May 1, 2024

బాధ్యత కలిగిన రచయితను ఎవరూ శాసించలేరు!

రచన:-​ టీవీయస్.శాస్త్రి  ​(నహుషుడి కధ !)​ నాకు తెలిసినంతవరకూ రచయితలనే వాళ్ళు ఎలా ఉంటారో చెబుతాను. రచయిత కేవలం వెన్నెల కురిపించే చంద్రుడే అనుకునే వారు ఎవరైనా ఉంటే, అది పూర్తి పొరపాటని చెప్పదలుచుకున్నాను. అప్పుడప్పుడూ చండ్రనిప్పులు కురిపించే సూర్యుడి లాంటి వాడు కూడా రచయిత అంటే. తన చుట్టూ  జరుగుతున్న సంఘటనలనూ, అన్యాయాలనూ ఖండిచక పోవటం రచయితగానే కాదు, ఒక సంఘజీవిగా కూడా మన బాధ్యతను పూర్తిగా విస్మరించినట్లే! అందులో ఏ మాత్రం సందేహం లేదు. నిర్లిప్తంగా కూర్చోవటం, […]

కుంభేశ్వరుని కోవెల కుంభకోణం

రచన: నాగలక్ష్మి కర్రా శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం, ఉపవాసాలు చెయ్యడం, శివుని భజిస్తూ, స్తుతిస్తూ రాత్రంతా జాగరణ హిందువులకు ఆనవాయితీ. పంచభూత లింగాల గురించి విన్నాం, మంచులింగం గురించి విన్నాం, జ్యోతిర్లింగాల గురించి విన్నాం, స్వయంభూలింగాల గురించి విన్నాం కానీ శివుడు స్వయంగా ఇసుకను అమృతంతో కలిపి చేసిన శివలింగం గురించి విన్నారా? లేదా? అయితే నేను వివరిస్తాను వినండి. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో తంజావూరుకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం […]

కానడ రాగ లక్షణములు

రచన:- భారతీ ప్రకాష్.   వ. మేళకర్త రాగమైన, ఖరహరప్రియ నుండి పుట్టిన జన్య రాగమిది.   ఆరోహణ :       స       రి        గ        మ      దా      ని       స. అవరోహణ :     స.       ని       స.       దా      ప       మ      ప       గా       మ      రి        స   షడ్జమ పంచమాలతో కలిసి ఈ రాగం లో వచ్చే స్వరాలు: చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధమధ్యమం, చతుశృతి దైవతం, కైశికి  […]

సమరుచుల ఉగాది పెన్నిధి….

 రచన: డా. శ్రీసత్య గౌతమి మరి సమభావాల సంఘీభావం మనిషికి ఏది?       వేపపూత నయగారాలు మీనాక్షి పద్మహస్తాలు మావిడాకు చిగురులు శ్రీహరుని నేత్రాలు ఆ రెంట దాగుడు మూతలు మన జీవితాన వెలుగు నీడలు తీపి చేదులు . ఆ విధాతల ఆనంద కేళీ విలాసం చైత్రమాల చక్కెరకేళీ తీపి గురుతుల అంకురం ఆపై ఉప్పు పులుపు వగరులు వెరసి షడ్రచుల రస ఉగాది సేవనం గ్రీష్మ కాంచన సుప్రభం వసంత ప్రభావిత కిరణం […]

అతను – ఆమె – కాలం

సమీక్ష: బులుసు సుబ్రహ్మణ్యం   అతను – ఆమె – కాలం పుస్తకం ఇరవై మూడు కధల సమాహారం. ఇందులో పదహారు కధలు బహుమతులు పొందినవి. కొన్ని వివిధ భాషల్లోకి అనువదించబడ్డాయి. రచయిత శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు, సుమారు పన్నెండేళ్ళుగా రచనలు చేస్తున్నారు. లక్ష్మిగారి కొన్ని కధలు, ఒక నవల, ఒక మినీ నవల వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఈమె బ్లాగ్లోకంలో కూడా ప్రసిద్ధులు. ఈ పుస్తకంలో కధలు చదివితే శ్రీమతి లక్ష్మిగారు మూడుతరాల తెలుగు […]

“సమయమిదే”– గజల్

రచన: – లయన్ విమల గుర్రాల   మంచుపూల వలపు కబురు కరిగిపోయె సమయమిదే… సూరీడూ నిప్పుటిల్లు చేరబోయె సమయమిదే…   శిశిరానికి ముడుచుకున్న తనూలతలు విరిసెనిపుడె నవయుగాది తేజాలే చెలగిపోయె సమయమిదే…   పాటలతో కోయిలమ్మ సమరానికి సిద్ధమపుడె నవరాగపు విందులకే పిలుపుపోయె సమయమిదే…   భయపెట్టే బ్రతుకు జాడ నవ్వుతుంది ఎపుడైనా కలలజిలుగు వెలుగుతార ఎదురుపోయె సమయమిదే…   రైతన్నల కన్నులలో వెలుగు మొలక తొంగిచూచె సందెలలో విమల వాణి మురియబోయె సమయమిదే…   […]

సమూహమే బలం

రచన: –  ధనలక్ష్మి సైదు   మనుస్మ్రుతి మనకొద్దు… ఏకులం ఏ భాగాలా నుంచి ఉద్భవించిందో అధి కూడా వద్దు .. పెళ్ళిళ్ళకు,పూజలకు తప్ప పట్టేడన్నం పెట్టని గో్త్రాలు వద్దు .. కులకట్టడులను రాబడులుగా మార్చుకున్న రాజకీయం వద్దు .. అస్సలు సాటిమనిషిని గుర్తించని ఏమతం వద్దు .. బ్రాహ్మణులు పూజలు మాత్రమేనంటే, క్షత్రియులు రాజ్యాలే ఏలాలంటే , వైశ్యులు వ్యాపారమే చెయ్యాలంటే , శూద్రులు సేవలే చెయ్యాలంటే, సమాజములొ స్తబ్దత ఎలా పోతుంది ఇక సమసమాజం ఎలావస్తుంది . సమభావము మాటేమిటి ….? మనుషులలొ ముందడుగు ఉండాలి నలుగురిని కలుపుకుపోయే తత్వం రావాలి ఐదు వేళ్ళూ కలిస్తేనే ముద్ద నోటికి అందేది .. అన్ని వర్ణాలు కలిస్తేనే ఇంద్రధనుస్సు అందరు కలిసి ఉంటేనే మానవశ్రేయస్సు .. సముహాలే బలమన్న విషయం జంతువులకే తెల్సు .. ఇంగితం ఉన్న మనుషులం తెలుసుకొకపోతే ఎలా.. “కారం”చేడు లాంటి ఘటనలను “వగరు”గా తగిలే కులకుమ్ములాటలను పరజాతి నిందలను “ఉప్పు”పాతర వెయ్యాలి సాటి మనిషి పట్ల కుల”పులుపు” […]

శ్రీకృష్ణదేవరాయలు – 1

రచన:- రాచవేల్పుల విజయభాస్కర రాజు దక్షిన భారత దేశాన్ని మహమ్మదీయుల దండయాత్రల నుండి రెండు శతాబ్దాలకు పైగా కాపాడిన హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. విజయ నగర సామ్రాజ్య  వైభవానికి ప్రతీక ఆనాటి రాజధాని విజయనగర పట్టణం. శత్రు రాజులు సైతం ఈ మహానగరాన్ని చూసి తరించాలని ఉవ్వీళ్ళూరారు. దేశ విదేశాలకు చెందిన ఎందరో పర్యాటకులు, వ్యాపారులు విజయనగరాన్ని సందర్శించారు. ఆనాడు కళ్ళారా చూసిన విజయనగర పట్టణాన్ని, సామ్రాజ్య వైభవాన్ని, జాతర్లు, వసంతోత్సవాలు, కవితా గోష్టులు, విజ్ఞాన […]

మాయానగరం – 26

రచన: -భువనచంద్ర   “బోసు.. దయా, జాలీ, సేవా, త్యాగం, ఓర్పు ఇవన్నీ నాయకుడు కాదల్చుకున్న వాడికి స్పీడ్ బ్రేకర్లు. వీటన్నిటికీ మించిన దుర్గుణం ప్రేమ”. ఊబిలో పడ్డవాడ్ని బయటకి లాగొచ్చు. సముద్రంలో ఈతరాక పడినవాడ్ని రక్షించవచ్చు.  ప్రేమలో పడినవాడ్ని దేముడైనా రక్షించలేడు. నీకు అప్పుడే చెప్పాను.. కావల్స్తే ఆ అమ్మాయిని నయానో, భయానో లొంగదీసుకో, ‘ప్రేమ’ లో మాత్రం పడవద్దని.  అసలే ఆడది… అందునా అనాథ.. దాని ఆలోచన ఎలా వుంటుందీ? లోకాన్ని ఉద్దరిద్ధామనే ఉద్దేశ్యంలో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 5

విశ్లేషణ:  టేకుమళ్ళ వెంకటప్పయ్య  జీవితం ఓ కలలాంటిది. అలాంటి తాత్కాలికమైన జీవితంలో జరిగేవన్నీ నిజమేననీ, శాశ్వతాలనీ భ్రమింపజేస్తాయి. అందువల్లనే మానవులు తీరని కోరికలతో ప్రతిదీ నాదీ నాదీ… అనుకుని తప్పటడుగులు వేసే అవకాశం ఉంది. అవి తప్పటడుగులని తెలిసిన క్షణం నుంచీ జీవితాన్ని సరిదిద్దుకుని మోక్షం వేపు అడుగులు వేస్తాం. లేదంటే ఆ తీరని కోరికలతో నాదీ…నేను.. నావాళ్ళూ..అనే బంధాలలో జిక్కి జనన మరణ చక్రంలో శాశ్వతంగా పరిభ్రమిస్తూనే ఉంటామంటాడు ఈ కీర్తనలో  అన్నమయ్య. ప.తెలిసితేమోక్షము – […]