April 26, 2024

మాలికా పదచంద్రిక – 3

కోడిహళ్ళి మురళీమోహన్ గారు కూర్చే పదచంద్రికలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది – సరిగా పూరించినవారికి 1000 రూపాయల బహుమతి. విజేతలు ఒకరికన్నా ఎక్కువగా ఉంటే బహుమతి అందరికీ సమానంగా పంచబడుతుంది. ఒకవేళ విజేతలు అయిదుగురికన్నా ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన అయిదుగురికి బహుమతి సమానంగా పంచబడుతుంది. మీ సమాధానాలకోసం ఎదురుచూస్తున్నాం. సమాధానాలు ఈమెయిల్ చెయ్యవలసిన చిరునామా: editor@maalika.org – సంపాదకవర్గం           ఆధారాలు అడ్డం:  1.తెలుగు స్టయిలు (2) […]

గిన్నీస్ రికార్డ్

రచన : డి.వి.హనుమంత్ రావు. పాత్రలు :  భార్య — శ్రీమతి విజయలక్ష్మి.. భర్త .. శ్రీ డి.వి.హనుమంత్ రావు..     భార్య.. (పాట)వాసంత సమీరంలా .. నులివెచ్చని గ్రీష్మంలా….. సారంగ సరాగంలా ..అరవిచ్చిన లాస్యంలా.. ఒక శ్రావణమేఘంలా…. సాధించాలి భర్త : ఈ గోల మొదలైపోయింది.. భార్య : ఈసారి ఎలాగైనా సాధించాలి… భర్త :(మధ్యలో ఆపి) అమ్మా! తల్లీ! ఈసారేమిటమ్మా నీ సంకల్పం? భార్య: కస్తూరి..కస్తూరి.. (వినిపించుకోకుండా పాట కంటిన్యూ చేస్తూ వుంటుంది) […]

ఓనమాలు

రచన : ఆదూరి సీతారామమూర్తి   ముందుగా ఊహించిన సంగతే అయినా శివరామయ్యగారి కావార్త కొండంత ఆనందాన్నే కలుగచేసింది. ఎంత బడిపంతులు పని చేస్తూ పేద బ్రతుకు బ్రతుకుతున్నా ఆ క్షణం అతని మనోసామ్రాజ్యం అంతటా నిండి, పొంగిపోతున్న సంతోషపు వెల్లువలో ప్రపంచాన్ని జయించిన గర్వం తొణికిసలాడింది. విద్యను నమ్ముకుని బ్రతుకుతూన్నందుకు సరస్వతీదేవి తనకు అన్యాయం చెయ్యలేదు. తూర్పు వాకిట్లో పారిజాతం మొక్క దగ్గరగా యీజీఛైర్లో కూర్చున్న శివరామయ్యగారికి ఆ తొలిసంధ్యలో ఎన్నో కొత్త అందాలు గోచరించాయి. […]

చేపకి సముద్రం-భాషకి మాండలికం

రచన :   వై.   శ్రీరాములు-అనంతపురం సంస్కృతం నేర్చుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల్ని వినియోగించిన మనం, ఆంగ్లం నేర్చుకోవడానికి కొన్ని వందల సంవత్సరాల్ని వినియోగిస్తున్నమనం మాండలిక పదాల్ని గమనించడానికి క్షణాలలో విసుగును ప్రదర్సిస్తున్నాం. మాండలికంలో రచనలు చేస్తే ఎంతమందికి అర్థం అవుతుందనే వాదనలోనే మనం పయనించినంత కాలం ఆప్రాంత ప్రజల జీవనాన్ని ఆప్రాంత ప్రజల సంస్కృతిని ఆప్ర్రాంత ప్రజలకే దూరం చేసినవారుగా మనం మిగిలిపోతున్నాం.   వెంటనే అర్థం కావడానికే ప్రాధాన్యత జరుగుతోంది గాని ఈనాటికీ వెంటనే […]

ఆదర్శసతి సీత

రచన : డా. వి.వి.రాఘవమ్మ భారతీయ సాహిత్యమునందేగాక విశ్వసాహిత్య వీధులలో కూడా  రామాయణం మహేతిహాసంగా నిస్తుల ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది.  వాల్మీకి మహర్షి ఉత్తమ ఆదర్శానికి ఉదాత్త దర్శనానికి ఇది ప్రతిరూపం.  అవతారపురుషులలో ఉత్తముడు, ఉదాత్తుడు అయిన శ్రీరామచంద్రుని అపురూపమైన చరితం.  రామాయణం ప్రపంచితమైనది.  “సీతాయాశ్చరితం మహత్”అని వాల్మీకియే ప్రవచించాడు. సీతారాములిద్దరు ధర్మకర్మల్ని ఆచరించి చూపారు.  నాటి నుంచి నేటివరకు అగ్రతాంబూలం అందుకుంటున్నారు. రాముడు ఆచరించినట్లు,శ్రీకృష్ణుడు ప్రభోధించినట్లు చేయండని విజ్ఞుల విజ్ఞాపన. గీర్వాణ భాషలో మధురాక్షర సమన్వితమై కావ్యంగా […]

తెల్లరంగు సీతాకోక చిలుకలు

రచన: స్వాతికుమారి బండ్లమూడి అనుమానం; చిన్నరేఖ పక్కన మరగుజ్జు గీతలు కంటికి సమాంతరంగా సాగని చూపులు ఎక్కడానికీ, దిగజారడానికీ అవే మెట్లు   —–   నమస్కారం; తిరుగు రైలు లేదని తెలిసీ మా ఊరొచ్చిన స్నేహితులకి మనిషిగా ఎదగమని అడ్డుతొలగిన ఆనందానికి వైరాగ్యాన్ని అలవాటు చేసినందుకు వంచనకి   —–   అవసరం; గాయపడని చోట ముందు చూపుతో కాస్త మందు ఆత్మను కాపాడుకోడానికి అహానికో చెంపదెబ్బ ఇంకా నేర్చుకోని పాఠాలకి కాసేపు విరామ చిహ్నం […]

సంపాదకవర్గం నుండి: ఒక చిన్నమాట!!

రచన : సుజాత   దశాబ్దాల తరబడి అలవాటు పడిపోయాం! అడుగు పెట్టిన ప్రతి చోటా అవినీతి స్వాగతం చెప్తుంటే కొన్నాళ్ళకి అదేదో మామూలు విషయంగా మారిపోయి దాన్ని పెంచి పోషిస్తూ, అప్పుడప్పుడూ మనమూ దానికి కొమ్ము కాస్తూ, నిత్య జీవితంలో దాన్ని ఆక్సిజన్ కంటే అవసరంగా మార్చుకున్నాం! అయినా లోపల ముల్లుగా గుచ్చుతున్న అసౌకర్యాన్ని మాత్రం కడుపులో నిప్పులా భరిస్తూ వచ్చాం! అతి తక్కువ స్థాయి ఉద్యోగి నుంచీ మంత్రులూ, దేశపాలకుల వరకూ అవినీతి మంత్రం […]

ఆహా! ఆంధ్రమాతా? నమో నమ:

— రచన:  ?????? (మీరే చెప్పాలి)   మన బ్లాగ్లోకంలో వంటలు రాసేవాళ్ళు చాలా మందే ఉన్నారు….అదేంటీ, వంటలు వండుతారుగాని రాయటమేమిటీ అంటారా…..ఏమో మరి వాళ్ళంతా రాస్తుంటారు(నిజంగా వండుతారో లేదో తెలీదుగాని..;)..)…..ఒకాయన “బ్లాగునలుడూ”, ఇంకొకాయన  “బ్లాగుభీముడూ”…… ఒకావిడ ఆరో, పదారో,నూటయాభైయ్యారో “రుచులు”తెగ రాసేస్తుంటుంది…..మరొకావిడ “రుచులు” అని చెప్పి తెగ టెంప్ట్ చేసేస్తుంటుంది…..:)….. మరి వాళ్ళందరూ రాయగాలేంది నేను రాస్తే తప్పేవిఁట్టా! ఆహాఁ ఏంటీ తప్పు అనడుగుతున్నా….అందుకని వాళ్ళకన్నా గొప్పగా వండలేకపోయినా సారీ రాయలేకపోయినా, వాళ్ళల్లో ఒకళ్ళగానన్నా కాకపోతానా […]

ఏ రాయైతేనేం?

రచన : డా.శ్రీనివాస చక్రవర్తి  గడియారం పది గంటలు కొట్టింది. పగలు కాదు రాత్రి.  దిక్కుమాలిన టీవీ చూసి చూసి కళ్ళు లాగుతున్నాయి. దిక్కుమాలిన సోఫాలో కూర్చునీ కూర్చునీ కాళ్ళు లాగుతున్నాయి. ఇంత రాత్రయ్యింది. తను ఎప్పుడొస్తుందో తెలీదు. ‘ఇప్పుడే రాదులే పద డాళింగ్!’ అంటూ పీకపట్టుకుని నిద్రాదేవి వత్తిడి చేసింది. ‘ఛస్!ఊరుకో!’అనడానికి కూడా ఓపిక లేదు. ఇంతలో బాంబుపడ్డట్టు పెద్ద చప్పుడు. తుళ్ళిపడి నిద్రాదేవి పీక వదిలేసింది. కాస్త తేరుకుని కళ్ళు నులుముకున్నాను. ‘ట్రింగ్!’మళ్లీ అదే […]

కూచిపూడి – నాతొలిఅడుగులు

రచన: తరంగిణి || శ్రీ గురుభ్యోన్నమః || ||శ్రీ పర దేవతాయై నమః||         చిన్నప్పుడు దూరదర్శన్ లో చూసిన డాన్సుప్రోగ్రాముల వల్లనో, లేక చదివిన పుస్తకాల వల్లనో సంప్రదాయ శాస్త్రీయ నృత్యమంటే ఒక రకమైన యిష్టం, నేర్చుకోవాలనే ఒకలాంటి తపన ఉండేవి….సంగీత,నాట్యాలమీద నా ఆసక్తి చూసి,పల్లెటూళ్ళో ఉండటం మూలాన మాకు ఏమీ నేర్పించలేక పోతున్నందుకు నాన్న తెగ బాధపడుతుండేవారు…   సెలవులకి వెళ్ళినపుడు అక్క దగ్గర సంగీతంలో కాసిన్ని పదనిసలు పలకడం, […]