోయినా క్రుంగి పోకుండా, సాహిత్యమని, సంగీతమని, లలిత గుడిలో పారాయణలని, ఫేస్ బుక్ లో కొన్ని గ్రూపుల్లో మంచి స్నేహబృందం తో సాహితీ కాలక్షేపం, సాయంత్రం నడక…… ఇలా రకరకాల వ్యాపకాలతో కాలక్షేపం […]

శివోద్భవం-శివరాత్రి 

రచన: వెంకట సుశీల   విశ్వపిత అయిన శివ పరమాత్ముడు భారతదేశంలో ఉద్భవించిన సమయాన్ని స్మృతిచిహ్నం గా జరుపుకొను పండుగే శివరాత్రి పండుగ. వారిని పరంశివుడు, సదాశివుడు అని పిలుస్తారు. శివ అనేది సంస్కృత శబ్దం. దానికి రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటేమో “బిందువు”, రెండవది “కళ్యాణకారి”. అందుకే మొదటి అర్ధం “బిందువు” వారి రూపానికి, రెండవది “కళ్యాణకారి” వారి కర్తవ్యానికి సరిపోతుంది. ఇతరమతాలవారు కూడా భగవంతుడు ఒక జ్యోతిస్వరూపమనీ, వెలుగనీ అంగీకరిస్తున్నారు. ఏసుక్రీస్తు “గాడ్ ఈజ్ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 4

విశ్లేషణ:  టేకుమళ్ళ వెంకటప్పయ్య   అన్నమయ్య కొన్ని కీర్తనలలో తనకు కలిగిన సందేహాలనూ సంశయాలనూ సరాసరి శ్రీ వేంకటేశ్వరుడినే ప్రశ్నిస్తాడు.   శ్రీ మహావిష్ణువు అవతారాలలో జరిగిన పరస్పర విరుద్ధమైన విషయాలను “ఇదేమి చోద్యం స్వామీ!” అని నిర్భయంగా నిలదీసి  ప్రశ్నించే హక్కు వున్న  పరమ భక్తాగ్రేసరుడు అన్నమయ్య.  తనకు ముందున్న పురాణ పద్ధతులనూ, పద్య కావ్య పద్ధతుల్నీ విడచిపెట్టి, క్రొత్త పద్ధతిలో సంకీర్తనా సాహిత్యాన్ని సృష్టించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య. భువిపై అతడు ఆడిన […]

ఒక్క రోజు పండగ కారాదు                

రచన: పుష్యమీ సాగర్  మనదేశం లో అనాది నుంచి మహిళ అణిచివేతకు గురి అవుతూనే ఉన్నది. స్వతంత్ర సమరం లో తమ వంతు కృషి ని చేసిన గొప్ప మహిళా దేశ భక్తులు చరిత్ర లో ఉన్నారు. 60 ఏళ్ళ పరిపాలన తరువాత కూడా సగటు స్త్రీ పరిస్థితి ఏమిటి..? నాయకుల కుటిల రాజకీయ తో మహిళా బిల్లు ని వెనక్కి తోసేసారు …మహిళా శక్తి కి ప్రతీక గా మార్చ్ 8 రోజున “మహిళా దినోత్సవం” […]