May 2, 2024

ఆంధ్ర భారత భారతి – 2

( కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతంలోని హృద్య పద్యాలకు వ్యాఖ్యానం – 2 ) – డా. ఆచార్య ఫణీంద్ర “విమల మతిం బురాణములు వింటి ననేకము; లర్థ ధర్మశా స్త్రముల తెరం గెరింగితి; నుదాత్త రసాన్విత కావ్య నాటక క్రమముల  పెక్కు సూచితి – జగత్పరిపూజ్యములైన ఈశ్వరా గమముల యందు నిల్పితి బ్రకాశముగా హృదయంబు భక్తితోన్!” ఈ పద్యం  ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని అవతారిక లోనిది. పరమ ధర్మవిదుడు, వర చాళుక్యాన్వయాభరణుడు అయిన రాజరాజనరేంద్రుడు – నిత్యసత్యవచనుడు,సుజనుడు […]

శ్రావణ పౌర్ణమి సంచికకు స్వాగతం

మాలిక మూడవ సంచికకు స్వాగతం. ఈ ప్రత్యేక సంచిక ఎన్నో వ్యాసాలు, కథలతో, పోటీలతో ముస్తాబై వచ్చింది. ఈ సంచికలో ప్రముఖుల రచనలు, బ్లాగర్ల అద్భుతమైన కథలు, వ్యాసాలు, అసలు బ్లాగులంటేనే తెలీనివారి రచనలు కూడా పొందుపరచాము. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము. మీ విమర్శలు, సలహాలు మాకు సదా శిరోధార్యం. అనివార్య కారణాల వల్ల రావు బాలసరస్వతిగారి ఇంటర్వ్యూ ప్రచురించడంలేదు. దీపావళి సంచికలో ప్రచురిస్తాము. ఈ సంచికలో రెండు పోటీలు నిర్వహిస్తున్నాము. రెంటికీ నగదు బహుమతి […]

శ్రీ శక్తీశ్వరస్వామి దేవాలయం, యనమదుర్రు

రచన: పి.ఎస్.లక్ష్మి. ఆధ్యాత్మికతవెల్లివిరిసే మన దేశంలో ఎన్నో అపురూపమైన దేవాలయాలు, వాటి గురించి ఇంకెన్నో అద్భుతమైన కధనాలు…తెలుసుకున్నకొద్దీ ఆశ్చర్యం..తరచి చూసినకొద్దీ అద్భుతం. ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకుని, వాటిని దర్శించి, గౌరవించాల్సిన కనీస బాధ్యత ఈ దేశ ప్రజలమైన మనది. అయితే మన దురదృష్టమేమిటంటే మన అశ్రధ్ధనండీ, తెలియకపోవటంవల్ల కానీయండీ, తెలుసుకోవాలనే ఆసక్తిలేకపోవటంవల్లకానీయండీ, సమయాభావంవల్ల కానీయండీ, మన సంప్రదాయాలూ, ఆలయాల పట్ల మనకు తగ్గుతున్న ఆసక్తివల్లకానీయండీ, ఏ ఇతర దేశాలకీ లేనటువంటి ఇంత కళా సంపదను మనం […]

మాలికా పదచంద్రిక – 2

మీ సమాధానాలు మాకు ( admin@maalika.org ) పంపించటానికి చివరి తేదీ మే 31, 2011   ఆధారాలు: అడ్డం: 1 . ఇటీవల సలీంకు సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన నవల! (4,4) 4. సంజయుడు చెప్పినది (3,3) 9. ఆలు మగల _ _ _ /అంత మొందిన రేయి /అనుమానపు హాయి/ ఓ కూనలమ్మ – ఆరుద్ర ఉవాచ (3) 10. కాంతి (1) 11. అరవపు సుబ్రహ్మణ్య స్వామి కాస్త తడబడ్డాడు.(3) […]

ఎంత ఘాటు ప్రేమయో!

— మధురవాణి అనగనగా ఒక ఊర్లో మహా రద్దీగా ఉండే ఒక వీధి. ఆ వీధి ఎల్లప్పుడూ తూనీగల్లాగా ఝూమ్మని బైకులేసుకు తిరిగే కుర్రాళ్ళతోనూ, రంగుల రంగుల దుస్తుల్లో మెరిసిపోతూ నవ్వుతూ, తుళ్ళుతూ అందమైన సీతాకోకచిలుకల్లా విహరించే అమ్మాయిలతోనూ కళ కళలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊర్లోనే పేరుపొందిన రెండు అతి పెద్ద కాలేజీలు అక్కడే ఉన్నాయి మరి! ఆ రెండు కాలేజీల్లో కలిపి వేలల్లో ఉంటారు విద్యార్థులు. పేరుకి విద్యార్థులే అయినా కూడా విద్య కోసం […]

వర్ణ చిత్రాల మాంత్రికుడు వడ్డాది

రచన : సురేఖ అప్పారావు   మనకు ఎందరో చిత్రకారులున్నారు. కానీ వడ్డాది పాపయగారి చిత్రరచనాశైలి వేరు ! ఆయన కుంచె అనే మంత్ర దండంతో చేసే మాయావర్ణ చిత్రవిన్యాసాలు అద్భుతం! శ్రీ వడ్డాది పాపయ్య చిత్రకారుడిగా ఎంతమందికి తెలుసో అలానే ఆయన గురించి తెలియని వాళ్ళూ మన తెలుగు దేశంలోఉన్నారు. 1945లో ప్రారంభించిన బాలన్నయ్య , బాలక్క్యయ్యల “బాల”లో ఆయన ముఖ చిత్రాలతో బాటు లోపలి బొమ్మలూ వేశారు. ఆయన “లటుకు-చిటుకు” శీర్షికకు లటుకు చిటుకుల […]

అవార్డులిస్తాం! చందా కట్టండి!

రచన: పాణంగిపల్లి విజయ భాస్కర శ్రీరామ మూర్తి. పార్వతీపురం.   ప్రియరంజనీ రావుకు గొప్ప టెంక్షన్ గా ఉంది. అప్పటికే పది మంది పెళ్ళికొడుకుల ముందు కూర్చొని ఓ.కే.అనిపించుకోలేని పెళ్ళి కూతురులా ఉంది అతని మానసిక పరిస్థితి. గొప్ప అలజడిగా ఉంది. ఆందోళనగా ఉంది. అల్ల కల్లోలంగా ఉంది. గాలికి చెదిరిన జుట్టులా నక్స్లైట్లు పేల్చేసిన ప్రభుత్వ కార్యాలయంలా దీపావళి మరునాటి ఉదయపు వీధుల్లా. ఇలాంటి పరిస్థితి అతనికి చాలా కాలంగా అలవాటయిపోయింది. ఎక్కడ ఏ కథల […]

శకుంతల దుష్యంతుల కధ సార్వకాలికం

శకుంతలా దుష్యంతుల కథ అనగానే మనకి వారి ప్రణయం, దుష్యంతునికి శాపం, భరతుని జననం లాంటి ఐతిహాసిక విషయాలే చాలావరకూ గుర్తొస్తాయి. అయితే ఈ కథను సమకాలీన స్త్రీవాదకోణంలోనుండి విశ్లేషించిన డా. తిరునగరి దేవకీదేవిగారు తన విశ్లేషణను మనకు ఈ వ్యాస రూపంలో అందిస్తున్నారు ధమతత్వజ్ఞులు ధర్నశాస్త్రంబని యధ్యాత్మవిదులు వేదాంతమనియు నీతి విచక్షుణులు నీశాస్త్రంబనియు కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని యైతిహాసికులితిహాసమనియు పరమపౌరాణికుల్ బహుపురాణ సముచ్చ యంబని మహిగొనియాడుచుండ వివిధ తత్వవేది వేదవ్యాసు డాదిముని పరాశరాత్మజుండు విష్ణుసన్నిభుండు […]

కంది గింజ

రచన : శ్రీధర్ ఆయల             “ మిస్టర్  నూర్  భాషా ! నువ్వు  ‘ఖురాను’   మీద  ప్రమాణం  చేసావు. నీ  వృత్తి  వివరాలు  కోర్టు  వారికి ఉన్నది, ఉన్నట్లుగా  తెలియజెప్పు.” “ హుజూర్ ! నేనొక  శిల్పిని.  పాలరాయి,  సుద్దరాయిల  మీద,  ఇంకా  మీనియేచర్  వస్తువుల  మీద  పేర్లు,  చిత్రాలు  గీస్తాను.” “  మీనియేచర్  వస్తువులు  అంటే ?” “  కందిగింజలు,  బియ్యం   గింజలు  వగైరా  హుజూర్ !” “ కందిగింజల  మీద  వ్యక్తుల  పేర్లు,  […]

భారతంలో బాలకాండ

రచన: శారదామురళి               ప్రియమైన మీనా, బాగున్నావా? ఇక్కడ నేను బాగానే వున్నాను. కనీసం అలా అనుకుంటున్నాను. ఇంటా బయటా ఊపిరాడనంత పని. శారీరకమైన శ్రమ  కంటే మానసికమైన అలసట ఎక్కువ కృంగ దీస్తుందేమో! కొద్ది రోజులు ఉద్యోగం మానేసి విశ్రాంతి తీసుకో అంటాడు ప్రశాంత్. కానీ నీకు తెలుసుగా, నా పనంటే నాకెంత ఇష్టమో.   నిజానికి, ఆస్ట్రేలియా వచ్చింతరువాత ఏం చేయాలో నాకు చాలా రోజులు […]